Nokia Dropped: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?
HMD Global: నోకియా ఫోన్లు ఇకపై లాంచ్ అవుతాయో లేదో క్లారిటీ లేదు. హెచ్ఎండీ గ్లోబల్ స్వంత బ్రాండింగ్‌పై స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
Nokia Smartphones: ఒకప్పుడు మనదేశంలో మొబైల్ అంటే నోకియానే. స్మార్ట్ ఫోన్ల శకం ప్రారంభం కాకముందు మొబైల్ మార్కెట్లో నోకియా హవా కొనసాగేది. నోకియా 1100, 1110, 2690, ఎక్స్‌ప్రెస్ మ్యూజిక్ వంటి ఫోన్లు మార్కెట్‌ను ఏలాయి. కానీ కాలానికి తగ్గట్లు అప్‌డేట్ అవ్వకపోతే ఎంత పెద్ద దిగ్గజం అయినా వెనకబడాల్సిందే, కనుమరుగవ్వాల్సిందే. ఇప్పుడు నోకియాకు అదే పరిస్థితి వచ్చింది.
నోకియా స్మార్ట్ ఫోన్లు, ఫీచర్ ఫోన్లను హెచ్ఎండీ గ్లోబల్ అనే కంపెనీ తయారు చేస్తుంది. ఈ కంపెనీ ఇటీవలే ఒక నిర్ణయం తీసుకుంది. ఇకపై స్మార్ట్ ఫోన్లను నోకియా బ్రాండ్ మీద కాకుండా హెచ్ఎండీ బ్రాండింగ్‌తోనే తీసుకురావాలని కంపెనీ నిర్ణయించింది. దీంతో మనం నోకియా ఫోన్లను ఇకపై మార్కెట్లో చూడలేం.
కొంతకాలంగా హెచ్ఎండీ గ్లోబల్ నిరంతరం ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని, దీని కారణంగా నోకియా స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో లాంచ్ కాకపోవచ్చని అంచనా వేస్తున్నారు. హెచ్ఎండీ తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ / ట్విట్టర్ నుంచి నోకియా బ్రాండ్‌ను కూడా తొలగించింది. హెచ్ఎండీ కూడా కొంతకాలంగా దాని బ్రాండింగ్‌ను నిరంతరం టీజ్ చేస్తూనే ఉంది.
ఇంతకుముందు ఈ బ్రాండ్ యొక్క సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో నోకియా.కామ్ అని ఉంది. కానీ ఇప్పుడు దాన్ని హెచ్ఎండీ.కామ్ అని మార్చారు. అటువంటి పరిస్థితిలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC 2024)లో నోకియా స్థానంలో హెచ్ఎండీ తన స్వంత బ్రాండింగ్‌తో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయగలదని ఇప్పుడు భావిస్తున్నారు.
నోకియా కథ ముగిసిందా?
నోకియా కథ ముగుస్తుందా అనే ప్రశ్న జనాల్లో తలెత్తుతోంది. ఇంతకుముందు మైక్రోసాఫ్ట్ విండోస్ ఓఎస్‌లో పనిచేసే నోకియా స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించేంది. నోకియా లూమియా సిరీస్ మైక్రోసాఫ్ట్ తీసుకువచ్చిన ఫేమస్ స్మార్ట్‌ఫోన్ సిరీస్. కానీ తరువాత మైక్రోసాఫ్ట్ నోకియా బ్రాండ్‌ల హక్కులను హెచ్ఎండీ గ్లోబల్‌కు విక్రయించింది. అప్పటి నుండి హెచ్ఎండీ... నోకియా కోసం స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేస్తుంది.
భవిష్యత్తులో కూడా నోకియా స్మార్ట్‌ఫోన్ల తయారీ కొనసాగుతుందని హెచ్ఎండీ తెలిపింది కానీ అది ఎంతవరకు జరుగుతుందనేది చూడాలి. తన ఒరిజినల్ బ్రాండ్ హెచ్ఎండీకి గుర్తింపును ఇవ్వాలనుకుంటున్నారు. అందుకే ఆ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తున్నాడు.
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!