అన్వేషించండి

OnePlus 12: టాప్ఎండ్ ప్రాసెసర్, మూడు సూపర్ కెమెరాలతో రానున్న వన్‌ప్లస్ 12 - ఫీచర్లు అన్నీ లీక్!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్‌ను రూపొందించే పనిలో ఉంది. అదే వన్‌ప్లస్ 12.

వన్‌ప్లస్ 12 స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ రూపొందిస్తుంది. ఈ ఫోన్ 2023 చివర్లో కానీ, 2024 ప్రారంభంలో కానీ ఈ ఫోన్ లాంచ్ కానుంది. లాంచ్‌కు ముందు ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. వన్‌ప్లస్ 12 మొబైల్‌లో అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2కే రిజల్యూషన్ ఫీచర్లు ఈ డిస్‌ప్లేలో ఉండనున్నాయి.

ఇంకా లాంచ్ అవ్వని క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌ను ఇందులో అందించనున్నట్లు సమాచారం. దీని బ్యాటరీ సామర్థ్యం 5400 ఎంఏహెచ్ కాగా, 100W వైర్డ్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. దీంతో పాటు 50W వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. ప్రముఖ టిప్‌స్టర్ స్టీవ్ హెచ్.మెక్‌ఫ్లై ఈ ఫీచర్లను లీక్ చేశారు.

లీకైన వివరాల ప్రకారం... ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.7 అంగుళాల ఫ్లూయిడ్ ఎల్టీపీవో అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. సెల్ఫీ కెమెరా కోసం ముందువైపు హోల్ పంచ్ కటౌట్ ఉండనుంది. క్వాల్‌కాం తర్వాతి తరం ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ 8 జెన్ 3 ప్రాసెసర్‌ను ఇందులో అందించనున్నారు. 16 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ ఉండనుంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 64 మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరా ఉండనుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ సెన్సార్ అందించనున్నారు. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, అలెర్ట్ స్లైడర్ కూడా ఈ ఫోన్‌లో ఉండనున్నాయి.

వన్‌ప్లస్ నార్డ్ 3 బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో ఇటీవలే లాంచ్ అయింది. ఇందులో రెండు వేరియంట్లు మార్కెట్లోకి వచ్చాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.33,999గా ఉంది. ఇక టాప్ ఎండ్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.37,999గా నిర్ణయించారు. మిస్టీ గ్రీన్, టెంపెస్ట్ గ్రే కలర్ ఆప్షన్లలో వన్‌ప్లస్ నార్డ్ 3 కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన సేల్ ఇప్పటికే అమెజాన్‌లో ప్రారంభం అయింది.

ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టంపై వన్‌ప్లస్ నార్డ్ 3 పని చేయనుంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్‌ ఈ ఫోన్‌లో ఉంది. 16 జీబీ ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ ఇందులో అందించారు. 6.74 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లే కూడా ఈ మొబైల్‌లో ఉంది. హెచ్‌డీఆర్10+ ఫీచర్‌ను కూడా వన్‌ప్లస్ నార్డ్ 3 సపోర్ట్ చేయనుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో హెచ్‌డీఆర్ కంటెంట్‌ను వన్‌ప్లస్ నార్డ్ 3లో స్ట్రీమ్ చేయవచ్చు.

ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్‌ సామర్థ్యమున్న సోనీ ఐఎంఎక్స్890 సెన్సార్‌ ఉంది. దీంతో పాటు 8 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్355 సెన్సార్‌ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాగా అందించారు. ఈ రెండిటితో పాటు 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 16 మెగా పిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.

Read Also: ఎప్పటికప్పుడు వెదర్ అప్ డేట్స్ తెలుసుకోవాలా? మీ ఫోన్ లో జస్ట్ ఈ సెట్టింగ్స్ చేస్తే సరిపోతుంది!

ముఖ్యమైనమరిన్ని ఆసక్తికర కథనాల కోసం టెలిగ్రామ్లో ఏబీపీ దేశంలో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget