Redmi 14R: రూ.13 వేలలోపే షావోమీ కొత్త ఫోన్ - రెడ్‌మీ 14ఆర్ వచ్చేసింది!
Redmi New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రెడ్‌మీ చైనాలో తన కొత్త ఫోన్ లాంచ్ చేసింది. అదే రెడ్‌మీ 14ఆర్. దీని ధర మనదేశ కరెన్సీలో రూ.13 వేల నుంచి ప్రారంభం కానుంది.
Redmi 14R Launched: రెడ్‌మీ 14ఆర్ స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. షావోమీ సబ్ బ్రాండ్ లాంచ్ చేసిన ఈ లేటెస్ట్ ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌తో చైనీస్ మార్కెట్లోకి వచ్చింది. దీంతో పాటు 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 14 ఆధారిత షావోమీ హైపర్ఓఎస్ స్కిన్‌పై రెడ్‌మీ 14ఆర్ రన్ కానుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5160 ఎంఏహెచ్‌గా ఉంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఫోన్ వెనకవైపు 13 మెగాపిక్సెల్, ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి.
రెడ్‌మీ 14ఆర్ ధర (Redmi 14R Price)
ఈ ఫోన్ నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 1,099 చైనీస్ యువాన్లుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.13,000) నిర్ణయించారు. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,499 చైనీస్ యువాన్లుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.17,700), 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,699 చైనీస్ యువాన్లుగానూ (మనదేశ కరెన్సీలో సుమారు రూ.20,100), టాప్ ఎండ్ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,899 చైనీస్ యువాన్లుగానూ (మనదేశ కరెన్సీలో సుమారు రూ.22,500) గానూ ఉంది.
ఓషన్ బ్లూ, లావెండర్, ఆలివ్ గ్రీన్, షాడో బ్లాక్ కలర్ ఆప్షన్లలో రెడ్‌మీ 14 ఆర్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. మనదేశంలో ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ కానుందో కంపెనీ తెలపలేదు. కానీ త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం పుష్కలంగా ఉంది.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
రెడ్‌మీ 14ఆర్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Redmi 14R Specifications)
ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్ ఆపరేటింగ్ సిస్టంపై రెడ్‌మీ 14ఆర్ రన్ కానుంది. ఇందులో 6.68 అంగుళాల హెచ్‌డీ+ ఎల్సీడీ స్క్రీన్‌ను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. పీక్ బ్రైట్‌నెస్ 600 నిట్స్ వరకు ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.
ఈ ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా, మరో సెన్సార్ కూడా ఉంది. ఈ రెండో సెన్సార్ వివరాలు కంపెనీ రివీల్ చేయలేదు. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5160 ఎంఏహెచ్ కాగా, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే