By: ABP Desam | Updated at : 04 Oct 2021 07:36 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
ఐఫోన్ ఎస్ఈ 2020పై ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భారీ ఆఫర్ అందించారు.
ఐఫోన్ ఎస్ఈ స్మార్ట్ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భారీ ఆఫర్‌ను అందించారు. ఈ ఫోన్‌ను ఈ సేల్‌లో రూ.26,999కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ గత సంవత్సరమే మార్కెట్లోకి వచ్చింది. బడ్జెట్ ధరలో ఐఫోన్ కొనాలనుకునేవారి కోసం ఈ ఫోన్‌ను యాపిల్ లాంచ్ చేసింది.
ఐఫోన్ ఎస్ఈ 2020 ధర
ఐఫోన్ ఎస్ఈ 2020లో 64 జీబీ వేరియంట్ ధర రూ.39,900 కాగా.. ఈ సేల్‌లో రూ.26,999కే కొనుగోలు చేయవచ్చు. 128 జీబీ స్టోరేజ్ ధర రూ.44,900 నుంచి రూ.31,999కు తగ్గించారు. ఇక 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.54,900 నుంచి రూ.41,999కు తగ్గింది. బ్లాక్, రెడ్, వైట్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకుల ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేస్తే రూ.1,500 తగ్గింపు లభించనుంది. ఇక ఎక్స్‌చేంజ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.20 వేలలోపే వచ్చేందుకు అవకాశం ఉంది.
Also Read: శాంసంగ్ కొత్త 5జీ ఫోన్ వచ్చేసింది.. రూ.4 వేలకు పైగా తగ్గింపు.. ఫీచర్లు అదుర్స్!
ఐఫోన్ ఎస్ఈ 2020 స్పెసిఫికేషన్లు
ఇందులో 4.7 అంగుళాల రెటీనా హెచ్ డీ ఎల్సీడీ డిస్ ప్లేను అందించారు. దీని రిజల్యూషన్ 750x1334 పిక్సెల్స్ గా ఉంది. ఇందులో హాప్టిక్ టచ్ సపోర్ట్ అనే కొత్త ఫీచర్ ను అందించారు. ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ ఫోన్లలో అందించిన ఏ13 బయోనిక్ చిప్ నే ఇందులో కూడా అందించడం విశేషం.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు 12 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఎల్ఈడీ ట్రూటోన్ ఫ్లాష్, స్లో సింక్ ఫీచర్లు కూడా ఇందులో ఉండటం విశేషం. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 7 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు. ఐఫోన్ ఎస్ఈ 2020 సెప్టెంబర్ 2017లో లాంచ్ అయిన ఐఫోన్ 8 తరహాలో ఉంది. ఐఫోన్ 7 స్మార్ట్ ఫోన్ కు తర్వాతి వెర్షన్ గా ఐఫోన్ 8 అప్పట్లో మార్కెట్లో లాంచ్ అయింది.
4జీ ఎల్టీఈ, వైఫై 802.11ax, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇందులో ఫేస్ ఐడీకి బదులుగా టచ్ ఐడీ బటన్ ను అందించారు. ఐఫోన్ ఎస్ఈ 2020 పొడవు 13.84 సెంటీమీటర్లుగా ఉండగా, వెడల్పు 6.73 సెంటీమీటర్లుగానూ, మందం 0.73 సెంటీమీటర్లుగానూ ఉంది. దీని బరువు కూడా చాలా తక్కువగా 148 గ్రాములు మాత్రమే ఉంది.
Also Read: హోం అప్లయన్సెస్‌పై భారీ ఆఫర్లు.. ఇంట్లో వస్తువులు కొనడానికి రైట్ టైం!
Also Read: ఫర్నీచర్ ఉత్పత్తులపై 70 శాతం వరకు ఆఫర్లు!
Communities vs Groups: వాట్సాప్ గ్రూప్, కమ్యూనిటీకి మధ్య తేడా ఏంటి? దేన్ని ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా?
WhatsApp New Feature: ఒక్క ట్యాప్‌తో వీడియో రికార్డింగ్, వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్
Coca Cola Phone: ఫోన్ లాంచ్ చేయనున్న కోకా కోలా - ఎలా ఉందో చూశారా?
WhatsApp Features: కొత్త ఫీచర్ తీసుకురానున్న వాట్సాప్ - ఇక కమ్యూనిటీల్లో కూడా!
Updating Apps: మీ స్మార్ట్ ఫోన్‌లో యాప్స్ అప్డేట్ చేయట్లేదా? అయితే మీ డేటా ప్రమాదంలో!
పెళ్లి కాకపోయినా పర్వాలేదు, పిల్లలను కనండి - పాలకులు షాకింగ్ నిర్ణయం, ఎక్కడో తెలుసా?
Nellore Anam : నెల్లూరు వైఎస్ఆర్సీపీలో మరోసారి ఆనం బాంబ్ - ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు - ప్రాణ హానీ ఉందని ఆందోళన !
Agent Release Date : 'ఏజెంట్' రిలీజ్ డేట్ ఫిక్స్ - థియేటర్లలో అఖిల్ వైల్డ్ యాక్షన్ రైడ్ ఆ రోజు నుంచి షురూ!
Stock Market News: బడ్జెట్ ముందు పాజిటివ్‌గా స్టాక్ మార్కెట్ల ముగింపు - రేపు డబ్బుల వర్షమేనా!!