Amazon Great Indian Festival Sale: శాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ లాంచ్ రేపే.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Samsung Galaxy M52 5G: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన కొత్త ఫోన్ గెలాక్సీ ఎం52 5జీని మనదేశంలో లాంచ్ చేయనుంది. సెప్టెంబర్ 28వ తేదీన ఈ ఫోన్ లాంచ్ కానుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో సెప్టెంబర్ 28వ తేదీన లాంచ్ కానుంది. ఈ ఫోన్ గతంలోనే కంపెనీ అధికారిక వెబ్‌సైట్లో కనిపించింది. ఈ లిస్టింగ్‌లో ఈ ఫోన్ స్పెసిఫికేషన్లన్నీ ఉన్నాయి. దీని ప్రకారం... ఈ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు, 120 హెర్ట్జ్ సూపర్ అమోఎల్ఈడీ ప్లస్ డిస్‌ప్లే, 25W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. హోల్ పంచ్ డిస్‌ప్లే ఇందులో అందుబాటులో ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ ధర
ఈ ఫోన్ ధర ఇంకా తెలియరాలేదు. అయితే ఈ ఫోన్ స్పెసిఫికేషన్లను బట్టి చూస్తే రూ.30 వేల రేంజ్‌లో దీని ధర ఉండే అవకాశం ఉంది. బ్లాక్, బ్లూ, వైట్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది.
Also Read: రూ.7,500లోపే రియల్‌మీ కొత్త ఫోన్.. రెండు ఫోన్లు లాంచ్.. 43 రోజుల బ్యాటరీ లైఫ్!
శాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ స్పెసిఫికేషన్లు
శాంసంగ్ పోలండ్ వెబ్‌సైట్లో దీని వివరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఆధారిత వన్‌యూఐ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోఎల్ఈడీ ప్లస్ డిస్‌ప్లే ఉండనుంది. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గానూ, రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ ఉండనుంది. ఇందులో ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉండనుందని పాలిష్ సైట్లో పేర్కొన్నారు. అయితే అమెజాన్ సైట్లో మాత్రం క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుందని పేర్కొన్నారు.
ఇక ఫొటోలు, వీడియోల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 12 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, 5 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.
ఇందులో 128 జీబీ స్టోరేజ్ ఉండనుంది. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉండనున్నాయి. దీంతోపాటు యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా ఇందులో ఉండనున్నాయి.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండనుంది. 25W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ ఉండనుంది. ఈ ఫోన్ మందం 0.74 సెంటీమీటర్లుగానూ, బరువు 173 గ్రాములుగానూ ఉండనుంది.
Also Read: రూ.6 వేలలోపే కొత్త ఫోన్.. వాట్సాప్ కాల్స్ రికార్డ్ చేయవచ్చు.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Also Read: ఐకూ కొత్త 5జీ ఫోన్ వచ్చేసింది.. ధర రూ.22 వేలలోపే!