Redmi Note 11T 5G: రూ.15 వేలలోపే రెడ్‌మీ 5జీ ఫోన్.. స్టోరేజ్‌ను ర్యామ్‌లా మార్చుకోవచ్చు.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
రెడ్‌మీ కొత్త బడ్జెట్ 5జీ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. అదే రెడ్‌మీ నోట్ 11టీ 5జీ.
![Redmi Note 11T 5G: రూ.15 వేలలోపే రెడ్‌మీ 5జీ ఫోన్.. స్టోరేజ్‌ను ర్యామ్‌లా మార్చుకోవచ్చు.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే? Redmi Note 11T 5G Launched in India Price From Rs 16999 Specifications Launch Offers Know in Detail Redmi Note 11T 5G: రూ.15 వేలలోపే రెడ్‌మీ 5జీ ఫోన్.. స్టోరేజ్‌ను ర్యామ్‌లా మార్చుకోవచ్చు.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/30/09de2777a0d72af41994513b31b752e8_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
రెడ్‌మీ నోట్ 11టీ 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. చైనాలో లాంచ్ అయిన రెడ్‌మీ నోట్ 11 5జీకి రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. రెడ్‌మీ నోట్ 11టీ 5జీలో 90 హెర్ట్జ్ డిస్‌ప్లేను అందించారు. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఇందులో హోల్ పంచ్ డిస్‌ప్లే, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉన్నాయి. రియల్‌మీ 8ఎస్ 5జీ, ఐకూ జెడ్3, లావా అగ్ని 5జీలతో ఈ ఫోన్ పోటీ పడనుంది.
రెడ్‌మీ నోట్ 11టీ 5జీ ధర
ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999గా ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999గానూ, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999గా ఉండనుంది.
లాంచ్ ఆఫర్ కింద దీనిపై రూ.1,000 తగ్గింపు అందించనున్నారు. ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డులు, ఈఎంఐ లావాదేవీల ద్వారా కొనుగోలు చేస్తే మరో రూ.1,000 తగ్గింపు లభించనుంది. అంటే ప్రారంభ వేరియంట్‌ను రూ.15 వేలలోపు ధరకే సొంతం చేసుకోవచ్చన్న మాట. ఈ ఫోన్ సేల్ డిసెంబర్ 7వ తేదీ నుంచి అమెజాన్, ఎంఐ.కాం, ఎంఐ హోం, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో జరగనుంది.
రెడ్‌మీ నోట్ 11టీ 5జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గానూ, యాస్పెక్ట్ రేషియో 20:9గానూ ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఇందులో అందించారు.
ఇందులో 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ అందుబాటులో ఉంది. స్టోరేజ్‌ను మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఇందులో ర్యామ్ బూస్టర్ ఫీచర్ కూడా ఉంది. దీని ద్వారా ఇన్‌బిల్ట్ స్టోరేజ్ నుంచి 3 జీబీని ర్యామ్‌గా ఉపయోగించుకోవచ్చు. అంటే మొత్తంగా 11 జీబీ వరకు ర్యామ్ పొందవచ్చన్నమాట. మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని మందం 0.87 సెంటీమీటర్లుగానూ, బరువు 195 గ్రాములుగానూ ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ కూడా అందుబాటులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఇన్‌ఫ్రారెడ్(ఐఆర్), యూఎస్‌బీ టైప్-సీ, 3.5 ఎంఎం ఆడియో జాక్ కూడా ఇందులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే రెండు రోజుల బ్యాకప్‌ను ఇది అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.
Also Read: ఈ సూపర్ ఇయర్‌బడ్స్ ధర భారీ తగ్గింపు.. ఏకంగా రూ.వేయికి పైగా.. ఇప్పుడు ఎంతంటే?
Also Read: రూ.17 వేలలోనే రెడ్‌మీ సూపర్ 5జీ ఫోన్.. త్వరలో మార్కెట్లోకి!
Also Read: OnePlus RT: మనదేశంలో వన్‌ప్లస్ కొత్త ఫోన్.. ఫీచర్లు సూపర్.. ధర ఎంతంటే?
Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)