మోస్ట్ అవైటెడ్ వివో వీ30ఈ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,999గా నిర్ణయించారు. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999గా ఉంది. మే 9వ తేదీన వివో వీ30ఈ సేల్ ప్రారంభం కానుంది. వివో వీ30ఈలో 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ + 8 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. ముందువైపు సెల్పీల కోసం 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5500 ఎంఏహెచ్‌గా ఉంది. 44W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను వివో వీ30ఈ సపోర్ట్ చేయనుంది.