X

ఓటీటీ యాప్స్‌కు ఎంత మొబైల్ డేటా అవుతుందో తెలుసా.. ఐపీఎల్ మ్యాచ్‌లు, యూట్యూబ్ వీడియోలకు ఎంత అవసరం?

మనం మన మొబైల్స్‌లో రోజులో ఏదో ఒక సందర్భంలో వీడియోలు స్ట్రీమ్ చేస్తూ ఉంటాం. వీటిలో గంటలకు ఎంత డేటా ఖర్చు అవుతుందో తెలుసా?

FOLLOW US: 

2020లో కరోనావైరస్ వచ్చాక దేశంలో అందరూ ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగింది. దీంతోపాటు ఓటీటీ సబ్‌స్క్రైబర్లు కూడా పెరిగారు. గతంలో రోజుకు 1 జీబీ డేటా చాలు అనుకునే వారు కూడా.. ప్రస్తుతం రోజుకు 2 జీబీ ప్లాన్లు వేసుకుంటున్నారు. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు ఉన్న చాలామంది మొబైల్ డేటాతోనే వాటిని స్ట్రీమింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఓటీటీల్లో స్ట్రీమ్ చేసేటప్పుడు మనం ఉపయోగించే ప్లాట్‌ఫాం బట్టి డేటా కూడా వేగంగా అయిపోతూ ఉంటుంది. ఏయే ఓటీటీ యాప్స్ వాడితే ఎంత డేటా ఖర్చు అవుతుందో ఈ కథనంలో చూద్దాం..


1.  యూట్యూబ్
భారతదేశంలో ఎక్కువమంది ఉపయోగించే స్ట్రీమింగ్ సర్వీస్ లేదా వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం ఇదే. దీన్ని పూర్తి స్థాయి ఓటీటీ ప్లాట్‌ఫాం అనలేం కానీ.. ఇందులో అందుబాటులో ఉండే సినిమాలు, సిరీస్‌లకు కూడా కొదవ లేదు. యూట్యూబ్‌లో ఏయే రిజల్యూషన్‌లో వీడియోలు చూస్తే ఎంత డేటా ఖర్చు అవుతుందంటే..


144p రిజల్యూషన్: ఈ రిజల్యూషన్‌లో వీడియోలు చూస్తే గంటకు 30 నుంచి 90 ఎంబీ వరకు ఖర్చు అవుతుంది.
240p రిజల్యూషన్: ఇందులో వీడియోలు స్ట్రీమింగ్ చేసినట్లయితే గంటకు 180 నుంచి 250 ఎంబీ వరకు డేటా అయిపోతుంది.
360p రిజల్యూషన్: ఈ రిజల్యూషన్‌లో మీరు చూసే వీడియోలు కాస్త క్లారిటీగా కనిపిస్తాయి. ఇందులో స్ట్రీమ్ చేస్తే గంటకు 300 నుంచి 450 ఎంబీ వరకు ఖర్చు అవుతుంది.
480p రిజల్యూషన్: ఇందులో వీడియోలు చూస్తే గంటకు 480 నుంచి 660 ఎంబీ వరకు ఖర్చు అవుతుంది. అంటే 2 జీబీ అయిపోవడానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుందన్న మాట.
720p రిజల్యూషన్: ఇక్కడ నుంచి అన్ని రిజల్యూషన్లూ కాస్త ఎక్కువ డేటాను తినేస్తూ ఉంటాయి. 720పీ రిజల్యూషన్లో స్ట్రీమింగ్‌కు గంటకు 1.2 జీబీ నుంచి 2.7 జీబీ వరకు ఖర్చు అవుతుంది.
1080p రిజల్యూషన్: యూట్యూబ్‌లో చాలా వరకు వీడియోలకు మ్యాగ్జిజం రిజల్యూషన్ ఇదే ఉంటుంది. ఈ రేట్‌లో స్ట్రీమింగ్ చేస్తే గంటకు 2.5 జీబీ నుంచి 4.1 జీబీ వరకు డేటా అయిపోతుంది. అంటే మీరు 2 జీబీ ప్లాన్ ఉపయోగించే వాళ్లయితే.. మీ డేటా అయిపోవడానికి గంట కూడా పట్టదన్న మాట.
1440p లేదా 2K రిజల్యూషన్: ఇవి ఎక్కువగా మ్యూజిక్ వీడియోలకు అందుబాటులో ఉంటాయి. ఈ రిజల్యూషన్‌లో స్ట్రీమింగ్‌కు గంటకు 2.7 జీబీ నుంచి 8.1 జీబీ వరకు ఖర్చవుతుంది.
2160p లేదా 4K రిజల్యూషన్: యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్న హయ్యెస్ట్ రిజల్యూషన్ ఇదే. ఈ రిజల్యూషన్‌తో వీడియోలు చూస్తే గంటకు 5.5 జీబీ  నుంచి 23 జీబీ వరకు డేటా అయిపోతుంది. డేటా కళ్లముందే మాయం అయిపోవాలి అనుకున్నప్పుడు ఈ రిజల్యూషన్‌లో వీడియోలు స్ట్రీమ్ చేయవచ్చు.


2. డిస్నీప్లస్ హాట్‌స్టార్
నేటి నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. కాబట్టి మనదేశంలో రానున్న నెలరోజులు డిస్నీప్లస్ హాట్‌స్టార్‌కు అతుక్కుపోయే వాళ్లు ఎక్కువ మంది ఉంటారు. ​అంతేకాకుండా ఇప్పుడు ఇందులో బిగ్ బాస్ తెలుగుతో పాటు ఎన్నో లైవ్ చానెళ్లు, ఫ్రీ కంటెంట్ కూడా అందుబాటులో ఉంటుంది. డిస్నీ, హెచ్‌బీవో, ఏబీసీ వంటి అంతర్జాతీయ సర్వీసులకు సంబంధించిన కంటెంట్ కూడా మనదేశంలో డిస్నీప్లస్ హాట్ స్టార్‌లోనే అందుబాటులో ఉంటాయి. ఇందులో ఎంత రిజల్యూషన్ స్ట్రీమింగ్‌కు ఎంత డేటా అవుతుందంటే?


SD Resolution(480p వరకు): ఎస్‌డీ రిజల్యూషన్‌లో స్ట్రీమ్ చేస్తే గంటకు 250 ఎంబీ డేటా వరకు అవుతుంది.
HD Resolution(720p వరకు): డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో హెచ్‌డీ రిజల్యూషన్‌లో వీడియోలు చూస్తే గంటకు 640 ఎంబీ డేటా అవుతుంది.
Full HD Resolution(1080p వరకు): ఇక ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్‌లో అయితే గంటకు 1.3 జీబీ డేటా వరకు అయిపోతుంది. కాబట్టి ఐపీఎల్ చూసేటప్పుడు డేటాను రిజల్యూషన్‌కు తగ్గట్లు ప్లాన్ చేసుకోవడం బెటర్.


3. అమెజాన్ ప్రైమ్ వీడియో


అమెజాన్ ప్రైమ్‌లో సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమ్ చేసేవారు కూడా మనదేశంలో తక్కువేమీ కాదు. ఇందులో తెలుగుకు సంబంధించిన రీజనల్ కంటెంట్‌తో పాటు దేశంలోని బెస్ట్ వెబ్ సిరీస్‌లు అయిన మిర్జాపూర్, ఫ్యామిలీ మ్యాన్ వంటి వాటిని కూడా స్ట్రీమ్ చేయవచ్చు.


Data Saver: డేటా సేవర్ మోడ్‌లో మీరు స్ట్రీమ్ చేస్తే గంటకు 120 ఎంబీ డేటా వరకు అవుతుంది.
Good: ఇందులో మీరు కంటెంట్ స్ట్రీమ్ చేసినట్లయితే.. గంటకు 180 ఎంబీ వరకు డేటా అయిపోతుంది.
Better: బెటర్ మోడ్‌లో వీడియో స్ట్రీమింగ్‌కు గంటకు 720 ఎంబీ వరకు అవుతుంది.
Best: ఇక బెస్ట్ మోడ్‌లో అయితే గంటకు 1.82 జీబీ డేటా వరకు ఖర్చు అవుతుంది.


ఒకవేళ మీరు టీవీ లేదా ల్యాప్ టాప్ లో కంటెంట్ ను స్ట్రీమ్ చేస్తే.. ఎంత డేటా అవుతుందో దానికి సంబంధించిన యాప్‌లోనే చూసుకోవచ్చు.


4. నెట్‌ఫ్లిక్స్


నెట్‌ఫ్లిక్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నప్పటికీ.. మనదేశంలో ఆదరణ కాస్త తక్కువనే చెప్పాలి. నెట్‌ఫ్లిక్స్ ధరలు కాస్త ఎక్కువగా ఉండటం కూడా దీనికి ఒక కారణం. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు అయ్యే డేటా ఇదే..


Low Resolution: ప్రారంభ రిజల్యూషన్ మోడ్ అయిన ఇందులో స్ట్రీమ్ చేస్తే గంటకు 300 ఎంబీ డేటా అవుతుంది.
Medium Resolution: మీడియం రిజల్యూషన్‌లో వీడియోలను చూస్తే గంటకు 700 ఎంబీ వరకు డేటా ఖర్చవుతుంది.
High Resolution: మీరు చూసే డివైస్‌ని బట్టి హెచ్‌డీ కంటెంట్ స్ట్రీమింగ్ కు గంటకు 3 జీబీ వరకు అయిపోతుంది.
4K Ultra HD Resolution: యూట్యూబ్ తరహాలోనే నెట్‌ఫ్లిక్స్‌లో కూడా 4కేనే లాస్ట్. ఇందులో స్ట్రీమింగ్ కు గంటకు 7 జీబీ డేటా వరకు అవుతుంది.


Also Read: iPhone 13: ఐఫోన్ 13 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం.. కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్!
Also Read: Xiaomi 11 Lite 5G NE: షియోమీ కొత్త 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. సెప్టెంబర్ 29న లాంచ్.. ధర ఎంత ఉండవచ్చంటే?
Also Read: Moto New Phone: రూ.9 వేలలోపే మోటొరోలా కొత్త ఫోన్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Tags: Data Consumption on Streaming Apps Netflix Data Consumpation Data Usage of OTT Apps Youtube Data Usage DisneyPlus Hotstar Data Usage

సంబంధిత కథనాలు

Redmi Note 11T 5G: రూ.17 వేలలోనే రెడ్‌మీ సూపర్ 5జీ ఫోన్.. రెండు రోజుల్లో మార్కెట్లోకి!

Redmi Note 11T 5G: రూ.17 వేలలోనే రెడ్‌మీ సూపర్ 5జీ ఫోన్.. రెండు రోజుల్లో మార్కెట్లోకి!

Google Search: గూగుల్ సెర్చ్‌లో కొత్త ఫీచర్.. కళ్లకు ఊరటనిచ్చేలా.. ఇలా ఆన్ చేసుకోండి!

Google Search: గూగుల్ సెర్చ్‌లో కొత్త ఫీచర్.. కళ్లకు ఊరటనిచ్చేలా.. ఇలా ఆన్ చేసుకోండి!

DL Renewal: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

DL Renewal: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

Samsung A03: శాంసంగ్ కొత్త బడ్జెట్ ఫోన్ వచ్చేసింది... ధర రూ.10 వేలలోపే?

Samsung A03: శాంసంగ్ కొత్త బడ్జెట్ ఫోన్ వచ్చేసింది... ధర రూ.10 వేలలోపే?

Budget Mobile: రూ.6 వేలలోనే స్మార్ట్ ఫోన్.. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, సూపర్ ఫీచర్లు!

Budget Mobile: రూ.6 వేలలోనే స్మార్ట్ ఫోన్.. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, సూపర్ ఫీచర్లు!

టాప్ స్టోరీస్

Bimbisara Teaser: పొగరుతో రాజ్యం మీసం మెలేస్తే... బింబిసారుడిగా కత్తి దూసిన కల్యాణ్ రామ్! చూశారా?

Bimbisara Teaser: పొగరుతో రాజ్యం మీసం మెలేస్తే... బింబిసారుడిగా కత్తి దూసిన కల్యాణ్ రామ్! చూశారా?

Shiva Shankar Master: అవకాశాలు రాక... నృత్య ప్రదర్శనలకు డబ్బుల్లేక...  సినిమాల్లోకి! ఇదీ శివ శంకర్ మాస్టర్ జర్నీ!

Shiva Shankar Master: అవకాశాలు రాక... నృత్య ప్రదర్శనలకు డబ్బుల్లేక...  సినిమాల్లోకి! ఇదీ శివ శంకర్ మాస్టర్ జర్నీ!

In Pics: డాలర్ శేషాద్రి లేని వీఐపీ ఫోటోనే ఉండదు.. రాష్ట్రపతి నుంచి సీజేఐ దాకా.. అరుదైన ఫోటోలు

In Pics: డాలర్ శేషాద్రి లేని వీఐపీ ఫోటోనే ఉండదు.. రాష్ట్రపతి నుంచి సీజేఐ దాకా.. అరుదైన ఫోటోలు

Umarkot Shiv Mandir: శత్రుదేశంలో శివనామస్మరణ, రోజురోజుకీ పెరుగుతున్న శివలింగం అక్కడ ప్రత్యేకత..

Umarkot Shiv Mandir: శత్రుదేశంలో శివనామస్మరణ,  రోజురోజుకీ  పెరుగుతున్న శివలింగం అక్కడ ప్రత్యేకత..