Vivo X200 Pro: దాదాపు రూ.లక్ష ధరతో వచ్చిన వివో ఎక్స్200 ప్రో - అంత రేటు వర్తేనా?
Vivo New Phone: చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే వివో ఎక్స్200 ప్రో. దీని ధర మనదేశంలో రూ.94,999 నుంచి ప్రారంభం కానుంది.
Vivo X200 Pro Launched: వివో ఎక్స్200 ప్రో స్మార్ట్ ఫోన్ మనదేశంలో అధికారికంగా లాంచ్ అయింది. ఇందులో వెనకవైపు మూడు కెమెరాల సెటప్ ఉంది. వీటిలో 200 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని ఈ ఫోన్‌లో చూడవచ్చు. 90W ఫాస్ట్ ఛార్జింగ్‌ను వివో ఎక్స్200 ప్రో సపోర్ట్ చేయనుంది. 16 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512 జీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్‌ను అందించారు.
వివో ఎక్స్200 ప్రో ధర (Vivo X200 Pro Price in India)
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే మార్కెట్లో లాంచ్ అయింది. 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధర రూ.94,999గా నిర్ణయించారు. కాస్మోస్ బ్లాక్, టైటానియం గ్రే కలర్ ఆప్షన్లలో వివో ఎక్స్200 ప్రోను కొనుగోలు చేయవచ్చు. దీనిపై పలు బ్యాంక్ ఆఫర్లు అందించారు. దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయి. డిసెంబర్ 19వ తేదీ నుంచి వివో ఎక్స్200 ప్రో సేల్ ప్రారంభం కానుంది.
Also Read: వావ్ అనిపించే వివో ఫోన్ వచ్చేసింది - మార్కెట్లో ఎక్స్200 ఎంట్రీ - ధర ఎంత?
వివో ఎక్స్200 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Vivo X200 Pro Specifications)
ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ రన్ కానుంది. ఇందులో 6.78 అంగుళాల 1.5కే రిజల్యూషన్ ఎల్టీపీవో అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కూడా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్‌పై వివో ఎక్స్200 ప్రో పని చేయనుంది. 16 జీబీ ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512 జీబీ యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్‌ను ఈ ఫోన్‌లో అందించారు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు 200 మెగాపిక్సెల్ టెలిఫొటో ఐసోసెల్ హెచ్‌పీ9 సెన్సార్ అందించారు. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ను సపోర్ట్ చేయనుంది. దీంతోపాటు 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ సోనీ ఎల్‌వైటీ 818 సెన్సార్లు కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. ఇందులో వీ3 ప్లస్ ఇమేజింగ్ చిప్ కూడా ఉంది.
యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 5జీ, బైదు, జీపీఎస్, వైఫై, బ్లూటూత్ వీ5.4, గ్లోనాస్, గెలీలియో, క్యూజెడ్ఎస్ఎస్, నావిక్, ఏ-జీపీఎస్, నావిక్, ఓటీజీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, కలర్ టెంపరేచర్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ-కంపాస్, ఇన్‌ఫ్రారెడ్ బ్లాస్టర్, లేజర్ ఫోకస్ సెన్సార్, గైరో స్కోప్, ఫ్లికర్ సెన్సార్లు కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్‌పై మార్కెట్లో మంచి అంచనాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
Also Read: 2025 మే నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు - లిస్ట్‌లో ఏయే ఫోన్లు ఉన్నాయి?
Whether you’re into sleek sophistication or bold statements, there’s a color for every style in the #vivoX200Series.
— vivo India (@Vivo_India) December 13, 2024
Which one’s your pick?
Prebook now. https://t.co/0drUqeDBvf#vivoX200Series #ZeissImageGoFar pic.twitter.com/tJ3NA3AIa9