Vivo Y01: రూ.9 వేలలోపే వివో స్మార్ట్ ఫోన్ - భారీ బ్యాటరీ, సూపర్ ఫీచర్లు!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త బడ్జెట్ ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. వివో వై01 పేరుతో లాంచ్ అయిన ఈ ఫోన్ ధర రూ.8,999గా ఉంది.
వివో మనదేశంలో కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే వివో వై01. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. రివర్స్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో హెచ్‌డీ+ డిస్‌ప్లే కూడా ఉంది.
వివో వై01 ధర
ఈ స్మార్ట్ ఫోన్ కేవలం ఒక్క వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంది. 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ వేరియంట్ ధరను రూ.8,999గా నిర్ణయించారు. ఎలిగెంట్ బ్లాక్, సఫైర్ బ్లూ రంగుల్లో వివో వై01 కొనుగోలు చేయవచ్చు. దీన్ని పూర్తిగా మనదేశంలోనే రూపొందించినట్లు వివో తెలిపింది.
వివో వై01 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 6.51 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 720 × 1600 పిక్సెల్స్‌గా ఉంది. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గానూ, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గానూ ఉంది. మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ కూడా ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
ఫోన్ వెనకవైపు 8 మెగాపిక్సెల్, ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాలను అందించారు. వివో వై01 బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 10W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 11.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ మొబైల్ పనిచేయనుంది.
ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఈ ఫోన్‌లో లేదు. ఫేస్ రికగ్నిషన్ మాత్రం అందించారు. డ్యూయల్ సిమ్, 4జీ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్, బైదు, గ్లోనాస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి. 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో అందించారు.
View this post on Instagram