OnePlus 10: వన్‌ప్లస్ 10 ఫీచర్లు లీక్ - లాంచ్ ఎప్పుడంటే?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ తన కొత్త ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అదే వన్‌ప్లస్ 10.
వన్‌ప్లస్ 10 స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. గతేడాది లాంచ్ అయిన వన్‌ప్లస్ 9కు తర్వాతి వెర్షన్‌గా ఇది లాంచ్ కానుంది. 6.7 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉండనున్నట్లు తెలుస్తోంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉండనున్నాయి. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 150W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.
వన్‌ప్లస్ 10 స్పెసిఫికేషన్లు (అంచనా)
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనున్నట్లు తెలుస్తోంది. 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో అందించనున్నారు. దీని రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండనుంది. ఎల్టీపీవో 2.0 టెక్నాలజీ కూడా ఇందులో అందించనున్నారు.
అయితే వన్‌ప్లస్ 10లో రెండు ప్రోటోటైప్స్ ఉన్నాయని తెలుస్తోంది. ఒక ప్రోటోటైప్‌ను క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌తో, మరో ప్రోటోటైప్‌ను మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్‌తో టెస్ట్ చేస్తున్నారు. దీన్ని బట్టి ఈ ఫోన్ ఇంకా ప్రాథమిక తయారీ దశలోనే ఉందని అంచనా వేయవచ్చు. 2022 ద్వితీయార్థంలో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
ఈ ఫోన్ కెమెరాల వివరాలు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. వీటి ప్రకారం... ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ సెన్సార్‌ను ప్రధాన కెమెరాగా అందించారు. దీంతోపాటు 16 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 4800 ఎంఏహెచ్‌గా ఉండనుంది. 150W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఈ ఫోన్‌లో అలెర్ట్ స్లైడర్ కూడా ఉండనుంది.
Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ట్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?
Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?
View this post on Instagram