Moto New Phone: రూ.9 వేలలోపే మోటొరోలా కొత్త ఫోన్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
మోటొరోలా తన కొత్త ఫోన్ మోటో ఈ20ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటొరోలా తన కొత్త స్మార్ట్ ఫోన్ మోటో ఈ20ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రస్తుతానికి యూరోప్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇందులో హెచ్‌డీ+ డిస్‌ప్లే, యూనిసోక్ ప్రాసెసర్‌ను అందించారు. మోటో ఈ20లో వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
మోటో ఈ20 ధర
దీని ధరను 99.99 యూరోలుగా(సుమారు రూ.8,700) నిర్ణయించారు. ఇది 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. కోస్టల్ బ్లూ, గ్రాఫైట్ గ్రే రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. మనదేశంలో ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ కానుందో కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు.
మోటో ఈ20 స్పెసిఫికేషన్లు
స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఇందులో 6.5 అంగుళాల మ్యాక్స్‌విజన్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. 60 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఆక్టాకోర్ యూనిసోక్ టీ606 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఇందులో ఉండనున్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉంది. ఫోన్ వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్‌గా ఉంది. 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 4జీ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎఫ్ఎం రేడియో, యూఎస్‌బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ ఇందులో ఉన్నాయి. ఫోన్ వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. గూగుల్ అసిస్టెంట్‌కు ప్రత్యేకమైన బటన్ అందించారు. ఈ ఫోన్ మందం 0.85 సెంటీమీటర్లుగానూ, బరువు 184 గ్రాములుగానూ ఉంది.
Also Read: Realme Narzo 50: రియల్‌మీ కొత్త ఫోన్లు వచ్చేస్తున్నాయ్.. రూ.10 వేలలోపే!
Also Read: Samsung Upcoming Phone: 108 మెగాపిక్సెల్ కెమెరాతో శాంసంగ్ కొత్త ఫోన్.. లాంచ్ అయ్యేది ఎప్పుడంటే?
Also Read: Redmi TV: రెడ్‌మీ కొత్త టీవీలు వచ్చేస్తున్నాయి.. రూ.20 వేలలోపే!