స్మార్ట్ ఫోన్, ఫీచర్ ఫోన్ ఏదైనా సిమ్ కార్డు మాత్రం తప్పనిసరి. సిమ్ కార్డులో మనం నంబర్స్ కూడా సేవ్ చేసుకోవచ్చు. ఒక సిమ్‌లో ఎన్ని నంబర్లు సేవ్ చేసుకోవచ్చో తెలుసా? నిజానికి అది సిమ్ కార్డు కెపాసిటీపై ఆధారపడి ఉంటుంది. సిమ్ కార్డులు వేర్వేరు సైజుల్లో వస్తాయి. 32కే, 64కే, 128కే సైజుల్లో సిమ్ కార్డులు ఉంటాయి. 32కే సైజు సిమ్ కార్డులో 250 కాంటాక్ట్స్ సేవ్ చేయవచ్చు. 64కే సైజు సిమ్ కార్డులో 500 కాంటాక్ట్స్ సేవ్ చేయవచ్చు. 128కే సైజు సిమ్ కార్డులో 1000 కాంటాక్ట్స్ సేవ్ చేయవచ్చు. అయితే ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లలోనే వేల కాంటాక్ట్స్ సేవ్ చేయవచ్చు.