Airtel Vs China Hackers: ఎయిర్ డేటా లీక్, యూజర్లు షాక్ - ఇంతకీ కంపెనీ ఏం అంటోంది?
Airtel Vs Hackers: ఎయిర్‌టెల్‌కు చెందిన 37.5 కోట్ల వినియోగదారుల డేటా లీక్ అయిందని వార్తలు వస్తున్నాయి. కానీ ఎయిర్‌టెల్ దీన్ని ఖండించింది. ఎటువంటి డేటా లీక్ కాలేదని ప్రకటించింది.
Airtel User Data: భారతదేశంలో ఎయిర్‌టెల్ సేవలను ఉపయోగించే వినియోగదారుల సంఖ్య చాలా ఎక్కువ. ఎయిర్‌టెల్ భారతదేశంలోని కోట్లాది మంది వినియోగదారుల వ్యక్తిగత డేటాను కూడా కలిగి ఉంది. ఎయిర్‌టెల్ సర్వర్ నుండి సాధారణ ప్రజల వ్యక్తిగత డేటా లీక్ అయితే వారు చాలా నష్టపోతారు.
ఎయిర్‌టెల్‌పై పెద్ద ఆరోపణ
శుక్రవారం ఉదయం సోషల్ మీడియాలో ఒక వార్త వ్యాపించింది. ఇందులో చైనా హ్యాకర్లు భారతీ ఎయిర్‌టెల్ సర్వర్‌లను హ్యాక్ చేసి, వారి వినియోగదారుల డేటాను డార్క్ వెబ్‌లో అమ్మకానికి ఉంచారని తెలిపారు. ఈ వార్త వ్యాప్తి చెందిన వెంటనే వినియోగదారులు షాక్ అయ్యారు. అయితే ఎయిర్‌టెల్ దీని విషయంలో ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఆరోపణను పూర్తిగా ఖండించింది.
ఒక వినియోగదారు ఎక్స్‌లో కొన్ని ఫొటోలను షేర్ చేశారు. చైనీస్ హ్యాకర్లు ఎయిర్‌టెల్ సర్వర్‌ను హ్యాక్ చేశారని, దాదాపు 375 మిలియన్ల అంటే 37.5 కోట్ల మంది వినియోగదారుల డేటాను దొంగిలించారని పేర్కొన్నారు.
Also Read: 2 జీబీ ప్యాక్ కోసం 200 పెట్టాల్సిందే- ప్రజల జేబులకు జియో, ఎయిర్‌టెల్ చిల్లు
మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, ఇంటి చిరునామా మొదలైన ఎయిర్‌టెల్ వినియోగదారుల వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగిలించారు. ఈ డేటాను డార్క్ వెబ్‌లో విక్రయించడానికి అందుబాటులో ఉంచారు. ఈ నివేదిక ప్రకారం డార్క్ వెబ్‌లో ఎయిర్‌టెల్ వినియోగదారుల స్టోలెన్ డేటా ధర 50,000 డాలర్లుగా నిర్ణయించారు. అంటే మనదేశ కరెన్సీలో దాదాపు రూ. 41 లక్షలు. ఈ హ్యాకర్ గ్రూప్ పేరు 'xenZen' అని తెలుస్తోంది.
ఖండించిన ఎయిర్‌టెల్
ఈ ఆరోపణలను ఎయిర్‌టెల్ తీవ్రంగా ఖండించింది. ఈ నివేదిక పూర్తిగా నకిలీదని కంపెనీ పేర్కొంది. కంపెనీ సర్వర్‌పై ఎలాంటి సైబర్ దాడి జరగలేదు లేదా వినియోగదారు డేటా దొంగతనానికి గురికాలేదని పేర్కొంది.
ఎయిర్‌టెల్ ప్రతిష్టను దిగజార్చడం ద్వారా వ్యక్తిగత లబ్ధి పొందడమే ఈ ఆరోపణ లక్ష్యం అని ఎయిర్‌టెల్ పేర్కొంది. తాము ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశోధించామని, ఎయిర్‌టెల్ సర్వర్ నుంచి యూజర్ డేటా ఏదీ లీక్ కాలేదని కచ్చితంగా చెప్పగలమని పేర్కొంది.
— airtel India (@airtelindia) July 5, 2024