By: ABP Desam | Updated at : 27 Apr 2022 06:42 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
ఐకూ జెడ్6 4జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. (Image Credits: iQoo)
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ మనదేశంలో కొత్త బడ్జెట్ ఫోన్ లాంచ్ చేసింది. అదే ఐకూ జెడ్6 4జీ. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 44W ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఐకూ జెడ్6 4జీ ధర
ఈ స్మార్ట్ ఫోన్‌లో రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,499గా ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999గా నిర్ణయించారు. లుమినా బ్లూ, రేవెన్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
ఐకూ జెడ్6 4జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఐకూ జెడ్6 4జీ పనిచేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.44 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని టచ్ శాంప్లింగ్ రేట్ 180 హెర్ట్జ్‌గా ఉంది. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ అందించారు. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 44W ఫ్లాష్‌చార్జ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. దీని మందం 0.84 సెంటీమీటర్లు కాగా... బరువు 182 గ్రాములుగా ఉంది.
కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 2 మెగాపిక్సెల్ బొకే కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కూడా ఉన్నాయి. ముందువైపు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంది.
4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు.
Also Read: OnePlus 10: వన్‌ప్లస్ 10 ఫీచర్లు లీక్ - లాంచ్ ఎప్పుడంటే?
Also Read: Realme GT 2: రియల్‌మీ కొత్త 5జీ ఫోన్ వచ్చేసింది - రూ.ఐదు వేల వరకు ఆఫర్ - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Samsung Galaxy A23 5G: శాంసంగ్ బడ్జెట్ 5జీ ఫోన్ వచ్చేస్తుంది - సూపర్ ఫీచర్లతో!
Vivo Y72t: వివో కొత్త 5జీ ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ధర బడ్జెట్లోనే!
Redmi Note 11SE: రూ.13 వేలలోపే రెడ్మీ కొత్త 5జీ ఫోన్ - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?
Tecno Pova 3: రూ.13 వేలలోనే 7000 ఎంఏహెచ్, 11 జీబీ వరకు ర్యామ్ ఉన్న ఫోన్ - అదిరిపోయే ఫీచర్లు కూడా!
Redmi 11 5G Launch: రెడ్మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!
Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు
Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?
Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!
Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!