Vivo V25 Pro: ఊహించిన దాని కంటే తక్కువ ధరకే - లాంచ్ అయిన వివో వీ25 ప్రో!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో మనదేశంలో తన కొత్త ఫోన్ లాంచ్ చేసింది. అదే వివో వీ25 ప్రో.
వివో వీ25 ప్రో స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్ కూడా ఇందులో ఉంది. 5జీ సపోర్ట్ కూడా అందించారు. 6.56 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఈ ఫోన్‌లో ఉంది. వెనకవైపు మూడు కెమెరాలు కూడా అందించారు. ఈ ఫోన్ ధర రూ.40 వేల నుంచి ప్రారంభం కానుందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే అంతకంటే తక్కువ ధరకే లాంచ్ అవ్వడం విశేషం.
వివో వీ25 ప్రో ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.35,999 కాగా, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్, వివో ఆన్‌లైన్ స్టోర్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ప్యూర్ బ్లాక్, సెయిలింగ్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అయింది. హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.3,500 తగ్గింపు లభించనుంది.
వివో వీ25 ప్రో స్పెసిఫికేషన్లు
ఈ స్మార్ట్‌ఫోన్ 5జీ నెట్‌వర్క్, డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.56 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. 64 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ సెన్సార్లను వెనకవైపు అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.
డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ-కంపాస్, గైరోస్కోప్‌లు కూడా అందించారు.
ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్కభాగంలో ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4830 ఎంఏహెచ్ కాగా, 66W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.86 సెంటీమీటర్లు కాగా, బరువు 190 గ్రాములుగా ఉంది. ఫోన్‌తో పాటు బాక్స్‌లో అడాప్టర్ కూడా ఉండనుంది.
వివో ఇటీవలే టీ1ఎక్స్ స్మార్ట్ ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. ఇందులో 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999 కాగా, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999గా నిర్ణయించారు. గ్రావిటీ బ్లాక్, స్పేస్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
ఇందులో 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లే ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌పై వివో టీ1ఎక్స్ పనిచేయనుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 44W ఫాస్ట్ చార్జింగ్ కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 2 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.
Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!
Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!