News
News
X

iPhone 13: ఐఫోన్ 13 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం.. కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్!

యాపిల్ ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ లను కంపెనీ ఇటీవలే లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. వీటికి సంబంధించిన ప్రీ ఆర్డర్లు మనదేశంలో ప్రారంభం అయ్యాయి.

FOLLOW US: 
Share:

ఐఫోన్ 13 సిరీస్ ప్రీ-ఆర్డర్లు మనదేశంలో ప్రారంభం అయ్యాయి. అమెజాన్, ఫ్లిప్ కార్ట్, యాపిల్ అధికారిక స్టోర్లలో వీటిని ప్రీ-ఆర్డర్ చేయవచ్చు. వీటిలో ఏ15 బ‌యోనిక్ చిప్, ఐవోఎస్ 15లు అందించారు.

ఐఫోన్ 13 సిరీస్ ధ‌ర‌
ఐఫోన్ 13 మినీలో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 128 జీబీ వేరియంట్ ధ‌ర రూ.69,900గా నిర్ణ‌యించారు. 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధ‌ర రూ.79,900గానూ, 512 జీబీ వేరియంట్ ధ‌ర రూ.99,900గానూ ఉంది. ఐఫోన్ 13లో కూడా మూడు వేరియంట్లే అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 128 జీబీ వేరియంట్ ధ‌ర రూ.79,900గా ఉంది. 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధ‌ర రూ.89,900గానూ, 512 జీబీ వేరియంట్ ధ‌ర రూ.1,09,900గానూ ఉంది.

ఐఫోన్ 13 ప్రో సిరీస్ ధ‌ర‌
ఐఫోన్ 13 ప్రోలో నాలుగు వేరియంట్లు అందించారు. వీటిలో 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధ‌ర రూ.1,19,900గా ఉంది. 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధ‌ర రూ.1,29,900గానూ, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధ‌ర రూ.1,49,900గానూ నిర్ణ‌యించారు. ఇక టాప్ ఎండ్ అయిన 1 టీబీ వేరియంట్ ధ‌ర రూ.1,69,900గానూ ఉంది. ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్‌లో కూడా నాలుగు వేరియంట్లే అందుబాటులో ఉన్నాయి. 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధ‌ర రూ.1,29,900గా నిర్ణ‌యించారు. 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధ‌ర రూ.1,39,900గానూ, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధ‌ర రూ.1,59,900గానూ ఉంది. ఇక టాప్ ఎండ్ అయిన 1 టీబీ వేరియంట్ కొనాలంటే రూ.1,79,900గా పెట్టాల్సిందే. ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న అత్యంత ఖ‌రీదైన ఐఫోన్ ఇదే. వీటి సేల్ సెప్టెంబ‌ర్ 24వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ స్పెసిఫికేష‌న్లు
ఐఫోన్ 13 మినీలో 5.4 అంగుళాలు, ఐఫోన్ 13లో 6.1 అంగుళాలు, ఐఫోన్ 13 ప్రోలో 6.1 అంగుళాలు, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ లో 6.7 అంగుళాల డిస్ ప్లేల‌ను యాపిల్ అందించింది. డాల్బీ విజ‌న్, హెచ్ డీఆర్10, హెచ్ఎల్‌జీ స‌పోర్ట్ కూడా ఇందులో అందించారు. ఈ నాలుగు ఫోన్లూ ఏ15 బ‌యోనిక్ ప్రాసెస‌ర్ల‌పైనే పనిచేయనున్నాయి.

ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ల్లో స‌ర్జిక‌ల్ గ్రేడ్ స్టెయిన్ లెస్ స్టీల్ ను అందించారు. ఇందులో నాలుగు కొత్త రంగుల‌ను యాపిల్ అందించింది. అవే గ్రాఫైట్, గోల్డ్, సిల్వ‌ర్, సియ‌ర్రా బ్లూ. ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీల్లో ఫ్లాట్ ఎడ్జ్ అల్యూమినియం ఫ్రేమ్ ల‌ను అందించారు. పింక్, బ్లూ, మిడ్ నైట్, స్టార్ నైట్, ప్రొడ‌క్ట్ రెడ్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయ‌వ‌చ్చు.

ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 మినీల్లో సరికొత్త వైడ్ యాంగిల్ కెమెరాను అందించారు. వీటిలో నైట్ మోడ్ కూడా వేగంగా ప‌నిచేయ‌నుంది. 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను యాపిల్ ఇందులో అందించింది. ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ల్లో 77 ఎంఎం టెలిఫొటో కెమెరాను అందించారు. ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13ల్లో వెన‌క‌వైపు రెండు కెమెరాలు ఉండ‌గా, ప్రో మోడ‌ళ్ల‌లో మూడు కెమెరాలు ఉన్నాయి.

ఐఫోన్ 12 ప్రో కంటే గంట‌న్న‌ర ఎక్కువ బ్యాక‌ప్ ను ఐఫోన్ 13 ప్రో అందించ‌నుంది. ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ కంటే రెండున్న‌ర గంట‌ల ఎక్కువ బ్యాక‌ప్ ను ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ అందించ‌నుంది. ఐఫోన్ 13 పూర్తి రోజు బ్యాట‌రీ లైఫ్ ను అందిస్తుంద‌ని పేర్కొంది. ఐఫోన్ 12 మినీ కంటే ఐఫోన్ 13 మినీ గంట‌న్న‌ర ఎక్కువ బ్యాట‌రీ బ్యాక‌ప్ ను అందించ‌నుంది.

Also Read: Moto New Phone: రూ.9 వేలలోపే మోటొరోలా కొత్త ఫోన్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Also Read: Realme Narzo 50: రియల్‌మీ కొత్త ఫోన్లు వచ్చేస్తున్నాయ్.. రూ.10 వేలలోపే!

Also Read: Xiaomi 11 Lite 5G NE: షియోమీ కొత్త 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. సెప్టెంబర్ 29న లాంచ్.. ధర ఎంత ఉండవచ్చంటే?

Published at : 19 Sep 2021 12:02 AM (IST) Tags: iPhone 13 iPhone 13 series iPhone 13 Price in India iPhone 13 Mini iPhone 13 Mini Price in India iPhone 13 Pro iPhone 13 Pro Price in India iPhone 13 Pro Max iPhone 13 Pro Max Price in India iPhone 13 Pro Series iPhone 13 Series Pre-Orders iPhone 13 Pro Series Pre-Orders

సంబంధిత కథనాలు

Samsung F14 5G: రూ.13 వేలలోపే శాంసంగ్ 5జీ ఫోన్ - 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా!

Samsung F14 5G: రూ.13 వేలలోపే శాంసంగ్ 5జీ ఫోన్ - 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా!

Jio IPL Plans: రూ.219కే రోజూ 3 జీబీ డేటా - అదనంగా 2 జీబీ కూడా - ఐపీఎల్ ముందు జియో కొత్త ప్లాన్లు!

Jio IPL Plans: రూ.219కే రోజూ 3 జీబీ డేటా - అదనంగా 2 జీబీ కూడా - ఐపీఎల్ ముందు జియో కొత్త ప్లాన్లు!

Samsung Galaxy M54 5G: 108 మెగాపిక్సెల్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో శాంసంగ్ 5జీ ఫోన్ - ఎలా ఉందో చూసేయండి!

Samsung Galaxy M54 5G: 108 మెగాపిక్సెల్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో శాంసంగ్ 5జీ ఫోన్ - ఎలా ఉందో చూసేయండి!

Nothing Ear 2: రేటుతో బెదరగొడుతున్న నథింగ్ - కొత్త ఇయర్‌బడ్స్ లాంచ్ - ఇంత పెడితే ఎవరైనా కొంటారా?

Nothing Ear 2: రేటుతో బెదరగొడుతున్న నథింగ్ - కొత్త ఇయర్‌బడ్స్ లాంచ్ - ఇంత పెడితే ఎవరైనా కొంటారా?

Data Transfer: కొత్త ఫోన్‌కు డేటా ట్రాన్స్‌ఫర్ మరింత ఈజీ - మెసేజ్‌లు, చాటింగ్‌లు, యాప్ డేటా కూడా!

Data Transfer: కొత్త ఫోన్‌కు డేటా ట్రాన్స్‌ఫర్ మరింత ఈజీ - మెసేజ్‌లు, చాటింగ్‌లు, యాప్ డేటా కూడా!

టాప్ స్టోరీస్

YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

YSRCP Reverse :   దెబ్బ మీద దెబ్బ  - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!

AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

AP Cag Report :  13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల

రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ,  మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల