(Source: ECI/ABP News/ABP Majha)
Realme Narzo 50i: రూ.7,500లోపే రియల్‌మీ కొత్త ఫోన్.. రెండు ఫోన్లు లాంచ్.. 43 రోజుల బ్యాటరీ లైఫ్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ మనదేశంలో తన కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. అవే రియల్‌మీ నార్జో 50ఏ, నార్జో 50ఐ. వీటి ధర రూ.7,499 నుంచి ప్రారంభం కానుంది.
రియల్‌మీ నార్జో 50ఏ, నార్జో 50ఐ స్మార్ట్ ఫోన్లు మనదేశంలో లాంచ్ అయ్యాయి. వీటిలో రియల్‌మీ నార్జో 50ఏలో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌ను అందించారు. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. ఇక రియల్‌మీ నార్జో 50ఐ విషయానికి వస్తే.. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, యూనిసోక్ 9863 ప్రాసెసర్‌ను అందించారు.
రియల్‌మీ నార్జో 50ఐ ధర
ఇందులో కూడా రెండు వేరియంట్లే అందుబాటులో ఉన్నాయి. వీటిలో 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,499గానూ, 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,499గానూ ఉంది. మింట్ గ్రీన్, కార్బన్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఈ రెండు ఫోన్లకు సంబంధించిన సేల్ అక్టోబర్ 7వ తేదీన జరగనుంది. రియల్‌మీ.కాం, ఫ్లిప్‌కార్ట్‌ల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
రియల్‌మీ నార్జో 50ఏ ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,499గా ఉంది. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.12,499గా నిర్ణయించారు. ఆక్సిజన్ బ్లూ, ఆక్సిజన్ గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
రియల్‌మీ నార్జో 50ఏ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ యూఐ 2.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గానూ, స్క్రీన్ టు బాడీ రేషియో 88.7 శాతంగానూ ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకోవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు బ్లాక్ అండ్ వైట్ పొర్‌ట్రెయిట్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్ కాగా, 18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. 4జీ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5, యూఎస్‌బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కూడా ఇందులో ఉన్నాయి. దీని మందం 0.96 సెంటీమీటర్లుగానూ, బరువు 207 గ్రాములుగానూ ఉంది.
Also Read: రూ.6 వేలలోపే కొత్త ఫోన్.. వాట్సాప్ కాల్స్ రికార్డ్ చేయవచ్చు.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
రియల్‌మీ నార్జో 50ఐ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.5 అంగుళాల డిస్‌ప్లే ఉంది. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 89.5 శాతంగా ఉంది. యూనిసోక్ 9863 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 4 జీబీ వరకు ర్యామ్, 64 జీబీ వరకు స్టోరేజ్ ఉన్నాయి. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 256 జీబీ స్టోరేజ్ ఉన్నాయి. ఫోన్ వెనకవైపు 8 మెగాపిక్సెల్, ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. ఏకంగా 43 రోజుల స్టాండ్‌బై టైంను ఈ ఫోన్ అందించనుందని రియల్‌మీ అంటోంది.
ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ యూఐ గో ఎడిషన్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 3.5 ఎంఎం ఆడియో జాక్, మైక్రో యూఎస్‌బీ పోర్టు, వైఫై, బ్లూటూత్ వీ4.2 కూడా ఇందులో ఉన్నాయి. దీని బరువు 195 గ్రాములుగా ఉంది.
Also Read: Realme New 5G Phone: రియల్‌మీ బడ్జెట్ 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. ధర రూ.15 వేలలోపే!
Also Read: ఐకూ కొత్త 5జీ ఫోన్ వచ్చేసింది.. ధర రూ.22 వేలలోపే!