News
News
X

Huawei Nova 8 SE: హువావే కొత్త ఫోన్ వచ్చేసింది... సూపర్ డిస్‌ప్లే, అదిరిపోయే కెమెరా!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హువావే తన కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. అదే హువావే నోవా 8 ఎస్ఈ 4జీ.

FOLLOW US: 
 
హువావే నోవా 8 ఎస్ఈ 4జీ స్మార్ట్ ఫోన్ చైనాలో సైలెంట్‌గా లాంచ్ అయింది. హువావే నోవా 8 ఎస్ఈ సిరీస్‌లో ఇది మూడో స్మార్ట్ ఫోన్. కిరిన్ 710ఏ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. ఇందులో ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. వెనకవైపు 64 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

హువావే నోవా 8 ఎస్ఈ 4జీ ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో ఈ వేరియంట్ ధరను 2,099 యువాన్లుగా(సుమారు రూ.24,600) నిర్ణయించారు. డార్క్ బ్లూ, మ్యాజిక్ నైట్ బ్లాక్, సకురా స్నో క్లియర్ స్కై, సిల్వర్ మూన్ స్టార్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.

హువావే నోవా 8 ఎస్ఈ 4జీ స్పెసిఫికేషన్లు
హార్మొనీ ఓఎస్ 2.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. కిరిన్ 710ఏ ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కూడా ఇందులో ఉంది. మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్‌ను ఇందులో అందించలేదు.

ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.

News Reels

4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.1, యూఎస్‌బీ టైప్-సీ, యూఎస్‌బీ ఓటీజీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ద్వారా హెడ్‌ఫోన్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, జీపీఎస్, గ్లోనాస్, బైదు, గెలీలియో, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, గైరోస్కోప్, గ్రావిటీ సెన్సార్ కూడా ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 3800 ఎంఏహెచ్‌గా ఉంది. 66W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. దీని 0.75 సెంటీమీటర్లు కాగా, బరువు 180 గ్రాములుగా ఉంది.

Also Read: OnePlus RT: మనదేశంలో వన్‌ప్లస్ కొత్త ఫోన్.. ఫీచర్లు సూపర్.. ధర ఎంతంటే?

Also Read: Xiaomi 12: ఒకే ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ కెమెరా, మూడు 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. అదిరిపోయే మొబైల్ వచ్చేస్తుంది!

Also Read: Infinix New Phone: రూ.6 వేలలోనే కొత్త స్మార్ట్‌ఫోన్.. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ.. మిగతా ఫీచర్లు?

Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!

Also Read: 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 27 Nov 2021 06:46 PM (IST) Tags: Huawei Huawei Nova 8 SE 4G Huawei Nova 8 SE 4G Price Huawei Nova 8 SE 4G Specifications Huawei Nova 8 SE 4G Features Huawei Nova 8 SE 4G Launched Huawei New Phone హువావే నోవా 8 ఎస్ఈ 4జీ హువావే కొత్త ఫోన్

సంబంధిత కథనాలు

Bluebugging: ఈ కొత్త హ్యాకింగ్ గురించి చూస్తే మీ ఫోన్‌లో బ్లూటూత్ అస్సలు ఆన్ చేయరు!

Bluebugging: ఈ కొత్త హ్యాకింగ్ గురించి చూస్తే మీ ఫోన్‌లో బ్లూటూత్ అస్సలు ఆన్ చేయరు!

WhatsApp New Feature: వాట్సాప్ నుంచి మరో సూపర్ ఫీచర్, ఇకపై మీకు మీరే మెసేజ్ పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?

WhatsApp New Feature: వాట్సాప్ నుంచి మరో సూపర్ ఫీచర్, ఇకపై మీకు మీరే మెసేజ్ పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?

Samsung Galaxy S23 Series: త్వరలోనే Galaxy S23 సిరీస్ లాంచింగ్, ఫీచర్లు మామూలుగా లేవుగా!

Samsung Galaxy S23 Series: త్వరలోనే Galaxy S23 సిరీస్ లాంచింగ్,  ఫీచర్లు మామూలుగా లేవుగా!

Jio Network Outage: యూజర్లకు జియో షాక్‌! ఆగిపోయిన కాలింగ్‌, ఎస్‌ఎంఎస్‌, డేటా సేవలు!

Jio Network Outage: యూజర్లకు జియో షాక్‌! ఆగిపోయిన కాలింగ్‌, ఎస్‌ఎంఎస్‌, డేటా సేవలు!

స్మార్ట్‌వాచ్‌లు సేఫా లేక డేంజరా? ఇంతకూ నిపుణులు ఏం అంటున్నారు.!

స్మార్ట్‌వాచ్‌లు సేఫా లేక డేంజరా? ఇంతకూ నిపుణులు ఏం అంటున్నారు.!

టాప్ స్టోరీస్

TS Govt : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం, దివ్యాంగుల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ

TS Govt :  తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం, దివ్యాంగుల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ

NRI Hospital Godava : ఎన్నారై ఆస్పత్రి డైరక్టర్ల మధ్య గొడవలే కొంప ముంచాయా ? ఈడీ, ఐటీ దాడుల వెనుక అసలేం జరిగింది ?

NRI Hospital Godava : ఎన్నారై ఆస్పత్రి డైరక్టర్ల మధ్య గొడవలే కొంప ముంచాయా ? ఈడీ, ఐటీ దాడుల వెనుక అసలేం జరిగింది ?

Impact Player: ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ - ఒక ఆటగాడిని అదనంగా!

Impact Player: ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ - ఒక ఆటగాడిని అదనంగా!

Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?

Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?