అన్వేషించండి

Jio Cloud PC: టెక్నాలజీని నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్తున్న జియో - క్లౌడ్ పీసీ సర్వీసులు లాంచ్!

జియో ఎయిర్ ఫైబర్, క్లౌడ్ పీసీ సేవలు ప్రారంభం అయ్యాయి.

జియో ఎయిర్‌ఫైబర్, జియో క్లౌడ్ పీసీ సర్వీసులను రిలయన్స్ ఇండస్ట్రీస్ 45వ వార్షిక సదస్సులో లాంచ్ చేసింది. వీటిలో జియో ఎయిర్ ఫైబర్ ద్వారా వినియోగదారులు ఎటువంటి వైర్లు లేకుండా జీబీల్లో స్పీడ్ పొందవచ్చు. జియో క్లౌడ్ పీసీ అనేది ఎటువంటి హార్డ్‌వేర్ ఎక్విప్‌మెంట్ అవసరం లేని ఒక క్లౌడ్ పీసీ సర్వీసు.

జియో తన 5జీ సేవలకు జియో ట్రూ 5జీ అని పేరు పెట్టింది. ఇప్పుడు జియో ఎయిర్‌ఫైబర్, జియో క్లౌడ్ పీసీ దానిపైనే పనిచేయనున్నాయి. రిలయన్స్ జియో చైర్మన్ ఆకాష్ అంబానీ కంపెనీ వార్షిక సదస్సులో జియో ఎయిర్ ఫైబర్, జియో క్లౌడ్ పీసీల గురించి వివరించారు.

జియో ఎయర్ ఫైబర్ అనేది ఒక హోం గేట్‌వే సర్వీసు. అంటే దీన్ని పవర్ సోర్స్‌కు కనెక్ట్ చేసి వైఫై హాట్‌స్పాట్ లాగా ఉపయోగించుకోవచ్చన్న మాట. ఇది జియో ట్రూ 5జీ ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్‌ను అందించనుంది. ఇక జియో క్లౌడ్ పీసీ అనేది ఒక వర్చువల్ పీసీలా పనిచేయనుంది. జియో ట్రూ 5జీ కనెక్టివిటీ ద్వారానే దీన్ని కూడా ఉపయోగించవచ్చు. ఎటువంటి హార్డ్‌వేర్ రిక్వైర్‌మెంట్స్ లేకుండానే ఈ డివైస్‌ను వాడుకోవచ్చు. మల్టీపుల్ పీసీలను, యూజర్లను కనెక్ట్ చేయడానికి కూడా దీన్ని ఉపయోగించవచ్చు. ఇది ఫిజికల్ ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లను రీప్లేస్ చేయనుందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఓటీటీ రంగంలో రిలయన్స్‌కు ఉన్న ప్లాన్లను ముకేశ్ అంబానీ ఈ సమావేశంలో తెలిపారు. ఐదేళ్ల పాటు ఐపీఎల్ ప్రసార హక్కులను రిలయన్స్ దక్కించుకుందని పేర్కొన్నారు. మూవీ రైట్స్, ఓటీటీ రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నామన్నారు. ప్రస్తుతం రిలయన్స్ గ్రూపునకు చెందిన వయాకాం18 సంస్థ వూట్ ఓటీటీ సర్వీసులను కూడా గతంలోనే ప్రారంభించింది. హిందీ బిగ్‌బాస్, కన్నడ బిగ్‌బాస్‌లు ఈ ఓటీటీలోనే 
స్ట్రీమ్ అవుతాయి. ఇటీవలే ఐపీఎల్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను కూడా ఐదేళ్ల పాటు రిలయన్స్ గ్రూపు దక్కించుకుంది.

ప్రస్తుతం వూట్ యాప్ క్వాలిటీ ఆకట్టుకునే స్థాయిలో లేదు. దీనికి తోడు జియోకు ప్రత్యేకంగా జియో సినిమా అనే ప్రత్యేకమైన ఓటీటీ సర్వీసు కూడా ఉంది. మరి వీటన్నిటినీ కలిపి ఒకే ఓటీటీగా రూపొందిస్తారా? లేకపోతే మరో కొత్త ఓటీటీ సర్వీసును ప్రారంభిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.

Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!

Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!

View this post on Instagram
 
A post shared by Jio (@reliancejio)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
PM Modi Mann Ki Baat: 2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Anantapur News: అనంతపురంలో హై అలెర్ట్ అప్లికేషన్, శివారు ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా: జిల్లా ఎస్పీ
అనంతపురంలో హై అలెర్ట్ అప్లికేషన్, శివారు ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా: జిల్లా ఎస్పీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
PM Modi Mann Ki Baat: 2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Anantapur News: అనంతపురంలో హై అలెర్ట్ అప్లికేషన్, శివారు ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా: జిల్లా ఎస్పీ
అనంతపురంలో హై అలెర్ట్ అప్లికేషన్, శివారు ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా: జిల్లా ఎస్పీ
China Bullet Train: ఈ రైలు వేగం గంటకు 450 కిలోమీటర్లు - అత్యాధునిక ఆవిష్కరణ చేసిన చైనా, ప్రత్యేకతలు ఇవే!
ఈ రైలు వేగం గంటకు 450 కిలోమీటర్లు - అత్యాధునిక ఆవిష్కరణ చేసిన చైనా, ప్రత్యేకతలు ఇవే!
Ram Charan Unstoppable 4: బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
Kasturba Gandhi School: 300 మందిని ఇళ్లకు తీసుకెళ్లిన తల్లిదండ్రులు, కస్తూర్భా గాంధీ స్కూళ్లో ఏం జరుగుతోంది
300 మందిని ఇళ్లకు తీసుకెళ్లిన తల్లిదండ్రులు, కస్తూర్భా గాంధీ స్కూళ్లో ఏం జరుగుతోంది
JC Prabhakar Reddy: చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు మా చేతులు కట్టేశారు, లేకపోతే మీ అంతు చూసేవాళ్లం: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Embed widget