ప్రస్తుతం ఫోన్ల చోరీ లేదా పోగొట్టుకోవడం చాలా కామన్ అయిపోయింది. ఒకవేళ మీ ఫోన్ పోతే అందులోని బ్యాంకింగ్ యాప్స్‌ను వెంటనే డిలీట్ చేయాలి. అందులో ‘Manage Your Google Account Option’ను ఎంచుకోవాలి. ఇందులో ‘సెక్యూరిటీ’ ఆప్షన్‌లో ‘మేనేజ్ డివైస్’ను సెలక్ట్ చేయాలి. అనంతరం ‘మేనేజ్ ఆల్ డివైసెస్’లోకి వెళ్లాలి. అక్కడ మీరు పోగొట్టుకున్న డివైస్‌ను ఎంపిక చేసి దాని నుంచి లాగ్ అవుట్ చేయాలి. అందులో మీరు ఫోన్ లొకేషన్, లాగిన్ టైమ్‌ను కూడా చూసుకోవచ్చు. ‘ఫైండ్ మై డివైస్’ ఆప్షన్ ద్వారా ఫోన్ ఆన్‌లో ఉంటే ట్రాక్ చేయవచ్చు. దీని కోసం మీరు పోగొట్టుకున్న ఫోన్‌లో ఉన్న జీమెయిల్ అకౌంట్‌తో లాగిన్ అవ్వాలి. దీంతో పాటు పోలీసులకు ఫిర్యాదు కూడా చేయవచ్చు.