iPhone SE 2020: రూ.28 వేలకే ఐఫోన్.. ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. ఎంత తగ్గించారంటే?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ యాపిల్ తన ఐఫోన్ ఎస్ఈపై భారీ తగ్గింపును అందించింది. ఈ ఫోన్ రూ.27,999కే అందుబాటులో ఉంది.
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న బిగ్ బచత్ ఢమాల్ సేల్‌లో ఐఫోన్ ఎస్ఈ(2020)పై భారీ తగ్గింపును అందించారు. ఈ సేల్‌లో రూ.27,999కే ఈ ఫోన్ అందుబాటులో ఉంది. పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్‌చేంజ్ చేసుకుంటే రూ.16,050 వరకు అదనపు తగ్గింపు లభించనుంది. దీంతోపాటు పలు బ్యాంక్ ఆఫర్లు కూడా దీనిపై అందించారు. 4.7 అంగుళాల రెటీనా హెచ్‌డీ డిస్‌ప్లే కూడా ఉంది. యాపిల్ ఏ13 బయోనిక్ చిప్‌ను ఇందులో అందించారు. ఫోన్ వెనకవైపు 12 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
యాపిల్ ఐఫోన్ ఎస్ఈ(2020) ధర, ఆఫర్లు
ఈ ఫోన్ అసలు ధర రూ.39,900 కాగా ఈ సేల్‌లో రూ.27,999కే అందుబాటులో ఉంది. ఇది 64 జీబీ వేరియంట్ ధర. ఇందులో 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.32,999గానూ, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.42,999గానూ ఉంది.
ఎక్స్‌చేంజ్ ఆఫర్ మాత్రమే కాకుండా దీని కొనుగోలుపై డిస్నీప్లస్ హాట్‌స్టార్ మొబైల్ యాన్యువల్ సబ్‌స్క్రిప్షన్ కూడా లభించనుంది. ఈ సబ్‌స్క్రిప్షన్ వాల్యూ రూ.499గా ఉంది. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు నుంచి కొనుగోలు చేస్తే ఐదు శాతం అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ కూడా లభించనుంది. కెనరా బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది.
యాపిల్ ఐఫోన్ ఎస్ఈ(2020) స్పెసిఫికేషన్లు
ఇందులో 4.7 అంగుళాల రెటీనా హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. యాపిల్ ఏ13 బయోనిక్ చిప్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఫోన్ వెనకవైపు 12 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 4కే 60 ఎఫ్‌పీఎస్ వీడియో రికార్డింగ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 7 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఐపీ67 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.
బ్లాక్, వైట్, ప్రొడక్ట్ రెడ్ రంగుల్లో ఈ ఫోన్ యాపిల్ ఆన్‌లైన్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. అయితే అక్కడ 64 జీబీ, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లు మాత్రమే ఉన్నాయి. 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను యాపిల్ ఆన్‌లైన్ స్టోర్‌లో విక్రయించడం లేదు. ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే దాన్ని కొనుగోలు చేయవచ్చు.
Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?
Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?
Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!