మీ మొబైల్ బ్లూటూత్ ఆన్‌చేసి వదిలేస్తున్నారా? చిక్కుల్లో పడినట్లే! ఇటీవల బ్లూ టూత్‌తో కనెక్టయ్యే ఇయర్ బడ్స్ వాడకం పెరిగింది. దీంతో బ్లూటూత్ ఎక్కువ సేపు ఆన్ చేసి ఉంచుతున్నారు. అది ఏ మాత్రం సేఫ్ కాదని నిపుణులు తెలుపుతున్నారు. హ్యాకర్స్ చాలా ఈజీగా.. మాల్ వేర్, ఫైల్స్, మెసేజ్ లు పంపించే ఛాన్స్ ఉంది. మనకు తెలియకుండానే ఈజీగా కాంటాక్ట్స్, ఫొటోలు, వీడియోలు హ్యాక్ చేయొచ్చు. మనకు తెలియకుండానే మన ఫోన్ నుంచి ఫోన్లు, మెసేజ్ లు పంపిస్తారు. కొన్ని కార్ల తాళాలు బ్లూ టూత్ తో కనెక్ట్ అయి ఉంటాయి. వాటిని ఈజీగా తీసి కారును దొంగతనం చేస్తారు. ఒక ఫోన్ నుంచి ఒక ఫోన్ కి వస్తున్న డేటాను ఈజీగా హ్యాక్ చేయొచ్చు. కనెక్టింగ్ రిక్వెస్ట్ లు పంపి, మెసేజ్ లు పంపి ఫోన్ ఫ్రీజ్ చేయడం, క్రాష్ చేయడం చేయొచ్చు. బ్లూ టూత్ ఇన్ క్రిప్ట్ చేసి మనం మాట్లాడే ఫోన్లు, మెసేజ్ లను వాళ్లు కూడా విని, చదువుతారు.