(Source: ECI/ABP News/ABP Majha)
Amazon Great Indian Festival Sale: ఫర్నీచర్ ఉత్పత్తులపై 70 శాతం వరకు ఆఫర్లు!
అమెజాన్ తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో ఉత్పత్తులపై భారీ ఆఫర్లు అందించనుంది. ఫర్నీచర్, మ్యాట్రెసెస్ ఉత్పత్తులపై 70 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 3వ తేదీన ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ప్రైమ్ సభ్యులకు ఈ సేల్ ఒకరోజు ముందుగానే జరగనుంది. అక్టోబర్ 2వ తేదీనే ప్రైమ్ సభ్యులకు ఈ సేల్ జరగనుంది. ఈ సేల్‌లో వివిధ రకాల ఉత్పత్తులపై 70 శాతం వరకు తగ్గింపు లభించనుంది.
ఈ సేల్‌లో ఫర్నీచర్ ఉత్పత్తులపై కూడా ఆఫర్లు లభించనున్నాయి. ఫర్నీచర్, మ్యాట్రెసెస్ ఉత్పత్తులపై ఏకంగా 70 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది. ఈ సేల్‌లో అమెజాన్ బ్రాండ్ సొలిమొ క్వీన్ బెడ్‌పై భారీ తగ్గింపు లభించనుంది. దీని అసలు ధర రూ.17,999 కాగా, రూ,10 వేలలోపే దీన్ని కొనుగోలు చేయవచ్చు.
Also Read: Amazon Great Indian Festival Sale: శాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ లాంచ్ నేడే.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
రూ.74 వేల విలువైన హోం సెంటర్ ఎమిలీ ఐదు సీట్ల సోఫా సెట్ రూ.30 వేలలోపే అందుబాటులోకి రానుంది. రూ.25,800 విలువైన డ్యురోఫ్లెక్స్ సింగిల్ సీటర్ రిక్లెయినర్ రూ.20 వేల లోపు ధరకే అందుబాటులోకి రానుంది.
వీటితో పాటు ఆఫీస్ చెయిర్లు, డెస్క్‌లపై 70 శాతం వరకు తగ్గింపు లభించనుంది. మ్యాట్రెసెస్‌పై 60 శాతం వరకు, బెడ్స్‌పై 60 శాతం వరకు డిస్కౌంట్ అందించనున్నారు. వీటితో పాటు సోఫాలు, రిక్లెయినర్లపై 60 శాతం తగ్గింపు లభించనుంది. దీంతోపాటు డైనింగ్ సెట్లపై 50 శాతం ఆఫర్లు ఉండనున్నాయి.
ఇంతేకాకుండా.. మొబైల్స్, యాక్సెసరీస్, హోం, కిచెన్ అప్లయన్సెస్, ఎలక్ట్రానిక్ యాక్సెసరీస్, ఫ్యాషన్ ఉత్పత్తులు, టీవీలు, రోజువారీ అవసరాలు, బుక్స్, టాయ్స్, గేమింగ్, దీంతోపాటు అమెజాన్ బ్రాండ్స్‌పై కూడా తగ్గింపులు లభించనున్నాయి. ఈ సేల్‌లో అందించనున్న ఆఫర్లను కంపెనీ తన మైక్రో సైట్‌లో ప్రకటించింది.
ఐఫోన్లు, ఇతర ప్రముఖ కంపెనీల స్మార్ట్ ఫోన్లపై ఈ సేల్‌లో నెవర్ బిఫోర్ ఆఫర్లు ఉండనున్నాయి. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో అమెజాన్ తన బెస్ట్ ఆఫర్లను అందిస్తుంది. ఈ సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ అయితే మొదటిసారి సేల్‌కు వెళ్లనుంది. దీనిపై ఏకంగా నాలుగు వేల వరకు తగ్గింపును కూడా అందించారు.
Also Read: రూ.7,500లోపే రియల్‌మీ కొత్త ఫోన్.. రెండు ఫోన్లు లాంచ్.. 43 రోజుల బ్యాటరీ లైఫ్!
Also Read: రూ.6 వేలలోపే కొత్త ఫోన్.. వాట్సాప్ కాల్స్ రికార్డ్ చేయవచ్చు.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?