అన్వేషించండి

Vivo X200: వావ్ అనిపించే వివో ఫోన్ వచ్చేసింది - మార్కెట్లో ఎక్స్200 ఎంట్రీ - ధర ఎంత?

Vivo New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త స్మార్ట్ ఫోన్‌ను భారతీయ మార్కెట్లో లాంచ్ చేసింది. అదే వివో ఎక్స్200. దీని ధర మనదేశంలో రూ.65,999 నుంచి ప్రారంభం కానుంది.

Vivo X200 Launched: వివో ఎక్స్200 స్మార్ట్ ఫోన్ మనదేశంలో గురువారం లాంచ్ అయింది. మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ రన్ కానుంది. 5800 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని వివో ఎక్స్200లో అందించారు. చైనాలో అక్టోబర్‌లోనే ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. ఇప్పుడు మనదేశంలో కూడా ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేశారు.

వివో ఎక్స్200 ధర (Vivo X200 Price in India)
ఈ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో మార్కెట్లో లాంచ్ అయింది. ఇందులో 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.65,999గా నిర్ణయించారు. టాప్ ఎండ్ మోడల్ అయిన 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.71,999గా ఉంది. కాస్మిక్ బ్లాక్ నార్మల్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో వివో ఎక్స్200ను కొనుగోలు చేయవచ్చు. డిసెంబర్ 19వ తేదీ నుంచి దీనికి సంబంధించిన సేల్ ప్రారంభం కానుంది. ఈ ఫోన్‌పై తొమ్మిది నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ల కొనుగోలుపై పలు బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉండనున్నాయి.

Also Read: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!

వివో ఎక్స్200 స్పెసిఫికేషన్లు (Vivo X200 Specifications)
ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. 6.67 అంగుళాల అమోఎల్ఈడీ 8టీ ఎల్టీపీఎస్ 1.5కే రిజల్యూషన్ డిస్‌ప్లేను ఇందులో అందించారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్‌పై వివో ఎక్స్200 రన్ కానుంది. 16 జీబీ ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512 జీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ అందుబాటులో ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు జీస్ బ్రాండెడ్ కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్921 సెన్సార్‌ను అందించారు. దీంతోపాటు 50 మెగాపిక్సెల్ జేఎన్1 కెమెరా, 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్882 సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.

5జీ, వైఫై, బ్లూటూత్ వీ5.4, ఎన్ఎఫ్‌సీ, గెలీలియో, క్యూజెడ్ఎస్ఎస్, నావిక్, ఏ-జీపీఎస్, ఓటీజీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు అందుబాటులో ఉన్నాయి. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, కలర్ టెంపరేచర్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ-కంపాస్, ఫ్లికర్ సెన్సార్, గైరోస్కోప్, లేజర్ ఫోకస్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ బ్లాస్టర్ అందించారు. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా ఈ ఫోన్‌లో చూడవచ్చు. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68, ఐపీ69 రేటింగ్ అందించారు. దీని మందం 0.79 సెంటీమీటర్లు కాగా, బరువు 202 గ్రాములుగా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5800 ఎంఏహెచ్ కాగా, 90W ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది.

Also Read: అమెజాన్‌లో మంచి డిస్కౌంట్ ఉన్న బెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్స్ ఇవే - లిస్ట్‌లో హెచ్‌పీ, లెనోవో కూడా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Mohan Babu discharge: ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
Vivo X200: వావ్ అనిపించే వివో ఫోన్ వచ్చేసింది - మార్కెట్లో ఎక్స్200 ఎంట్రీ - ధర ఎంత?
వావ్ అనిపించే వివో ఫోన్ వచ్చేసింది - మార్కెట్లో ఎక్స్200 ఎంట్రీ - ధర ఎంత?
Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

విజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీరాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే నామినేషన్!ప్రియుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, ఫొటోలు వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Mohan Babu discharge: ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
Vivo X200: వావ్ అనిపించే వివో ఫోన్ వచ్చేసింది - మార్కెట్లో ఎక్స్200 ఎంట్రీ - ధర ఎంత?
వావ్ అనిపించే వివో ఫోన్ వచ్చేసింది - మార్కెట్లో ఎక్స్200 ఎంట్రీ - ధర ఎంత?
Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
CM Revanth Reddy: లగచర్ల దాడి ఘటనలో రైతుకు బేడీలు - సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
లగచర్ల దాడి ఘటనలో రైతుకు బేడీలు - సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
Crime News: కదిరిలో దారుణం - తల్లి ఫోన్ ఇవ్వలేదని గొంతుపై కత్తితో దాడి చేసిన యువకుడు
కదిరిలో దారుణం - తల్లి ఫోన్ ఇవ్వలేదని గొంతుపై కత్తితో దాడి చేసిన యువకుడు
Grandhi Srinivas: వైఎస్ఆర్‌సీపీకి  బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
వైఎస్ఆర్‌సీపీకి బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
Chattisgarh Encounter: దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
Embed widget