(Source: ECI/ABP News/ABP Majha)
Amazon Great Indian Festival Sale: అక్టోబర్ 3 నుంచే గ్రేట్ ఇండియన్ సేల్.. ఆఫర్లు, ప్రత్యేకతలు ఇవే!
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ శుభవార్త చెప్పింది! గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను మరికాస్త ముందుకు జరిపింది. ఫ్లిప్‌కార్ట్ పోటీకి రావడంతో అక్టోబర్ 3నే అమ్మకాలు మొదలవుతాయని ప్రకటించింది.
పండగల వేళ కొనుగోలు దారులకు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ శుభవార్త చెప్పింది! గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను మరికాస్త ముందుకు జరిపింది. మొదట అక్టోబర్ 4న ఫెస్టివ్ సేల్ మొదలవుతుందని చెప్పినా.. ఫ్లిప్‌కార్ట్ పోటీకి రావడంతో అక్టోబర్ 3నే అమ్మకాలు మొదలవుతాయని ప్రకటించింది. ఈ సేల్ ద్వారా కొనుగోలు దారులకు గొప్ప రాయితీలు లభిస్తాయని సంస్థ చెబుతోంది.
Also Read: అమెజాన్‌తో ఫ్లిప్‌కార్ట్ ఢీ! ఒక రోజు ముందుగానే ఫెస్టివ్ సేల్
ఏటా దసరా, దీపావళి సమయంలో ఈ కామర్స్ సంస్థలు రాయితీలు ప్రకటిస్తాయి. మంచి ఆఫర్లతో ఆకట్టుకుంటాయి. కొన్నేళ్లుగా ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నాయి. వీటిలో అమెజాన్ ఎంతో ముందుంటోంది. ఈ సారి అక్టోబర్ 3 నుంచి నెలరోజులు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఉంటుందని అమెజాన్ తెలిపింది.
Also Read: క్రిప్టోకరెన్సీపై చైనా ఉక్కుపాదం.. నియంతృత్వం పోతుందని భయమేమో!
వినియోగదారులను ఆకట్టుకొనేందుకు అమెజాన్ ప్రత్యేకంగా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ వెబ్‌పేజీని సృష్టించింది. ఇందులో వివిధ మొబైల్ ఫోన్లు, యాక్సెసరీస్, ఎలక్ట్రానిక్ పరికరాలు, స్మార్ట్ వాచ్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్లు కనిపిస్తున్నాయి. ఎకో, ఫైర్ టీవీ, కిండిల్ పరికరాలు అతి తక్కువ ధరలకే దొరుకుతున్నాయి. వాయిస్ అసిస్టెంట్ అలెక్సాతో కాంబినేషన్ ఆఫర్లు ఉన్నాయి.
Also Read: అక్టోబర్లో బ్యాంకులకు 21 రోజులు సెలవు.. ఆర్థిక లావాదేవీలు ప్లాన్ చేసుకోండి!
భారీ రాయితీలు, డీల్స్, ఆఫర్లే కాకుండా వెయ్యికి పైగా కొత్త ఉత్పత్తులు అమెజాన్ వేదికగా లాంఛ్ అవుతున్నాయి. యాపిల్, ఆసుస్, ఫాసిల్, హెచ్‌పీ, లెనోవో, సామ్‌సంగ్, సోనీ, షామి వంటి బ్రాండ్లు కొత్త ఉత్పత్తులు ఆవిష్కరిస్తున్నాయి. సోనీ వారి పీఎస్5, మైక్రోసాఫ్ట్ ఎక్స్‌బాక్స్ అప్‌డేటెడ్ ఆవిష్కరణలు ఉంటాయని అమెజాన్ తెలిపింది.
అమెజాన్ పే ద్వారానూ వినియోగదారులు మరింత సొమ్మును మిగిలించుకోవచ్చు. యుటిలిటీ బిల్లులు, టికెట్లు బుక్ చేసుకోవడం, నగదు బదిలీ, చెల్లింపులతో రూ.5000 వరకు ఆదా చేసుకొనేందుకు అవకాశం ఉంది. హెచ్‌డీఎఫ్‌సీతోనూ అమెజాన్ ఒప్పందం కుదుర్చుకొంది. ఆ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే పది శాతం వరకు రాయితీ లభిస్తుంది. బజాజ్ డెబిడ్, క్రెడిట్ కార్డులపై నో కాస్ట్ ఈఎంఐతో వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
ఈ ఫెస్టివ్ సీజన్లో కొత్త వినియోగదారులు వస్తారని 78 శాతం మంది విక్రయదారులు ధీమా వ్యక్తం చేశారని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మనీశ్ తివారీ అన్నారు. అంతేకాకుండా అమ్మకాలు భారీగా పెరుగుతాయని 71 శాతం మంది ఆశాభావంతో ఉన్నారని పేర్కొన్నారు. నీల్సన్ సర్వేను ఉదహరించారు.