అన్వేషించండి

Tecno Pova Neo 5G Sale: రూ.16 వేలలోపే టెక్నో 5జీ ఫోన్ - సేల్ ప్రారంభం!

టెక్నో కొత్త 5జీ ఫోన్ పోవా నియో 5జీ సేల్ ప్రారంభం అయింది.

టెక్నో పోవా నియో 5జీ స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. కంపెనీ అధికారిక వెబ్ సైట్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 810 5జీ ప్రాసెసర్‌పై టెక్నో పోవా నియో 5జీ పనిచేయనుంది. ఏకంగా 13 5జీ బ్యాండ్లను ఈ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్ కాగా, 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇందులో అందించడం విశేషం.

టెక్నో పోవా నియో 5జీ ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధర రూ.15,499గా ఉంది. సాఫైర్ బ్లాక్, స్ప్రింట్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ కొనవచ్చు. కంపెనీ వెబ్ సైట్లో దీని సేల్ ప్రారంభం అయింది.

టెక్నో పోవా నియో 5జీ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.8 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్టీటీపీఎస్ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్‌గా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత హైఓఎస్ 8.6 ఆపరేటింగ్ సిస్టంపై టెక్నో పోవా నియో 5జీ రన్ అవుతుంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు ఏఐ లెన్స్, క్వాడ్ ఫ్లాష్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.

4 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉండనుంది. మెమొరీ ఫ్యూజన్ ర్యామ్ ఫీచర్ ద్వారా ర్యామ్‌ను మరో 3 జీబీ వరకు పెంచుకోవచ్చు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్ కాగా, 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.

డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.0 కనెక్టివిటీని ఈ ఫోన్‌లో అందించారు. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, డీటీఎస్ ఆడియో టెక్నాలజీ కూడా ఉన్నాయి. ఫోన్ పక్కన భాగంలో ఉన్న ఫింగర్ ప్రింట్ సెన్సార్ ద్వారా ఫోన్ అన్‌లాక్ చేయవచ్చు.

Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?

View this post on Instagram
 
A post shared by Maa Vaishno it zone (@mvitzone)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TDP Foundation Day: తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన జెండా, పీకపై కత్తిపెట్టినా ‘జై తెలుగుదేశం’ నినాదం: చంద్రబాబు
తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన జెండా, పీకపై కత్తిపెట్టినా ‘జై తెలుగుదేశం’ నినాదం: చంద్రబాబు
Telangana News: రేషన్ కార్డులు లేని వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, ఉగాది నుంచి కొత్త స్కీమ్ ప్రారంభం
రేషన్ కార్డులు లేని వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, ఉగాది నుంచి కొత్త స్కీమ్ ప్రారంభం
MS Dhoni Trolling:  కెరీర్లో ఇదే లో పాయింట్.. 9వ స్థానంలో బ్యాటింగ్ ఏంది తలా..? రిటైర‌యిపో.. ధోనీపై భ‌గ్గుమ‌న్న ఫ్యాన్స్ 
కెరీర్లో ఇదే లో పాయింట్.. 9వ స్థానంలో బ్యాటింగ్ ఏంది తలా..? రిటైర‌యిపో.. ధోనీపై భ‌గ్గుమ‌న్న ఫ్యాన్స్ 
100 Most Powerful Indians: దేశంలో అత్యంత శ‌క్తిమంతుల జాబితాలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి - లిస్టులోకి పవన్ కళ్యాణ్ ఎంట్రీ
దేశంలో అత్యంత శ‌క్తిమంతుల జాబితాలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి - లిస్టులోకి పవన్ కళ్యాణ్ ఎంట్రీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs RCB Match Highlights IPL 2025 | 17ఏళ్ల తర్వాత చెన్నైలో ఆర్సీబీపై ఓటమి | ABP DesamMyanmar Bangkok Earthquake | మయన్మార్, బ్యాంకాక్ లను కుదిపేసిన భారీ భూకంపం | ABP DesamKavya Maran Goenka Different Emotions SRH vs LSG IPL 2025 | ఇద్దరు ఓనర్లలో.. డిఫరెంట్ ఎమోషన్స్ | ABP DesamSRH vs LSG Match Strategy Highlights IPL 2025 | హైప్ ఎక్కించుకుంటే రిజల్ట్ ఇలానే ఉంటుంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Foundation Day: తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన జెండా, పీకపై కత్తిపెట్టినా ‘జై తెలుగుదేశం’ నినాదం: చంద్రబాబు
తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన జెండా, పీకపై కత్తిపెట్టినా ‘జై తెలుగుదేశం’ నినాదం: చంద్రబాబు
Telangana News: రేషన్ కార్డులు లేని వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, ఉగాది నుంచి కొత్త స్కీమ్ ప్రారంభం
రేషన్ కార్డులు లేని వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, ఉగాది నుంచి కొత్త స్కీమ్ ప్రారంభం
MS Dhoni Trolling:  కెరీర్లో ఇదే లో పాయింట్.. 9వ స్థానంలో బ్యాటింగ్ ఏంది తలా..? రిటైర‌యిపో.. ధోనీపై భ‌గ్గుమ‌న్న ఫ్యాన్స్ 
కెరీర్లో ఇదే లో పాయింట్.. 9వ స్థానంలో బ్యాటింగ్ ఏంది తలా..? రిటైర‌యిపో.. ధోనీపై భ‌గ్గుమ‌న్న ఫ్యాన్స్ 
100 Most Powerful Indians: దేశంలో అత్యంత శ‌క్తిమంతుల జాబితాలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి - లిస్టులోకి పవన్ కళ్యాణ్ ఎంట్రీ
దేశంలో అత్యంత శ‌క్తిమంతుల జాబితాలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి - లిస్టులోకి పవన్ కళ్యాణ్ ఎంట్రీ
KKR Vs LSG Match Reschedule బీసీసీఐ కీలక నిర్ణయం- కోల్‌కతా, లక్నో మ్యాచ్ వాయిదా.. తేదీ మార్పుపై ప్రకటన
బీసీసీఐ కీలక నిర్ణయం- కోల్‌కతా, లక్నో మ్యాచ్ వాయిదా.. తేదీ మార్పుపై ప్రకటన
పుట్టినరోజు నాడే యువకుడి దారుణహత్య, కూతుర్ని ప్రేమిస్తున్నాడని గొడ్డలితో నరికిన యువతి తండ్రి
పుట్టినరోజు నాడే యువకుడి దారుణహత్య, కూతుర్ని ప్రేమిస్తున్నాడని గొడ్డలితో నరికిన యువతి తండ్రి
Quantum Valley: అమరావతిలో క్వాంటమ్ క్యంప్యూటింగ్ వ్యాలీ – ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం
అమరావతిలో క్వాంటమ్ క్యంప్యూటింగ్ వ్యాలీ – ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం
IPL 2025 CSK VS RCB Result Update :చేపాక్ గ‌డ్డ‌పై జెండా పాతిన ఆర్సీబీ.. 17 ఏళ్ల త‌ర్వాత సీఎస్కేపై విక్ట‌రీ.. పాటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్
చేపాక్ గ‌డ్డ‌పై జెండా పాతిన ఆర్సీబీ.. 17 ఏళ్ల త‌ర్వాత సీఎస్కేపై విక్ట‌రీ.. పాటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్
Embed widget