Realme GT Neo 2: రియల్‌మీ సూపర్ ఫోన్ వచ్చేసింది.. తక్కువ ధరలోనే సూపర్ ఫీచర్లు!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ తన కొత్త ఫోన్ రియల్‌మీ జీటీ నియో 2ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రస్తుతానికి చైనాలో లాంచ్ అయింది. త్వరలో మనదేశంలో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
రియల్‌మీ తన కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే రియల్‌మీ జీటీ నియో 2. ఇందులో 6.62 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్, వెనకవైపు మూడు కెమెరాల సెటప్, ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టం, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.
రియల్‌మీ జీటీ నియో ధర
ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,499 యువాన్లుగా(సుమారు రూ.28,500) ఉండగా, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,699 యువాన్లుగానూ(సుమారు రూ.30,800) ఉంది. ఇక ప్రీమియం వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,999 యువాన్లుగా(సుమారు రూ.34,200) నిర్ణయించారు. బ్లాక్ మింట్, షాడో బ్లాక్, బ్లూ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
ఈ ఫోన్ ప్రస్తుతానికి చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో ఇది మనదేశంలో కూడా లాంచ్ కానుంది.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్‌లో ఆ ఫోన్ లేనట్లే.. యాపిల్ సంచలన నిర్ణయం!
రియల్‌మీ జీటీ నియో 2 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ యూఐ 2.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.62 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఈ4 అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. హెచ్‌డీఆర్10+, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డీసీ డిమ్మింగ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉన్నాయి. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ 119 డిగ్రీల అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 65W అల్ట్రా ఫాస్ట్ ఫ్లాష్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. 36 నిమిషాల్లోనే ఈ ఫోన్ పూర్తిగా చార్జ్ కానుంది. ఇందులో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా అందించారు. ఇందులో ఫేస్ రికగ్నిషన్ కూడా ఉంది.
5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, డ్యూయల్ 4జీ వోల్టే, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, గ్లోనాస్, బైదు, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ వంటి ఫీచర్లు కూడా ఇందులో అందించారు. దీని మందం 0.86 సెంటీమీటర్లు కాగా, బరువు 199.8 గ్రాములుగా ఉంది.
Also Read: Realme New 5G Phone: రియల్‌మీ బడ్జెట్ 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. ధర రూ.15 వేలలోపే!
Also Read: Nokia G10: కొత్త ఫోన్ లాంచ్ చేసిన నోకియా.. ధర రూ.13 వేలలోపే.. జియో యూజర్లకు స్పెషల్ ఆఫర్స్!