News
News
X

Realme New 5G Phone: రియల్‌మీ బడ్జెట్ 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. ధర రూ.15 వేలలోపే!

Realme V11s 5G: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త బడ్జెట్ 5జీ ఫోన్ రియల్‌మీ వీ11ఎస్‌ను త్వరలో లాంచ్ చేయనున్నట్లు సమాచారం. దీని స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.

FOLLOW US: 
 
రియల్‌మీ వీ11ఎస్ స్మార్ట్‌ఫోన్ త్వరలో లాంచ్ కానుందని సమాచారం. బడ్జెట్ ధరలోనే 5జీతో ఈ ఫోన్ లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో చైనాలో లాంచ్ అయిన రియల్‌మీ వీ11 తరహాలోనే దీని స్పెసిఫికేషన్లు ఉండనున్నాయని తెలుస్తోంది. దీని డిజైన్ కూడా కొత్తగా ఉండనుంది. రియల్‌మీ వీ11లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ కూడా ఇందులో అందుబాటులో ఉంది.

చైనీస్ మైక్రోబ్లాగింగ్ ఫోరం వీబోలో దీనికి సంబంధించిన వివరాలను ప్రముఖ టిప్‌స్టర్ లీక్ చేశారు. దీన్ని బట్టి ఇందులో 128 జీబీ స్టోరేజ్ ఉండనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండనుంది. ఇందులో ఎల్సీడీ డిస్‌ప్లేను అందించనున్నట్లు తెలుస్తోంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్ లేదా 90 హెర్ట్జ్‌గా ఉండే అవకాశం ఉంది.

రియల్‌మీ వీ11 చైనాలో 1,199 యువాన్ల(సుమారు రూ.13,500) ధరతో లాంచ్ అయింది. ఇది 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. వైబ్రంట్ బ్లూ, క్వైట్ గ్రే రంగుల్లో ఈ ఫోన్ చైనా మార్కెట్లో ఎంటర్ అయింది. అయితే ఈ ఫోన్‌ను రియల్‌మీ మనదేశంలో లాంచ్ చేయలేదు. బడ్జెట్ 5జీ ఫోన్లకు మనదేశంలో డిమాండ్ పెరుగుతుంది కాబట్టి త్వరలో దీన్ని మనదేశంలో కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది.

రియల్‌మీ వీ11ఎస్ కూడా లోబడ్జెట్‌లోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. రియల్‌మీ వీ11 5జీలో 6.52 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గా ఉంది.  ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 

News Reels

 ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. దీని ద్వారా ఫోన్‌ను 0.3 సెకన్లలో అన్‌లాక్ చేయవచ్చు. ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ సపోర్ట్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

5జీ, డ్యూయల్ 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ కనెక్టివిటీ ఫీచర్లను కంపెనీ ఇందులో అందించింది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.84 సెంటీమీటర్లు కాగా, బరువు 186 గ్రాములుగా ఉంది.

Also Read: Xiaomi 11 Lite 5G NE: షియోమీ కొత్త 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. సెప్టెంబర్ 29న లాంచ్.. ధర ఎంత ఉండవచ్చంటే?
Also Read: Nokia G10: కొత్త ఫోన్ లాంచ్ చేసిన నోకియా.. ధర రూ.13 వేలలోపే.. జియో యూజర్లకు స్పెషల్ ఆఫర్స్!
Also Read: iPhone 13: ఐఫోన్ 13 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం.. కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్!

Published at : 20 Sep 2021 04:44 PM (IST) Tags: Realme Realme V11s Realme V11s 5G Realme V11s Specifications Leaked Realme Upcoming 5G Phone Realme New 5G Phone

సంబంధిత కథనాలు

Realme 10 Pro 5G: రూ.20 వేలలోపే 108 మెగాపిక్సెల్ కెమెరా, 5జీ వంటి ఫీచర్లు - రియల్‌మీ 10 ప్రో వచ్చేసింది!

Realme 10 Pro 5G: రూ.20 వేలలోపే 108 మెగాపిక్సెల్ కెమెరా, 5జీ వంటి ఫీచర్లు - రియల్‌మీ 10 ప్రో వచ్చేసింది!

WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - ప్రతి యూజర్‌కు పర్సనలైజ్డ్‌గా?

WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - ప్రతి యూజర్‌కు పర్సనలైజ్డ్‌గా?

Twitter Subscription Hike: ఐఫోన్‌ యూజర్లకు ఎలన్‌ మస్క్‌ షాక్‌ - ఆండ్రాయిడ్‌ వాళ్లు సేఫ్‌!

Twitter Subscription Hike: ఐఫోన్‌ యూజర్లకు ఎలన్‌ మస్క్‌ షాక్‌ - ఆండ్రాయిడ్‌ వాళ్లు సేఫ్‌!

Realme 10 Pro Plus 5G: రియల్‌మీ 10 ప్రో ప్లస్ వచ్చేసింది - శాంసంగ్, ఐకూ, మోటొరోలా టాప్ ఫోన్లతో పోటీ!

Realme 10 Pro Plus 5G: రియల్‌మీ 10 ప్రో ప్లస్ వచ్చేసింది - శాంసంగ్, ఐకూ, మోటొరోలా టాప్ ఫోన్లతో పోటీ!

Google Year in Search: ఈ సంవత్సరం గూగుల్‌లో ఇండియన్స్ ఎక్కువ సెర్చ్ చేసింది ఇవే!

Google Year in Search: ఈ సంవత్సరం గూగుల్‌లో ఇండియన్స్ ఎక్కువ సెర్చ్ చేసింది ఇవే!

టాప్ స్టోరీస్

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

తీవ్ర తుపానుగా మ్యాన్‌డౌస్- ఆరు జిల్లాల యంత్రాంగం అప్రమత్తం

తీవ్ర తుపానుగా మ్యాన్‌డౌస్- ఆరు జిల్లాల యంత్రాంగం అప్రమత్తం

Google Year in Search 2022: ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో అత్యధికంగా వెతికిన అంశాలు ఇవే!

Google Year in Search 2022: ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో అత్యధికంగా వెతికిన అంశాలు ఇవే!

Airport Metro : లండన్ మెట్రో ప్రమాణాలతో ఎయిర్‌పోర్టు మెట్రో - శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి !

Airport Metro :  లండన్ మెట్రో ప్రమాణాలతో ఎయిర్‌పోర్టు మెట్రో - శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి !