Infinix: ఇన్‌ఫీనిక్స్ కొత్త ఫోన్లు వచ్చేశాయ్.. రూ.9 వేలలోపు సూపర్ ఫీచర్లు.. ఫ్లిప్‌కార్ట్‌లో కొనేయచ్చు!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఇన్‌ఫీనిక్స్ మనదేశంలో ఇన్‌ఫీనిక్స్ హాట్ 11, హాట్ 11ఎస్ కొత్త స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేసింది.
ఇన్‌ఫీనిక్స్ మనదేశంలో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేసింది. అవే ఇన్‌ఫీనిక్స్ హాట్ 11, హాట్ 11ఎస్. వీటి ధర రూ.8,999 నుంచి ప్రారంభం కానుంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎక్స్ఓఎస్ 7.6 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్లు పనిచేయనున్నాయి. ఇన్‌ఫీనిక్స్ హాట్ 11ఎస్‌లో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్‌ప్లేను అందించారు.
ఇన్‌ఫీనిక్స్ హాట్ 11, హాట్ 11ఎస్ ధర
ఇన్‌ఫీనిక్స్ హాట్ 11 ధరను రూ.8,999గా ఉండగా, హాట్ 11ఎస్ ధరను రూ.10,999గా నిర్ణయించారు. ఈ రెండు ఫోన్లను ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. 7 డిగ్రీస్ పర్పుల్, ఎమరాల్డ్ గ్రీన్, పోలార్ బ్లాక్, సిల్వర్ వేవ్ రంగుల్లో ఇన్‌ఫీనిక్స్ హాట్ 11 ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఇన్‌ఫీనిక్స్ హాట్ 11ఎస్ 7 డిగ్రీస్ పర్పుల్, గ్రీన్ వేవ్, పోలార్ బ్లాక్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. ఇన్‌ఫీనిక్స్ హాట్ 11ఎస్ సేల్ సెప్టెంబర్ 21వ తేదీన జరగనుంది. హాట్ 11 సేల్ తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది.
ఇన్‌ఫీనిక్స్ హాట్ 11 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎక్స్ఓఎస్ 7.6 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. మీడియాటెక్ హీలియో జీ70 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఇందులో ఉండనున్నాయి. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకోవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు మరో కెమెరా కూడా ఉంది. ముందువైపు 8 మెగాపిక్సెల్ ఏఐ సెల్ఫీ కెమెరాను అందించారు. 5200 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. 10W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. దీని మందం 0.89 సెంటీమీటర్లుగానూ, బరువు 201 గ్రాములుగానూ ఉంది.
ఇన్‌ఫీనిక్స్ హాట్ 11ఎస్ స్పెసిఫికేషన్లు
ఈ ఫోన్ కూడా ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎక్స్ఓఎస్ 7.6 ఆపరేటింగ్ సిస్టంపైనే పనిచేయనుంది. ఇందులో 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్టీపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గానూ, యాస్పెక్ట్ రేషియో 20.5:9గానూ ఉంది. మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 4 జీబీ ర్యామ్‌ను ఇందులో అందించారు. 64 జీబీ స్టోరేజ్ కూడా ఉంది.
ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు ఒక 2 మెగాపిక్సెల్ సెన్సార్, ఒక ఏఐ పవర్డ్ లెన్స్ ఉన్నాయి. ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.88 సెంటీమీటర్లుగానూ, బరువు 205 గ్రాములుగానూ ఉంది.
Also Read: రియల్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. రూ.11 వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా!
Also Read: Affordable iPhone: ఈ చవకైన ఐఫోన్ ఇంక మనదేశంలో లేనట్లే.. మరో రెండు పాత ఐఫోన్లనూ నిలిపివేసిన యాపిల్!
Also Read: ప్రపంచంలో అత్యంత సురక్షితమైన ఆండ్రాయిడ్ ఫోన్ ఇదే.. ధర ఎంతంటే?