అన్వేషించండి

iQoo Z5: ఐకూ కొత్త 5జీ ఫోన్ వచ్చేసింది.. ధర రూ.22 వేలలోపే!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో సబ్ బ్రాండ్ ఐకూ తన కొత్త 5జీ ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. అదే ఐకూ జెడ్5 5జీ.

ఐకూ జెడ్5 స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఇందులో 5జీ ఫీచర్‌ను అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 64 మెగాపిక్సెల్ కెమెరా, ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టం కూడా ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్ ప్రస్తుతానికి చైనాలో మాత్రమే లాంచ్ అయింది.

ఐకూ జెడ్5 ధర
ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,899 యువాన్లుగా(సుమారు రూ.21,600) నిర్ణయించారు. ఇక 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,099 యువాన్లుగానూ(సుమారు రూ.26,200), 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,299 యువాన్లుగానూ(సుమారు రూ.26,200) ఉంది. బ్లూ ఆరిజిన్, డ్రీమ్‌స్పేస్, ట్విలైట్ మార్నింగ్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. చైనాలో దీని సేల్ సెప్టెంబర్ 28వ తేదీ నుంచి జరగనుంది. మనదేశంలో ఈ ఫఓన్ ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.

Also Read: Realme GT Neo 2: రియల్‌మీ సూపర్ ఫోన్ వచ్చేసింది.. తక్కువ ధరలోనే సూపర్ ఫీచర్లు!

ఐకూ జెడ్5 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, హెచ్‌డీఆర్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.

ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

5జీ, ట్రై బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.2, యూఎస్‌బీ టైప్-సీ, యూఎస్‌బీ ఓటీజీ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కూడా ఇందులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 44W ఫ్లాష్ చార్జ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. దీని మందం 0.85 సెంటీమీటర్లుగానూ, బరువు 193 గ్రాములుగానూ ఉంది.

Also Read: iTel A26: రూ.6 వేలలోపే కొత్త ఫోన్.. వాట్సాప్ కాల్స్ రికార్డ్ చేయవచ్చు.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Also Read: Banking Trojan Malware: ఆండ్రాయిడ్ ఫోన్‌లో బ్యాంకింగ్ చేస్తున్నారా.. అయితే జాగ్రత్త.. ఇలా అస్సలు చేయకండి!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

టాప్ హెడ్ లైన్స్

Melbourne Accident: ఆస్ట్రేలియాలో ఘోర ప్రమాదం - విశాఖ విడిసిఎ మాజీ జాయింట్ సెక్రటరీ కుటుంబంలో తీవ్ర విషాదం.. అత్తాకోడళ్లు మృతి!
ఆస్ట్రేలియాలో ఘోర ప్రమాదం - విశాఖ విడిసిఎ మాజీ జాయింట్ సెక్రటరీ కుటుంబంలో తీవ్ర విషాదం.. అత్తాకోడళ్లు మృతి!
KCR 2004 election affidavit: కేటీఆర్ 'జమీందార్' వ్యాఖ్యలపై కాంగ్రెస్ మైండ్ గేమ్‌ - కేసీఆర్ 2004 అఫిడవిట్ లీక్.. అందులో ఏముందంటే?
కేటీఆర్ 'జమీందార్' వ్యాఖ్యలపై కాంగ్రెస్ మైండ్ గేమ్‌ - కేసీఆర్ 2004 అఫిడవిట్ లీక్.. అందులో ఏముందంటే?
KCR Erravalli Farmhouse: ఎర్రవల్లి కోటపై సర్కార్ పంజా - మార్కూక్‌లో ముమ్మర రికార్డుల శోధన - కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు రెవెన్యూ నోటీసులు?
ఎర్రవల్లి కోటపై సర్కార్ పంజా - మార్కూక్‌లో ముమ్మర రికార్డుల శోధన - కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు రెవెన్యూ నోటీసులు?
KTR counter to Revanth Reddy: కేసీఆర్ పుట్టుకతోనే కుబేరుడు - గోడలపై సున్నాలేసుకున్నది నువ్వే - భూములపై రేవంత్‌కు కేటీఆర్ ఘాటు కౌంటర్
కేసీఆర్ పుట్టుకతోనే కుబేరుడు - గోడలపై సున్నాలేసుకున్నది నువ్వే - భూములపై రేవంత్‌కు కేటీఆర్ ఘాటు కౌంటర్

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Melbourne Accident: ఆస్ట్రేలియాలో ఘోర ప్రమాదం - విశాఖ విడిసిఎ మాజీ జాయింట్ సెక్రటరీ కుటుంబంలో తీవ్ర విషాదం.. అత్తాకోడళ్లు మృతి!
ఆస్ట్రేలియాలో ఘోర ప్రమాదం - విశాఖ విడిసిఎ మాజీ జాయింట్ సెక్రటరీ కుటుంబంలో తీవ్ర విషాదం.. అత్తాకోడళ్లు మృతి!
KCR 2004 election affidavit: కేటీఆర్ 'జమీందార్' వ్యాఖ్యలపై కాంగ్రెస్ మైండ్ గేమ్‌ - కేసీఆర్ 2004 అఫిడవిట్ లీక్.. అందులో ఏముందంటే?
కేటీఆర్ 'జమీందార్' వ్యాఖ్యలపై కాంగ్రెస్ మైండ్ గేమ్‌ - కేసీఆర్ 2004 అఫిడవిట్ లీక్.. అందులో ఏముందంటే?
KCR Erravalli Farmhouse: ఎర్రవల్లి కోటపై సర్కార్ పంజా - మార్కూక్‌లో ముమ్మర రికార్డుల శోధన - కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు రెవెన్యూ నోటీసులు?
ఎర్రవల్లి కోటపై సర్కార్ పంజా - మార్కూక్‌లో ముమ్మర రికార్డుల శోధన - కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు రెవెన్యూ నోటీసులు?
KTR counter to Revanth Reddy: కేసీఆర్ పుట్టుకతోనే కుబేరుడు - గోడలపై సున్నాలేసుకున్నది నువ్వే - భూములపై రేవంత్‌కు కేటీఆర్ ఘాటు కౌంటర్
కేసీఆర్ పుట్టుకతోనే కుబేరుడు - గోడలపై సున్నాలేసుకున్నది నువ్వే - భూములపై రేవంత్‌కు కేటీఆర్ ఘాటు కౌంటర్
West Bengal: అస్సలాము అలైకుమ్ వీడియో రగడ - పశ్చిమ బెంగాల్ ఐపీఎస్ ఆఫీసర్ బుష్రా బానో పై బదిలీ వేటు!
అస్సలాము అలైకుమ్ వీడియో రగడ - పశ్చిమ బెంగాల్ ఐపీఎస్ ఆఫీసర్ బుష్రా బానో పై బదిలీ వేటు!
Disha Salian death case 2026: సుషాంత్ సింగ్ రాజ్ పుత్ మేనేజర్ మృతి కేసులో ఆదిత్యథాక్రే పేరు - మలుపులు తిరుగుతున్న కేసు!
సుషాంత్ సింగ్ రాజ్ పుత్ మేనేజర్ మృతి కేసులో ఆదిత్యథాక్రే పేరు - మలుపులు తిరుగుతున్న కేసు!
Aakasamlo Oka Tara Release Date : దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార రిలీజ్ డేట్ ఫిక్స్ - సింపుల్ కూల్ లుక్‌లో మలయాళ స్టార్
దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార రిలీజ్ డేట్ ఫిక్స్ - సింపుల్ కూల్ లుక్‌లో మలయాళ స్టార్
Eshwar Sai Madhuri Rathod : ఈశ్వర్ సాయి ఎక్కడ... భార్య సూసైడ్ అటెంప్ట్ చేసినా కనిపించని ఫోక్ డ్యాన్సర్ - అరెస్టుకు భయపడుతున్నాడా?
ఈశ్వర్ సాయి ఎక్కడ... భార్య సూసైడ్ అటెంప్ట్ చేసినా కనిపించని ఫోక్ డ్యాన్సర్ - అరెస్టుకు భయపడుతున్నాడా?
Embed widget