Nothing Ear 1: ఈ సూపర్ ఇయర్‌బడ్స్ ధర భారీ తగ్గింపు.. ఏకంగా రూ.వేయికి పైగా.. ఇప్పుడు ఎంతంటే?
నథింగ్ ఇయర్ 1 ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌పై మనదేశంలో భారీ తగ్గింపును అందించారు. రూ.700 తగ్గింపు దీనిపై లభించడం విశేషం.
![Nothing Ear 1: ఈ సూపర్ ఇయర్‌బడ్స్ ధర భారీ తగ్గింపు.. ఏకంగా రూ.వేయికి పైగా.. ఇప్పుడు ఎంతంటే? Nothing Ear 1 Gets Price Cut of Rs 700 in India Know Details Nothing Ear 1: ఈ సూపర్ ఇయర్‌బడ్స్ ధర భారీ తగ్గింపు.. ఏకంగా రూ.వేయికి పైగా.. ఇప్పుడు ఎంతంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/27/ac12deac5874c7cb4c03efddff162f94_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
నథింగ్ ఇయర్ 1 ట్రూ వైర్‌లెస్ స్టీరియో(టీడబ్ల్యూఎస్) ఇయర్‌ఫోన్స్‌పై మనదేశంలో భారీ డిస్కౌంట్ అందించారు. వీటిపై రూ.700 తగ్గింపును అందించారు. అయితే ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫరా, లేకపోతే పర్మినెంట్ తగ్గింపా అనేది తెలియరాలేదు. ఈ సంవత్సరం జులైలోనే ఈ ఇయర్‌ఫోన్స్ మనదేశంలో లాంచ్ అయ్యాయి. వన్‌ప్లస్ సహవ్యవస్థాపకుడు కార్ల్ పెయ్ ఈ బ్రాండ్‌ను స్థాపించారు. ఇందులో ప్రీమియం ఫీచర్లను అందించారు.
నథింగ్ ఇయర్ బడ్స్ ధరను మొదట మనదేశంలో రూ.5,999కు లాంచ్ చేశారు. తర్వాత దీన్ని రూ.6,999కు పెంచారు. ఇప్పుడు తాజా తగ్గింపుతో ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఇయర్‌బడ్స్‌ను రూ.6,299కే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం అదనపు తగ్గింపు లభించనుంది. అంటే మొత్తంగా రూ.5,600 రేంజ్‌లోనే వీటిని కొనేయచ్చన్న మాట. దీనిపై నో కాస్ట్ ఈఎంఐ, ఆరు నెలల గానా ప్లస్ సబ్‌స్క్రిప్షన్ కూడా లభించనుంది.
నథింగ్ ఇయర్ 1 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
వీటి స్మార్ట్ ఫోన్ కేస్ డిజైన్ ప్రత్యేకంగా ఉండనుంది. ఇందులో ట్రాన్స్‌పరెంట్ కేస్‌ను కంపెనీ అందించింది. వైర్‌లెస్ చార్జింగ్‌ను కూడా ఇవి సపోర్ట్ చేయనుంది. యూఎస్‌బీ టైప్-సీ చార్జింగ్ పోర్టు ద్వారా దీన్ని చార్జ్ చేసుకోవచ్చు. ఒక్కో ఇయర్‌పీస్ 5 గంటల 35 నిమిషాల బ్యాటరీ బ్యాకప్‌ను అందించనుంది. మొత్తంగా 34 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను దీని కేస్ అందించనుంది. 10 నిమిషాల పాటు చార్జింగ్ పెడితే.. 8 గంటల ప్లేబ్యాక్ టైం లభించనుంది. వీటిలో 11.6 మిల్లీమీటర్ల డైనమిక్ డ్రైవర్లు అందించారు. బ్లూటూత్ 5.2 సపోర్ట్ కూడా ఇందులో ఉన్నాయి. ఎస్‌బీసీ, ఏఏసీ బ్లూటూత్ కోడెక్స్‌ను ఇవి సపోర్ట్ చేయనున్నాయి.
ఇందులో ప్లేబ్యాక్, నాయిస్ క్యాన్సిలేషన్, ట్రాన్స్‌పరెన్సీ మోడ్స్ కోసం టచ్ కంట్రోల్స్ అందించనున్నారు. వాల్యూమ్ కంట్రోల్ ఫీచర్ కూడా ఉంది.ఇందులో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్(ఏఎన్‌సీ) ఫీచర్ కూడా ఉంది. ఈ మధ్యకాలంలో వస్తున్న ప్రీమియం ఇయర్‌బడ్స్‌లో ఈ ఫీచర్‌ను అందిస్తున్నారు.
ఇందులో ఉన్న ఇన్ ఇయర్ డిటెక్షన్ ద్వారా మ్యూజిక్‌ను ప్లే, పాజ్ చేసుకునే అవకాశం ఉంది. టచ్ కంట్రోల్స్, నాయిస్ క్యాన్సిలేషన్ ఇంటెన్సిటీ సెట్టింగ్స్‌ను ఇయర్ 1 యాప్ ద్వారా కస్టమైజ్ చేసుకునే అవకాశం ఉంది. ఐవోఎస్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలకు ఈ యాప్ అందుబాటులో ఉండనుంది. ఈక్వలైజర్ సెట్టింగ్స్, ఫాస్ట్ పెయిరింగ్, ఫర్మ్‌వేర్ అప్‌డేట్స్, ఇన్ ఇయర్ డిటెక్షన్ కూడా ఇందులో అందించారు.
Also Read: OnePlus RT: మనదేశంలో వన్‌ప్లస్ కొత్త ఫోన్.. ఫీచర్లు సూపర్.. ధర ఎంతంటే?
Also Read: Infinix New Phone: రూ.6 వేలలోనే కొత్త స్మార్ట్‌ఫోన్.. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ.. మిగతా ఫీచర్లు?
Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!
Also Read: 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)