By: ABP Desam | Updated at : 18 Sep 2021 07:56 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
రియల్‌మీ నార్జో 50 లీకైన ఫొటో(Source: OnLeaks/91Mobiles)
రియల్ మీ నార్జో 50 సిరీస్ మనదేశంలో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 24వ తేదీన మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ లాంచ్ ఈవెంట్ జరగనుంది. దీంతోపాటు రియల్ బ్యాండ్ 2, రియల్ మీ స్మార్ట్ టీవీ నియో కూడా మనదేశంలో లాంచ్ కానున్నాయి.
రియల్‌మీ నార్జో 50 సిరీస్‌లో రియల్‌మీ నార్జో 50ఐ, నార్జో 50ఏ ఉండనున్నాయి. ఇందులో మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌ను అందించనున్నారు. అయితే వీటి గురించి మిగతా స్పెసిఫికేషన్లు తెలియరాలేదు.
రియల్‌మీ నార్జో 50ఐ
గతంలో వచ్చిన లీకుల ప్రకారం.. ఇందులో 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్లు ఉండనున్నాయి. మింట్ గ్రీన్, కార్బన్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఇందులో హెచ్‌డీ+ డిస్‌ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనున్నాయని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మిగతా వివరాలు తెలియరాలేదు. అయితే ఈ ఫోన్ స్పెసిఫికేషన్లను బట్టి చూస్తే దీని ధర రూ.10 వేలలోపే ఉండే అవకాశం ఉంది.
రియల్‌మీ నార్జో 50ఏ
దీనికి సంబంధించిన రెండర్లు ఇటీవలే ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. దీని ప్రకారం.. ఈ ఫోన్‌లో పెద్ద కెమెరా మాడ్యూల్, వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇందులో ఉంది. ఇందులో డ్యూయల్ టోన్ డిజైన్‌ను అందించారు. గతంలో వచ్చిన నార్జో ఫోన్లలో వర్టికల్ డ్యూయల్ టోన్ ఉంటే.. ఇందులో మాత్రం హారిజంటల్ డ్యూయల్ టోన్ అందించారు.
సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. ఈ స్మార్ట్ ఫోన్ డిజైన్ పరంగా మిగతా ఫోన్ల కంటే కాస్త కొత్తగా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్‌గా ఉండనుందని, మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌ను ఇందులో అందించనున్నారని సమాచారం.
ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, 2 మెగాపిక్సెల్ పొర్‌ట్రెయిట్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉండనుంది. వాటర్ డ్రాప్ నాచ్ డిస్‌ప్లేను ఇందులో అందించనున్నట్లు తెలుస్తోంది.
రియల్ మీ జీటీ నియో 2 స్మార్ట్ ఫోన్ కూడా చైనాలో లాంచ్ కానుంది. సెప్టెంబర్ 22వ తేదీన ఈ ఫోన్ లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 65W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.
Also Read: Samsung Upcoming Phone: 108 మెగాపిక్సెల్ కెమెరాతో శాంసంగ్ కొత్త ఫోన్.. లాంచ్ అయ్యేది ఎప్పుడంటే?
Also Read: Redmi TV: రెడ్‌మీ కొత్త టీవీలు వచ్చేస్తున్నాయి.. రూ.20 వేలలోపే!
iQoo CGO Offer: గేమ్స్ ఎక్కువగా ఆడతారా - అయితే రూ.10 లక్షలు పొందే అవకాశం మీకే!
WhatsApp Job Scams: వాట్సాప్ జాబ్ స్కామ్స్ - వీరి ఉచ్చులో పడితే అంతే సంగతులు, ఇలా అస్సలు చేయొద్దు!
Galaxy F54 5G India: అదిరిపోయే కెమెరా, అద్భుతమైన ఫీచర్లు, Galaxy F54 5G లాంచింగ్ డేట్ ఫిక్స్
Coin On Railway Track: రైలు పట్టాలపై ఎప్పుడైనా నాణెం పెట్టారా? ఏమవుతుందో తెలుసా?
Top 5 smartphones: మంచి స్టోరేజ్, చక్కటి బ్యాటరీ ఫర్ఫార్మెన్స్- రూ.12,000 లోపు 5 బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే!
YS Viveka Murder Case: వైఎస్ భాస్కర్‌రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి
Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !
Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో
Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు