Dynamic Island: రెడీ అయిపోయిన కాపీ రాయుళ్లు - రియల్‌మీ, షావోమీల్లో యాపిల్ డైనమిక్ ఐల్యాండ్!
యాపిల్ డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్‌ను రియల్‌మీ ఫోన్లలో అందించడానికి కంపెనీ సిద్ధం అవుతోంది.
![Dynamic Island: రెడీ అయిపోయిన కాపీ రాయుళ్లు - రియల్‌మీ, షావోమీల్లో యాపిల్ డైనమిక్ ఐల్యాండ్! Realme Smartphones May Get Dynamic Island Like Feature Which was introduced in iPhone 14 Pro Creators Challenge Goes Live Dynamic Island: రెడీ అయిపోయిన కాపీ రాయుళ్లు - రియల్‌మీ, షావోమీల్లో యాపిల్ డైనమిక్ ఐల్యాండ్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/21/b85ab075fda47c874c63cec5a397aaa21663780963470252_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
యాపిల్ తరహా డైనమిక్ ఐలాండ్ మాదిరిగానే రియల్‌మీ కూడా ఒక ఫీచర్‌ను తీసుకురానుంది. దీన్ని తాజా కమ్యూనిటీ పోస్ట్ ద్వారా టీజ్ చేసింది. డైనమిక్ ఐలాండ్‌తో పెద్ద డిజైన్ మార్పుతో సెప్టెంబర్ 7న జరిగిన 'ఫార్ అవుట్' ఈవెంట్‌లో Apple iPhone 14 లైనప్‌ను లాంచ్ అయిన కొన్ని రోజుల తర్వాత, Android స్మార్ట్‌ఫోన్ తయారీదారులు కూడా ఈ కొత్త ఫీచర్‌ను తమ స్మార్ట్ ఫోన్లకు జోడించడాన్ని పరిశీలిస్తున్నారు. Realme తన స్మార్ట్‌ఫోన్‌లలో ఇలాంటి డిజైన్‌ను స్వీకరించడం గురించి సూచనలను పంచుకోవాలని దాని వినియోగదారులను కోరింది.
చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ ఫోన్‌లలో డైనమిక్ ఐలాండ్ లాంటి ఫీచర్‌ను అమలు చేయడానికి సంబంధించిన ఆలోచనలను సేకరించడానికి 'రియల్‌మీ ఐలాండ్ - క్రియేటర్స్ ఛాలెంజ్' అనే పోటీని కూడా ప్రారంభించింది. iPhone 14 Pro, iPhone 14 Pro Maxలో, నోటిఫికేషన్‌లు, యాక్టివిటీలను డిస్‌ప్లే చేయడానికి Apple కొత్త కెమెరా, Face ID కటౌట్‌ను ఉపయోగిస్తుంది.
రియల్‌మీ తన కమ్యూనిటీ ఫోరమ్‌లో 'రియల్‌మీ ఐలాండ్ - క్రియేటర్స్ ఛాలెంజ్' పోటీని ప్రారంభించింది, ఇది Realme పరికరాలలో డైనమిక్ ఐలాండ్‌ని ఎలా ఉపయోగించవచ్చనే దానిపై అభిమానుల ఆలోచనలు, అభిప్రాయాలను అడుగుతుంది. ప్రతిపాదిత సాఫ్ట్‌వేర్ ఫీచర్ కెమెరా కటౌట్‌ను మల్టీఫంక్షనల్ ఫీచర్‌గా మారుస్తుందని కంపెనీ పేర్కొంది. రియల్‌మీ తెలుపుతున్న దాని ప్రకారం, ఇన్‌కమింగ్ ఫోన్ కాల్‌లు, అలర్ట్‌లు, నోటిఫికేషన్‌లు, మరిన్నింటిని ప్రదర్శించడానికి కెమెరా హోల్ చుట్టూ ఉన్న యూఐ వివిధ ఆకారాలలోకి మారుతుంది.
ఆసక్తి ఉన్న వినియోగదారులు అధికారిక గ్లోబల్ కమ్యూనిటీ పేజీకి వెళ్లడం ద్వారా ఈ ఛాలెంజ్‌లో పాల్గొనవచ్చు. Realme డైనమిక్ ఐలాండ్ ఎలా కనిపించాలో, ఎలా పని చేయాలో వివరిస్తూ పాల్గొనేవారు డ్రాయింగ్‌లు, GIFలు లేదా టెక్స్ట్‌లను పోస్ట్ చేయవచ్చు. Realme "వాటి వాస్తవికత, సమగ్రత, సాధ్యత" ఆధారంగా మూడు ఉత్తమ ప్రతిపాదనలను ఎంచుకుంటుంది. దాని అధికారిక Facebook లేదా Instagram ఖాతాలో పోల్‌ను నిర్వహిస్తుంది. భవిష్యత్ అమలు కోసం దాని యూఐ డెవలపర్‌లు అత్యధికంగా ఓటు వేసిన సూచనను పరిగణనలోకి తీసుకుంటారని Realme ధృవీకరించింది.
పోటీకి సంబంధించిన ఎంట్రీలను సెప్టెంబర్ 21 వరకు సమర్పించవచ్చు. సంబంధిత పోల్ సెప్టెంబర్ 22వ తేదీన కంపెనీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో లైవ్ అవుతుంది. అత్యధికంగా ఓటు వేసిన ప్రతిపాదన సెప్టెంబర్ 24న ప్రదర్శితం అవుతుంది.
దాని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో డైనమిక్ ఐలాండ్ ఫీచర్‌ను కాపీ చేయాలని చూస్తున్న ఏకైక కంపెనీ రియల్‌మీ మాత్రమే కాదు. Xiaomi చైనా ప్రెసిడెంట్ Lu Weibing ఇటీవల వినియోగదారులు కంపెనీ హ్యాండ్‌సెట్‌లలో "స్మార్ట్ ఐలాండ్" ఫీచర్‌ను చూడాలనుకుంటున్నారా అని అడిగారు. Apple డైనమిక్ ఐలాండ్ ఫీచర్‌ను కొత్త iPhone 14 Pro, iPhone 14 Pro Maxలో లాంచ్ చేశారు. నోటిఫికేషన్‌లు, స్టేటస్ ఇండికేటర్‌లను ప్రదర్శించడానికి ఇది కొత్త మార్గాన్ని అందిస్తుంది. ఇది అలెర్ట్స్‌ను డిస్‌ప్లే చేయడానికి కొత్త కెమెరా, ఫేస్ ID కటౌట్‌ను ఉపయోగిస్తుంది.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)