iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్‌లో ఆ ఫోన్ లేనట్లే.. యాపిల్ సంచలన నిర్ణయం!
టెక్ దిగ్గజం యాపిల్ వచ్చే సంవత్సరం లాంచ్ చేయనున్న ఐఫోన్ 14 సిరీస్‌లో ఐఫోన్ 14 మినీ ఉండబోవడం లేదని సమాచారం. ఐఫోన్ 12 మినీ సేల్స్ ఆశాజనకంగా లేకపోవడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
యాపిల్ ఐఫోన్ సిరీస్‌లో ఐఫోన్ 13 మినీనే చివరి ‘మినీ’ మోడల్ కానుందని తెలుస్తోంది. వచ్చే సంవత్సరం వచ్చే ఐఫోన్ 14 సిరీస్‌లో ఐఫోన్ 14 మినీ స్మార్ట్ ఫోన్ లేదని తెలుస్తోంది. గత సంవత్సరం లాంచ్ అయిన ఐఫోన్ 12 మినీ సేల్స్ అంతంత మాత్రంగానే ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. యాపిల్ తన మినీ మోడల్‌ను మొదటిసారి ఐఫోన్ 12 సిరీస్‌తో లాంచ్ చేసింది. తర్వాత ఈ సంవత్సరం లాంచ్ అయిన ఐఫోన్ 13 సిరీస్‌లో కూడా మినీ మోడల్ లాంచ్ అయింది.
ప్రముఖ టిప్‌స్టర్ జాన్ ప్రాసర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఐఫోన్ 14 మినీని యాపిల్ రూపొందించబోవడం లేదు. ఐఫోన్ 13 మినీనే చివరి మినీ మోడల్‌గా ఉండనుంది. ఒకవేళ మీరు మినీ మోడల్ కొనాలనుకుంటే ఐఫోన్ 13 మినీనే మీ చివరి అవకాశం అని ఆయన ట్వీట్‌లో తెలిపారు.
యాపిల్ తీసుకున్న ఈ నిర్ణయం కచ్చితమైనదా అని అడిగినప్పుడు.. యాపిల్ కచ్చితంగా ఈ నిర్ణయం తీసుకుందని, వచ్చే సంవత్సరం ఐఫోన్ 14 మినీ లాంచ్ కావడం లేదని ఆయన పేర్కొన్నారు. యాపిల్ అనలిస్ట్ మింగ్ చి కువో కూడా దీని గురించి గతంలోనే తెలిపారు. ఐఫోన్ 12 మినీ సేల్స్ చాలా తక్కువగా ఉండటంతో ఐఫోన్ 14 మినీ లాంచ్ ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఐఫోన్ 13 మినీ సేల్ కూడా ఇంకా ప్రారంభం కాలేదు.
ఐఫోన్ 14 మినీ లేకపోయినా... ఆ సిరీస్‌లో నాలుగు ఫోన్లు ఉండే అవకాశం ఉందని, వీటిలో రెండు మోడళ్లు హై ఎండ్, రెండు మోడళ్లు లో ఎండ్‌లో ఉండవచ్చని కువో పేర్కొన్నారు. లో ఎండ్ వేరియంట్లు 6.1 అంగుళాల డిస్‌ప్లే, హై ఎండ్ వేరియంట్లు 6.7 అంగుళాల డిస్‌ప్లేతో లాంచ్ కానున్నాయని తెలుస్తోంది.
ఐఫోన్ 12 మినీ తరహాలోనే ఐఫోన్ 13 మినీలో కూడా 5.4 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఏ డిస్‌ప్లేను అందించారు. ఐఫోన్ 13 మినీ బ్యాటరీ సామర్థ్యం ఐఫోన్ 13 కంటే తక్కువగా ఉంది. దీని మిగతా ఫీచర్లు మాత్రం ఐఫోన్ 13 తరహాలోనే ఉన్నాయి. వెనకవైపు రెండు కెమెరాలు, ఏ15 బయోనిక్ చిప్‌ను అందించారు.
ఐఫోన్ 13 మినీ ధర మనదేశంలో రూ.69,900 నుంచి ప్రారంభం కానుంది. ఇది 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. ఇందులో 256 జీబీ వేరియంట్ ధర రూ.79,900గానూ, 512 జీబీ వేరియంట్ ధర రూ.99,900గానూ ఉంది. అయితే ఐఫోన్ 14 సిరీస్ లాంచ్‌కు ఇంకా సంవత్సరం సమయం ఉంది. ఈ సంవత్సరంలో ఐఫోన్ 13 మినీ సేల్స్ పుంజుకుని హిట్టయితే.. ఐఫోన్ 14 మినీని కూడా యాపిల్ తీసుకొచ్చే అవకాశం ఉంది.
Also Read: Realme New 5G Phone: రియల్‌మీ బడ్జెట్ 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. ధర రూ.15 వేలలోపే!
Also Read: iPhone 13: ఐఫోన్ 13 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం.. కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్!