గూగుల్ క్రోమ్‌ని తెలుగులో కూడా వాడవచ్చని మీకు తెలుసా? దీని కోసం ముందుగా మీరు మొబైల్‌లో గూగుల్ క్రోమ్ యాప్ ఓపెన్ చేయాలి. కుడివైపు పైభాగంలో కనిపించే మూడు చుక్కలపై క్లిక్ చేయాలి. అనంతరం సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. సెట్టింగ్స్‌లో కిందకి వెళ్తే అక్కడ ‘లాంగ్వేజెస్’ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. లోపల ‘Chrome's Language’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎంచుకోవాలి. అక్కడ మీకు ఇంగ్లిష్‌తో పాటు కొన్ని భారతీయ భాషలు కనిపిస్తాయి. అందులో మీరు తెలుగును ఎంచుకోవాలి. వెంటనే క్రోమ్‌లో ఆప్షన్స్ అన్నీ తెలుగులో కనిపిస్తాయి. క్రోమ్ డెస్క్‌టాప్‌లో కూడా ఇలాగే లాంగ్వేజ్ మార్చుకోవచ్చు.