(Source: ECI/ABP News/ABP Majha)
Xiaomi 11 Lite 5G NE: షియోమీ కొత్త 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. సెప్టెంబర్ 29న లాంచ్.. ధర ఎంత ఉండవచ్చంటే?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ తన కొత్త ఫోన్ షియోమీ 11 లైట్ 5జీ ఎన్ఈని సెప్టెంబర్ 29వ తేదీన మనదేశంలో లాంచ్ చేయనుంది.
షియోమీ 11 లైట్ 5జీ ఎన్ఈ స్మార్ట్ ఫోన్ మనదేశంలో సెప్టెంబర్ 29వ తేదీన లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. షియోమీ 11టీ, షియోమీ 11టీ ప్రోలతో పాటు యూరోప్‌లో ఈ వారం ప్రారంభంలో ఈ ఫోన్ లాంచ్ అయింది. గతంలో లాంచ్ అయిన ఎంఐ 11 లైట్‌కు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా ఈ ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. డాల్బీ విజన్ సపోర్ట్, క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్, 5జీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
షియోమీ 11 లైట్ 5జీ ఎన్ఈ లాంచ్ వివరాలు
షియోమీ 11 లైట్ 5జీ ఎన్ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీని షియోమీ ఇండియా తన అధికారిక ట్వీటర్ ఖాతా ద్వారా ప్రకటించింది. సెప్టెంబర్ 29వ తేదీన లాంచ్ ఈవెంట్‌కు సంబంధించిన మీడియా ఇన్వైట్లను కూడా షియోమీ ఇప్పటికే పంపించింది.
షియోమీ 11 లైట్ 5జీ ఎన్ఈ ధర(అంచనా)
షియోమీ 11 లైట్ 5జీ ఎన్ఈ ధర మనదేశంలో ఎంతగా ఉండనుందో తెలియరాలేదు. యూరోప్‌లో దీనికి సంబంధించిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 349 యూరోలుగా(సుమారు రూ.30,200) నిర్ణయించారు. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 399 యూరోలుగా(సుమారు రూ.34,500) ఉంది. మనదేశంలో రూ.25 వేల రేంజ్ నుంచి దీని ధర ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
షియోమీ 11 లైట్ 5జీ ఎన్ఈ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ 10-బిట్ ఫ్లాట్ ట్రూ కలర్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఇందులో అందించారు. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉండనుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 5 మెగాపిక్సెల్ టెలిమాక్రో షూటర్ ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 20 మెగాపిక్సెల్ కెమెరాను అందించనున్నారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 4250 ఎంఏహెచ్ కాగా, 33W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి. 5జీ, ఎన్ఎఫ్‌సీ, ఇన్‌ఫ్రారెడ్(ఐఆర్) బ్లాస్టర్ వంటి ఫీచర్లు కూడా షియోమీ అందించింది.
Also Read: Samsung Upcoming Phone: 108 మెగాపిక్సెల్ కెమెరాతో శాంసంగ్ కొత్త ఫోన్.. లాంచ్ అయ్యేది ఎప్పుడంటే?
Also Read: Moto New Phone: రూ.9 వేలలోపే మోటొరోలా కొత్త ఫోన్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Also Read: Realme Narzo 50: రియల్‌మీ కొత్త ఫోన్లు వచ్చేస్తున్నాయ్.. రూ.10 వేలలోపే!