iOS 15: ఐఫోన్లు వాడేవారికి గుడ్‌న్యూస్.. ఏటా ఒకసారి వచ్చే అప్‌డేట్ ఈరోజే.. అదిరిపోయే కొత్త ఫీచర్లు కూడా!
యాపిల్ తన ఐవోఎస్ 15, ఐప్యాడ్ ఓఎస్ 15, వాచ్ ఓఎస్ 8లను మనదేశంలో ఈరోజు రిలీజ్ చేయనుంది.
ఐవోఎస్ 15, ఐప్యాడ్ఓఎస్ 15 మనదేశంలో ఈరోజే లాంచ్ కానున్నాయి. తాజా ఐవోఎస్ అప్‌డేట్.. ఈ మధ్యే లాంచ్ అయిన ఐఫోన్లకు, ఏడో తరం ఐపోడ్ టచ్‌కు రానుంది. ఐప్యాడ్ఓఎస్ మాత్రం కొత్త ఐప్యాడ్ మోడళ్లకు రానుంది. ఐవోఎస్ 15లో షేర్‌ప్లే, అప్‌గ్రేడెడ్ ఫేస్ టైం వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక ఐప్యాడ్ఓఎస్ 15లో మల్టీటాస్కింగ్‌ను ఎన్‌హేన్స్ చేశారు. స్లైడ్ ఓవర్, స్ప్లిట్ వ్యూ, వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఐవోఎస్ 15, ఐప్యాడ్ఓఎస్ 15తో పాటు యాపిల్ వాచ్ యూజర్ల కోసం వాచ్ఓఎస్ 8ను కూడా అందిస్తున్నారు.
ఐవోఎస్ 15 అప్‌డేట్ వచ్చే ఐఫోన్లు ఇవే..
ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్, ఐఫోన్ ఎక్స్ఎస్, ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్, ఐఫోన్ ఎక్స్ఆర్, ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్, ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్, ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ ఎస్ఈ(2020) ఫోన్లకు ఈ అప్‌డేట్ రానుంది. దీంతోపాటు ఐపోడ్ టచ్(ఏడో తరం)కు కూడా యాపిల్ ఈ అప్‌డేట్‌ను అందించనుంది. ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్‌ల్లో ఇది ప్రీలోడెడ్‌గా రానుంది.
ఐవోఎస్ 15 డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?
ఒక్కసారి ఈ అప్‌డేట్ అందుబాటులోకి వచ్చాక.. సెట్టింగ్స్‌లో జనరల్ ఆప్షన్‌లోకి వెళ్లి, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు ఈ అప్‌డేట్ ఆటోమేటిక్‌గా ఫోన్‌లో డౌన్‌లోడ్ అవుతుంది. మీ యాపిల్ డివైస్‌లో మీరు ఆటోమేటిక్ డౌన్‌లోడ్ ఆప్షన్ ఎంచుకుంటే.. ఇది ఆటోమేటిక్‌గా మీ ఫోన్‌లో డౌన్‌లోడ్ అవుతుంది. మాక్ కంప్యూటర్ ద్వారా కూడా దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అప్‌డేట్ ప్రాసెసర్ ప్రారంభం అయ్యే ముందు ఐక్లౌడ్ లేదా కంప్యూటర్‌ను ఉపయోగించి డివైస్‌ను బ్యాకప్ చేసుకోవడం ఉత్తమం. దీనికి మీ ఫోన్‌లో చార్జింగ్ ఎక్కువ ఉండాలి. లేకపోతే అప్‌డేట్ చేసేటప్పుడు చార్జింగ్‌కు ప్లగ్ఇన్ చేసి ఉంచండి. అప్‌డేట్ ప్యాకేజ్ డౌన్‌లోడ్ చేసేటప్పుడు హైస్పీడ్ వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయి ఉంటే మంచిది.
ఐవోఎస్ 15 ఫీచర్లు
ఇందులో అందించిన ప్రధాన ఫీచర్ ఏంటంటే.. షేర్ ప్లే అని చెప్పవచ్చు. ఈ ఫీచర్ ద్వారా మీరు చూసే సినిమాను మీకు కావాల్సిన వారికి షేర్ చేయవచ్చు. ఫేస్ టైం కాల్స్‌లో స్క్రీన్ షేర్ చేసే ఫీచర్ కూడా ఈ తాజా ఐవోఎస్ అప్‌డేట్‌తో రానుంది. కొత్త మెమోజీ క్యారెక్టర్లు, మల్టీ కలర్డ్ హార్డ్‌వేర్, కొక్లియర్ ఇంప్లాంట్స్, ఆక్సిజన్ ట్యూబ్స్ వంటి యాక్సెసబిలిటీ కస్టమైజేషన్లు కూడా ఇందులో ఉన్నాయి.
మీరు వర్క్‌లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయకుండా ఉండేందుకు ఫోకస్ ఫీచర్‌ను కూడా యాపిల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. మీకు డిస్ట్రాక్షన్ తగ్గించడానికి డ్రైవింగ్, ఫిట్‌నెస్, గేమింగ్, మైండ్‌ఫుల్‌నెస్ వంటి ఆప్షన్లు ఇందులో అందించారు. ఇందులో నోటిఫికేషన్లను యాపిల్ రీడిజైన్ చేసింది కూడా. యాపిల్ మ్యాప్స్, సఫారీ, సిరిలు కూడా ఐవోఎస్ 15తో పాటు అప్‌డేట్ కానున్నాయి.
ఐప్యాడ్ఓఎస్ 15 కంపాటిబిలిటీ డివైసెస్, ఎలా డౌన్‌లోడ్ చేయాలి?
ఐప్యాడ్ ప్రో 12.9 అంగుళాలు(ఐదో తరం), ఐప్యాడ్ ప్రో 11 అంగుళాలు(మూడో తరం), ఐప్యాడ్ ప్రో 12.9 అంగుళాలు(నాలుగో తరం), ఐప్యాడ్ ప్రో 11 అంగుళాలు(రెండో తరం), ఐప్యాడ్ ప్రో 12.9 అంగుళాలు(మూడో తరం), ఐప్యాడ్ ప్రో 11 అంగుళాలు(మొదటి తరం), ఐప్యాడ్ ప్రో 12.9 అంగుళాలు(రెండో తరం), ఐప్యాడ్ ప్రో 12.9 అంగుళాలు(మొదటి తరం), ఐప్యాడ్ ప్రో 10.5 అంగుళాలు, ఐప్యాడ్ ప్రో 9.7 అంగుళాలు, ఐప్యాడ్ (ఎనిమిదో తరం), ఐప్యాడ్ (ఏడో తరం), ఐప్యాడ్ (ఆరో తరం), ఐప్యాడ్ (ఐదో తరం), ఐప్యాడ్ మినీ (ఐదో తరం), ఐప్యాడ్ మినీ 4, ఐప్యాడ్ ఎయిర్ (నాలుగో తరం), ఐప్యాడ్ ఎయిర్ (మూడో తరం), ఐప్యాడ్ ఎయిర్ 2లకు ఐప్యాడ్ఓఎస్ 15 అప్ డేట్ రానుంది. కొత్త ఐప్యాడ్, ఐప్యాడ్ మినీలో ఇది ప్రీలోడెడ్‌గా అందించనున్నారు.
మీ ఐప్యాడ్‌లో సెట్టింగ్స్‌లో జనరల్‌లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌కు వెళ్లడం ద్వారా దీన్ని అప్‌డేట్ చేసుకోవచ్చు. మీరు ఆటోమేటిక్ డౌన్‌లోడ్ ఆప్షన్ ఎంచుకుంటే అందుబాటులోకి రాగానే ఇది ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అవుతుంది.
ఐప్యాడ్ఓఎస్ 15 ఫీచర్లు
ఈ కొత్త ఐప్యాడ్ఓఎస్ 15 ద్వారా షేర్‌ప్లే, ఫోకస్ ఫీచర్లను ఇందులో కూడా యాపిల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. విడ్జెట్స్ సపోర్ట్‌తో కొత్త ఇంటర్‌ఫేస్‌ను కూడా ఈ అప్‌డేట్‌తో యాపిల్ అందించనుంది. దీంతో వినియోగదారులు సులభంగా మల్టీ టాస్కింగ్ చేయవచ్చు. దీంతోపాటు ఫేస్‌టైం, మెసేజెస్, సిరి కూడా అప్‌గ్రేడ్ కానున్నాయి.
యాపిల్ వాచ్ సిరీస్ 3 ఆపైబడిన వాచ్‌లన్నిటికీ వాచ్ఓఎస్ 8 అప్‌డేట్ రానుంది. మీ యాపిల్ వాచ్‌ను వైఫైకి కనెక్ట్ చేసుకుని దీన్ని ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ అప్‌డేట్ ద్వారా యాపిల్ వాచ్‌కు కూడా కొత్త ఫీచర్లు అందించారు.
Also Read: Nokia G10: కొత్త ఫోన్ లాంచ్ చేసిన నోకియా.. ధర రూ.13 వేలలోపే.. జియో యూజర్లకు స్పెషల్ ఆఫర్స్!
Also Read: Realme New 5G Phone: రియల్‌మీ బడ్జెట్ 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. ధర రూ.15 వేలలోపే!
Also Read: iPhone 13: ఐఫోన్ 13 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం.. కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్!