News
News
X

Oppo A57e: ఒప్పో కొత్త ఫోన్ వచ్చేసింది - రూ.14 వేలలోపే సూపర్ ఫీచర్లు!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో మనదేశంలో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. అదే ఒప్పో ఏ57ఈ.

FOLLOW US: 

ఒప్పో ఏ57ఈ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో హెచ్‌డీ+ డిస్‌ప్లే, మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్, 13 మెగాపిక్సెల్ కెమెరాలు అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 33W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది.

ఒప్పో ఏ57ఈ ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధర రూ.13,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. బ్లాక్, గ్రీన్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

ఒప్పో ఏ57ఈ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత కలర్ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.56 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా అందించారు. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.

4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.2, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ రికగ్నిషన్ వంటి ఫీచర్లు అందించారు. దీని మందం 0.79 సెంటీమీటర్లు కాగా, బరువు 187 గ్రాములుగా ఉంది.

ఒప్పో రెనో 8జెడ్ స్మార్ట్ ఫోన్ ఇటీవలే థాయ్‌ల్యాండ్‌లో లాంచ్ అయింది. దీని ధరను 12,990 థాయ్‌ల్యాండ్ బాత్‌లుగా (సుమారు రూ.28,600) నిర్ణయించారు. ఈ ఫోన్ త్వరలోనే మనదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు.

క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కూడా ఇందులో ఉన్నాయి.  ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మోనో షూటర్, 2 మెగాపిక్సెల్ బొకే మాక్రో షూటర్లు అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్ కాగా, 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.

Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!

Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!

Published at : 02 Sep 2022 04:32 PM (IST) Tags: Oppo A57e Price in India Oppo A57e Oppo A57e Specifications Oppo A57e Features Oppo A57e Launched

సంబంధిత కథనాలు

Samsung Galaxy S24: శాంసంగ్ గెలాక్సీ ఎస్24లో సూపర్ ఫీచర్ - సెకనుకు 30 జీబీ ఇంటర్నెట్ స్పీడ్!

Samsung Galaxy S24: శాంసంగ్ గెలాక్సీ ఎస్24లో సూపర్ ఫీచర్ - సెకనుకు 30 జీబీ ఇంటర్నెట్ స్పీడ్!

Redmi Note 11 Pro 2023: త్వరలో రెడ్‌మీ నోట్ 11 2023 సిరీస్ లాంచ్ - ఓఎస్ డిటైల్స్ లీక్!

Redmi Note 11 Pro 2023: త్వరలో రెడ్‌మీ నోట్ 11 2023 సిరీస్ లాంచ్ - ఓఎస్ డిటైల్స్ లీక్!

WhatsApp document caption: అందుబాటులోకి నయా వాట్సాప్ ఫీచర్, ఇక డాక్యుమెంట్లను క్యాప్షన్‌తో షేర్ చేసుకోవచ్చు!

WhatsApp document caption: అందుబాటులోకి నయా వాట్సాప్ ఫీచర్, ఇక డాక్యుమెంట్లను క్యాప్షన్‌తో షేర్ చేసుకోవచ్చు!

Google Pixel 7 Pro: కెమెరాల్లో దీనికి యాపిల్ మాత్రమే పోటీ - గూగుల్ పిక్సెల్ 7 ప్రో వచ్చేసింది!

Google Pixel 7 Pro: కెమెరాల్లో దీనికి యాపిల్ మాత్రమే పోటీ - గూగుల్ పిక్సెల్ 7 ప్రో వచ్చేసింది!

Google Pixel 7: ఆండ్రాయిడ్ లేటెస్ట్ వెర్షన్‌తో గూగుల్ ఫోన్ - మనదేశంలో కూడా లాంచ్ - ధర ఎంతంటే?

Google Pixel 7: ఆండ్రాయిడ్ లేటెస్ట్ వెర్షన్‌తో గూగుల్ ఫోన్ - మనదేశంలో కూడా లాంచ్ - ధర ఎంతంటే?

టాప్ స్టోరీస్

Minister Karumuri On BRS : కేసీఆర్ కాదు కదా కేసీఆర్ తాత వచ్చినా మాకేం నష్టం లేదు, మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు

Minister Karumuri On BRS : కేసీఆర్ కాదు కదా కేసీఆర్ తాత వచ్చినా మాకేం నష్టం లేదు, మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Tirumala : తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ, యాత్ర వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి

Tirumala : తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ, యాత్ర వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి

కార్లకు ఐరన్ బంపర్ గార్డ్స్ పెట్టుకోవడం తప్పు అని మీకు తెలుసా? ఇన్సూరెన్స్ కూడా రాదు!

కార్లకు ఐరన్ బంపర్ గార్డ్స్ పెట్టుకోవడం తప్పు అని మీకు తెలుసా? ఇన్సూరెన్స్ కూడా రాదు!