News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Realme Narzo 60X 5G: కొత్త ఫోన్ కొనాలనుకుంటే కాస్త ఆగండి - రియల్‌మీ బడ్జెట్ 5జీ ఫోన్ లాంచ్ ఈ వారమే!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన 60ఎక్స్ 5జీ ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేయనుంది.

FOLLOW US: 
Share:

రియల్‌మీ నార్జో 60ఎక్స్, రియల్‌మీ బడ్స్ టీ300 మనదేశంలో ఈ వారమే లాంచ్ కానున్నాయి. రియల్‌మీ నార్జో 60ఎక్స్ స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ గతంలోనే టీజ్ చేసింది. రియల్‌మీ నార్జో 60 సిరీస్‌లో ఈ ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే రియల్‌మీ నార్జో 60, రియల్‌మీ నార్జో 60 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. వీటిలో రియల్‌మీ నార్జో 60లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్‌ను, రియల్‌మీ నార్జో 60 ప్రో 5జీలో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌ను అందించారు. ఈ రెండు ఫోన్లలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. వీటిలో బేస్ మోడల్‌లో 33W, ప్రో వేరియంట్లో 67W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లను అందించారు.

సెప్టెంబర్ 6వ తేదీన ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ కానుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 6వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ లాంచ్ కానుంది. గ్రీన్ కలర్ ఆప్షన్‌లో ఈ ఫోన్‌ను చూడవచ్చు. వెనకవైపు గుండ్రటి కెమెరా సెటప్‌ను చూడవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్‌తో పాటు రియల్‌మీ బడ్స్ టీ300 కూడా లాంచ్ కానున్నాయి. ఈ ఇయర్ బడ్స్ బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రావచ్చు.

రియల్‌మీ నార్జో 60ఎక్స్ స్పెసిఫికేషన్లు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్‌ను అందించనున్నారు. 8 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128 జీబీ యూఎఫ్ఎస్ 2.1 ఇన్‌బిల్ట్ స్టోరేజ్ కూడా ఉన్నాయి. ఇందులో 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లే అందుబాటులో ఉండనుంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, పీక్ బ్రైట్‌నెస్  680 నిట్స్‌గా ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత రియల్‌మీ యూఐ 4.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది.

ఇప్పటివరకు వచ్చిన లీకుల ప్రకారం... రియల్‌మీ నార్జో 60ఎక్స్ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్‌గా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్కభాగంలో అందించారు.

రియల్‌మీ బడ్స్ టీ300లో 12.4 ఎంఎం ఆడియో డ్రైవర్ ఉండనుందని సమాచారం. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో ఏడు గంటల ప్లేబ్యాక్‌ను ఇవి అందించనున్నాయని తెలుస్తోంది. 

Read Also: వాట్సాప్‌లో ఇకపై హై-క్వాలిటీ వీడియోలను పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?

Read Also: సెకండ్ హ్యాండ్ ఐఫోన్‌ కొంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

Read Also: మీ స్మార్ట్ ఫోన్ ఊరికే స్లో అయిపోతుందా? - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 04 Sep 2023 07:51 PM (IST) Tags: Realme Narzo 60X 5G Realme Narzo 60X 5G India Launch Realme Narzo 60X 5G Specifications Realme Narzo 60X 5G Expected Price

ఇవి కూడా చూడండి

Whatsapp Channels: ‘వాట్సాప్ ఛానెల్స్’ చిరాకు పెడుతున్నాయా? ఇలా హైడ్ చేసుకోండి!

Whatsapp Channels: ‘వాట్సాప్ ఛానెల్స్’ చిరాకు పెడుతున్నాయా? ఇలా హైడ్ చేసుకోండి!

iPhone 12 Flipkart Offer: ఆండ్రాయిడ్ మిడ్ రేంజ్ ఫోన్ రేట్‌కే యాపిల్ ఐఫోన్ - ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో సూపర్ ఆఫర్!

iPhone 12 Flipkart Offer: ఆండ్రాయిడ్ మిడ్ రేంజ్ ఫోన్ రేట్‌కే యాపిల్ ఐఫోన్ - ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో సూపర్ ఆఫర్!

Upcoming Mobiles: ఒకే రోజున ఐదు ఫోన్లు లాంచ్ - అక్టోబర్ 4న మొబైల్స్ పండగ!

Upcoming Mobiles: ఒకే రోజున ఐదు ఫోన్లు లాంచ్ - అక్టోబర్ 4న మొబైల్స్ పండగ!

Samsung Galaxy S23 FE: శాంసంగ్ మోస్ట్ అవైటెడ్ ఫోన్ లాంచ్‌కు రెడీ - వచ్చే వారంలోనే!

Samsung Galaxy S23 FE: శాంసంగ్ మోస్ట్ అవైటెడ్ ఫోన్ లాంచ్‌కు రెడీ - వచ్చే వారంలోనే!

Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?

Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?

టాప్ స్టోరీస్

Nobel Prize 2023 in Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం

Nobel Prize 2023 in Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం

APSRTC News: దసరాకు ఏపీఎస్ఆర్టీసీ 5,500 స్పెషల్‌ సర్వీసులు - ఈ నగరాల నుంచే

APSRTC News: దసరాకు ఏపీఎస్ఆర్టీసీ 5,500 స్పెషల్‌ సర్వీసులు - ఈ నగరాల నుంచే

AR Rahman: ఏఆర్ రెహమాన్‌కు ఆగ్రహం, సర్జన్స్ అసోసియేషన్‌పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా

AR Rahman: ఏఆర్ రెహమాన్‌కు ఆగ్రహం, సర్జన్స్ అసోసియేషన్‌పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా

Minister KTR: పంప్ హౌస్ వల్ల నిర్మల్ వాసుల కల సాకారమైంది, మంత్రి కేటీఆర్

Minister KTR: పంప్ హౌస్ వల్ల నిర్మల్ వాసుల కల సాకారమైంది, మంత్రి కేటీఆర్