ప్రస్తుతం ప్రతి ఒక్కరు కచ్చితంగా వాడుతున్న యాప్ వాట్సాప్. నెట్ ఉంటే చాలు ఫ్రీగా ఎన్ని మెసేజ్ లు అయినా పంపొచ్చు. అయితే, ఆ చాట్ సేఫ్ ఉంచుకోవడం, లీక్ అవ్వకుండా చూసుకోవడం పెద్ద టాస్క్. ఈ మధ్యకాలంలో ఎన్నో స్కామ్ లు కూడా జరిగాయి. అందుకే, మన చాట్ ని మనమే సేఫ్ గా ఉంచుకోవాలి. అదెలా అంటే? డిసపియరింగ్ మెసేజస్ ని ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మెసేజ్ లు డిలీట్ అయిపోతాయి. చాట్ లాక్ ఆన్ చేసుకోవచ్చు. దానివల్ల మన ప్రైవేట్ మెసేజ్ లు వేరేవాళ్లు చదవలేరు. ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్ ఆన్ చేసుకుంటే మన చాట్స్, మెసేజ్ లు కనీసం వాట్సాప్ కంపెనీ కూడా చదవలేదు. సైలెన్స్ అన్ నాన్ కాలర్, కాల్ రిలే ఫీచర్ ఆన్ చేసుకుంటే స్పామ్ కాల్స్ రావు. క్లౌడ్ లో స్టోర్ చేసి బ్యాకప్ మెసేజ్ లను ఎన్ క్రిప్ట్ చేసుకోవాలి. దీంతో గూగుల్, యాపిల్ లాంటి పెద్ద కంపెనీల నుంచి మన డేటా సేఫ్ గా పెట్టుకోవచ్చు.