Airtel 5G: 4జీ రేటుతోనే 5జీ - ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్ - టారిఫ్‌లపై ఫుల్ క్లారిటీ!
ఎయిర్‌టెల్ 5జీ రోల్అవుట్ మనదేశంలో ప్రారంభం అయింది. ప్రస్తుతానికి ఎనిమిది నగరాల్లో ఎయిర్‌టెల్ 5జీ అందుబాటులో ఉంది.
భారతదేశంలో 5జీ రేస్ మొదలైపోయింది. ఈ రేసులో ప్రస్తుతానికి ఎయిర్‌టెల్ కూడా ముందడుగు వేసింది. ఎయిర్‌టెల్ తన 5జీ సేవలను ప్రారంభించినట్లు ప్రకటించడమే కాకుండా, 5జీ టారిఫ్ ప్లాన్‌లను కూడా అప్‌డేట్ చేసింది. దీంతోపాటు ఏ నగరాల్లో అందుబాటులో ఉంటుందో కూడా ప్రకటించింది.
నోయిడా, మనేసర్, పుణే, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, భువనేశ్వర్, కోల్‌కతా నగరాల్లో ఎయిర్‌టెల్ ఈరోజు నుండి 5జీని విడుదల చేస్తోంది. జియో 5జీ రోల్‌అవుట్ దీపావళి నాటికి ప్రారంభం కానుండగా, ఎయిర్‌టెల్ ఇతర టెలికాం ఆపరేటర్‌ల కంటే ముందుంది. 2024 మార్చి నాటికి ఎయిర్‌టెల్ పాన్-ఇండియా రోల్‌అవుట్ చేయాలని యోచిస్తుండగా, జియో డిసెంబర్ 2023 నాటికే ఈ ఫీట్‌ను కంప్లీట్ చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తుంది.
టారిఫ్‌ల విషయానికొస్తే, ఎయిర్‌టెల్ 5జీ ప్లాన్‌ల ధర ప్రస్తుత 4జీ ప్లాన్‌ల మాదిరిగానే ఉంటుందని ఎయిర్‌టెల్ తెలిపింది. Airtel 5G ప్లాన్‌ల వాస్తవ ధర త్వరలో ప్రకటించనున్నారు. అప్పటి వరకు వినియోగదారులు 4జీ టారిఫ్‌లతోనే 5జీ స్పీడ్‌ను ఆనందించవచ్చు.
ఎయిర్‌టెల్ 5జీని అందుబాటులోకి తీసుకురావడానికి నాన్-స్టాండలోన్ ఆర్కిటెక్చర్‌ని (ఎన్ఎస్ఏ) ఉపయోగిస్తున్నారు. 4జీ నెట్‌వర్క్ ప్రస్తుత మౌలిక సదుపాయాలను ఉపయోగించుకోవడం ద్వారా, Airtel వారి కోర్ నెట్‌వర్క్ సాంకేతికతను పూర్తిగా పునర్నిర్మించకుండానే వేగవంతమైన, మరింత విశ్వసనీయమైన మెరుగైన మొబైల్ బ్రాడ్‌బ్యాండ్‌ను అందించగలదు.
అంటే వినియోగదారులు 4జీ సిమ్‌లతోనే 5జీని యాక్సెస్ చేయగలరని దీని అర్థం. అంతే కాకుండా, ఎయిర్‌టెల్ ఇటీవలే మైక్రో ATMలను ప్రారంభించింది. భారతదేశంలోని మెట్రో, టైర్ 1 నగరాలకు ఆవల నివసించే డెబిట్ కార్డ్ వినియోగదారుల కోసం సౌకర్యవంతమైన నగదు ఉపసంహరణలను సులభతరం చేసే దిశగా ఇది మొదటి అడుగు.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?
View this post on Instagram