News
News
X

Samsung M52 5G: శాంసంగ్ కొత్త 5జీ ఫోన్ వచ్చేసింది.. రూ.4 వేలకు పైగా తగ్గింపు.. ఫీచర్లు అదుర్స్!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ మనదేశంలో తన కొత్త 5జీ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీని లాంచ్ చేసింది. దీని ధర రూ.29,999 నుంచి ప్రారంభం కానుంది.

FOLLOW US: 
Share:

శాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. మిడ్ రేంజ్ ప్రీమియంలో శాంసంగ్ ఈ 5జీ ఫోన్‌ను లాంచ్ చేసింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో కొంటే ఈ ఫోన్లపై తగ్గింపు కూడా లభించనుంది. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌ను అందించారు. దీంతోపాటు ఇందులో పంచ్ హోల్ డిజైన్ కూడా ఉండనుంది. గతేడాది లాంచ్ అయిన గెలాక్సీ ఎం51కు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ అయింది. ఐకూ జెడ్5, రియల్‌మీ జీటీ మాస్టర్ ఎడిషన్‌తో ఈ ఫోన్ పోటీ పడనుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999గా ఉంది. అయితే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో దీన్ని రూ.26,999కే కొనుగోలు చేయవచ్చు. ఇక 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.31,999గా ఉండగా, సేల్‌లో రూ.28,999కే లభించనుంది.

బ్లేజింగ్ బ్లూ, ఐసీ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన సేల్ అక్టోబర్ మూడో తేదీ నుంచి ప్రారంభం కానుంది. అమెజాన్, శాంసంగ్ వెబ్ సైట్లు, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ఒక రోజు ముందే ఈ ఫోన్ కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డులు లేదా ఈఎంఐ లావాదేవీల ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. దీంతోపాటు షాపింగ్ కూపన్ల ద్వారా మరో రూ.1,000 తగ్గించనున్నారు. అంటే మొత్తంగా రూ.25 వేలలోపు ధరకే ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చన్న మాట.

శాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్‌యూఐ 3.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోఎల్ఈడీ ప్లస్ డిస్‌ప్లే అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉండగా, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. 

కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 12 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, 5 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండనుంది. 25W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉండనున్నాయి. దీంతోపాటు యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా ఇందులో ఉండనున్నాయి. దీని మందం 0.74 సెంటీమీటర్లుగానూ, బరువు 173 గ్రాములుగానూ ఉండనుంది.

Also Read: రూ.7,500లోపే రియల్‌మీ కొత్త ఫోన్.. రెండు ఫోన్లు లాంచ్.. 43 రోజుల బ్యాటరీ లైఫ్!

Also Read: రూ.6 వేలలోపే కొత్త ఫోన్.. వాట్సాప్ కాల్స్ రికార్డ్ చేయవచ్చు.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Published at : 28 Sep 2021 04:11 PM (IST) Tags: samsung Samsung New Phone Samsung Galaxy M52 5G Samsung Galaxy M52 5G Specifications Samsung Galaxy M52 5G Features Samsung Galaxy M52 5G Price in India Samsung Galaxy M52 5G Launched in India Samsung Affordable 5G Phone

సంబంధిత కథనాలు

Amazon Deal: అమెజాన్‌లో ఈ ఫోన్‌పై భారీ ఆఫర్ - ఏకంగా రూ.12 వేలు తగ్గింపు!

Amazon Deal: అమెజాన్‌లో ఈ ఫోన్‌పై భారీ ఆఫర్ - ఏకంగా రూ.12 వేలు తగ్గింపు!

Amazon Deal: మీ భాగస్వామికి బెస్ట్ వాలంటైన్స్ డే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? - అమెజాన్‌లో వీటిపై ఓ లుక్కేయండి!

Amazon Deal: మీ భాగస్వామికి బెస్ట్ వాలంటైన్స్ డే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? - అమెజాన్‌లో వీటిపై ఓ లుక్కేయండి!

Elon Musk to Mr Tweet: ట్విట్టర్ లో పేరు మార్చుకున్న ఎలన్ మస్క్, ఆటాడేసుకుంటున్న నెటిజన్స్

Elon Musk to Mr Tweet: ట్విట్టర్ లో పేరు మార్చుకున్న ఎలన్ మస్క్, ఆటాడేసుకుంటున్న నెటిజన్స్

OnePlus 11R: లాంచ్ కు ముందే స్పెసిఫికేషన్‌లు లీక్, OnePlus 11R ప్రత్యేకతలు ఇవే!

OnePlus 11R: లాంచ్ కు ముందే స్పెసిఫికేషన్‌లు లీక్, OnePlus 11R ప్రత్యేకతలు ఇవే!

BharOS: ఆండ్రాయిడ్‌కి పోటీగా భారత ఓఎస్, ‘BharOS’ రూపొందించిన మద్రాస్ ఐఐటీ

BharOS: ఆండ్రాయిడ్‌కి పోటీగా భారత ఓఎస్, ‘BharOS’ రూపొందించిన మద్రాస్ ఐఐటీ

టాప్ స్టోరీస్

Tarak ratna Health Update : మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తారకరత్న, కుప్పం నుంచి గ్రీన్ ఛానల్

Tarak ratna Health Update : మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తారకరత్న, కుప్పం నుంచి గ్రీన్ ఛానల్

APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్‌కు 6,455 మంది ఎంపిక!

APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్‌కు 6,455 మంది ఎంపిక!

Perni Nani : అన్నీ మంచి చేస్తే రోడ్డెందుకు ఎక్కాల్సి వచ్చింది ? లోకేష్‌కు పేర్ని నాని కౌంటర్ !

Perni Nani : అన్నీ మంచి చేస్తే రోడ్డెందుకు ఎక్కాల్సి వచ్చింది ? లోకేష్‌కు పేర్ని నాని కౌంటర్ !

Pawan Kalyan: ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా - వివాదాస్పద టాపిక్ టచ్ చేసిన బాలయ్య - పవర్ ప్రోమో చూశారా?

Pawan Kalyan: ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా - వివాదాస్పద టాపిక్ టచ్ చేసిన బాలయ్య - పవర్ ప్రోమో చూశారా?