అన్వేషించండి

Lava O2 Sale: లావా బడ్జెట్ ఫోన్ సేల్ నేడే - రూ.8 వేలలోపే 16 జీబీ + 128 జీబీ!

Lava O2: లావా ఓ2 స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం కానుంది. అమెజాన్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

Lava O2 Amazon Sale: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా మనదేశంలో ఇటీవలే ఒక బడ్జెట్ ఫోన్ లాంచ్ చేసింది. అదే లావా ఓ2. ఈ స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో నేటి నుంచి (మార్చి 27వ తేదీ) నుంచి ప్రారంభం కానుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్, లావా అధికారిక వెబ్‌సైట్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. తక్కువ ధరలో మంచి ఫీచర్లున్న ఇండియన్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. లావా ఓ2 యూనిసోక్ టీ616 ప్రాసెసర్‌పై పని చేయనుంది. ఇందులో 8 జీబీ వరకు ర్యామ్ అందించారు. ర్యామ్ ఎక్స్‌టెన్షన్ ద్వారా దీన్ని 16 జీబీ వరకు పెంచుకోవచ్చు.

లావా ఓ2 ధర, ఆఫర్లు (Lava O2 Launch Offers)
లావా ఓ2లో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే మార్కెట్లో లాంచ్ అయింది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ వేరియంట్ ధర రూ.8,499గా ఉంది. కానీ ప్రారంభ ఆఫర్ కింద ఈ ఫోన్‌పై లావా రూ.500 తగ్గింపు అందించింది. అంటే ఈ స్మార్ట్ ఫోన్‌ను రూ.7,999కే కొనేయచ్చన్న మాట. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్, లావా ఈ-స్టోర్లలో దీని సేల్ జరగనుంది. ఇంపీరియల్ గ్రీన్, మ్యాజెస్టిక్ పర్పుల్, రాయల్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో లావా ఓ2 లభించనుంది.

లావా ఓ2 స్పెసిఫికేషన్లు (Lava O2 Features)
ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంపై రన్ కానుంది. 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను లావా ఓ2లో అందించారు. ఈ మొబైల్ పిక్సెల్ డెన్సిటీ 269 పీపీఐ కాగా, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. యూనిసోక్ టీ616 ప్రాసెసర్‌పై పని చేయనుంది. 8 జీబీ ర్యామ్‌ను లావా ఓ2లో అందించారు. అయితే వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా దీన్ని 16 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... లావా ఓ2 వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. ఇందులో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌ కాగా, దీంతో పాటు ఎల్ఈడీ ఫ్లాష్ కూడా చూడవచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్ అందించారు. ఫ్రంట్ సైట్ ఫ్లాష్ కోసం స్క్రీన్ ఫ్లాష్ ఫీచర్‌ ఉంది.

ఈ ఫోన్‌లో 128 జీబీ స్టోరేజ్ ఉంది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకునే ఆప్షన్ ఉంది. జీపీఆర్ఎస్, ఓటీజీ, వైఫై, 4జీ వోల్టే, బ్లూటూత్ 5, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ అందుబాటులో ఉంది. లావా ఓ2లో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ ఫోన్ పక్కభాగంలో చూడవచ్చు. దీంతోపాటు అడిషనల్ ప్రొటెక్షణ్ కోసం ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది.

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా లావా ఓ2 సపోర్ట్ చేయనుంది. ఒక్కసారి కంప్లీట్‌గా ఛార్జ్ చేస్తే 500 గంటల స్టాండ్ బై టైంను, 38 గంటల టాక్ టైంను లావా ఓ2 అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ మందం 0.87 సెంటీమీటర్లు కాగా, బరువు 200 గ్రాములుగా ఉంది.

Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?

Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Issue: మనోజ్‌పై మొదటి నుంచి వివక్షే - మోహన్ బాబే తప్పే ఎక్కువ ?
మనోజ్‌పై మొదటి నుంచి వివక్షే - మోహన్ బాబే తప్పే ఎక్కువ ?
Google Trending Searches: 2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
Mohan babu Hospital : బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mohan babu Audio on Manchu Manoj | నా గుండెల మీద తన్నావ్ రా మనోజ్ | ABP DesamMohan babu Attack Media | మీడియా ప్రతినిధిని దారుణంగా కొట్టిన మోహన్ బాబు | ABP DesamManchu Mohan babu Attack | కొడుకును, మీడియాను తరిమి కొట్టిన మోహన్ బాబు | ABP Desamముంబయిలో బస్ బీభత్సం, ఏడుగురు మృతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Issue: మనోజ్‌పై మొదటి నుంచి వివక్షే - మోహన్ బాబే తప్పే ఎక్కువ ?
మనోజ్‌పై మొదటి నుంచి వివక్షే - మోహన్ బాబే తప్పే ఎక్కువ ?
Google Trending Searches: 2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
Mohan babu Hospital : బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
Nagababu: నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
Pushpa 2 Collection: 'పుష్ప 2'కు 1000 కోట్లు... సామి నువ్వు ఆడు సామి... నువ్వు ఆడాలా - బాక్సాఫీస్ బద్దలవ్వాలా
'పుష్ప 2'కు 1000 కోట్లు... సామి నువ్వు ఆడు సామి... నువ్వు ఆడాలా - బాక్సాఫీస్ బద్దలవ్వాలా
Mohan Babu Attacks Journalist: మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
Sana Sathish: చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
Embed widget