ఆండ్రాయిడ్ ఫోన్లలో క్యాషీ ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలి. అప్పుడే ఫోన్లు మెరుగ్గా పనిచేస్తాయి. స్టోరేజ్ కూడా ఫ్రీ అవుతుంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో క్యాషీ ఎలా క్లియర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. అక్కడ మీరు ఏ యాప్ క్యాషీ క్లియర్ చేయాలనుకుంటున్నారో దానికి వెళ్లండి. అందులో స్టోరేజ్‌లోకి వెళ్లి క్లియర్ క్యాషీపై క్లిక్ చేయండి. అన్ని యాప్స్‌లో ఉండే క్యాషీ కూడా ఒకేసారి క్లియర్ చేయవచ్చు. సెట్టింగ్స్‌లో స్టోరేజ్‌లోకి వెళ్లి క్యాషీడ్ డేటాలో క్లియర్ క్యాషీడ్ డేటా ఆప్షన్ ఎంచుకోవాలి. ఇప్పుడు మీ ఫోన్‌లో క్యాషీ అంతా క్లియర్ అవుతుంది.