Meta AI: వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా యూజర్లకు గుడ్ న్యూస్ - ‘మెటా AI’ వచ్చేసింది, ఎలా వాడాలో తెలుసా?
జుకర్ బర్గ్ నేతృత్వంలోనే మెటా సంస్థ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా యూజర్ల కోసం ‘మెటా AI’ని అందుబాటులోకి తెచ్చింది. ఇకపై కావాల్సిన సమాచారాన్ని ఈజీగా పొందే అవకాశం ఉంది.
Meta AI in India: టెక్ దిగ్గజం మెటా సంస్థ రూపొందించిన ‘మెటా AI’ భారత్ లో అందుబాటులోకి వచ్చింది. ఈ సంస్థకు చెందిన వాట్సప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ సహా అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్స్ లో దీనిని ఉపయోగించుకునే అవకాశం ఉంది. ‘మెటా AI’ సాయంతో కంటెంట్ క్రియేట్ చేసుకోవడంతో పాటు తెలియని విషయాలను తెలుసుకునే అవకాశం ఉంది. ఆయా సోషల్ మీడియా యాప్స్ లోనే ‘మెటా AI’ సాయంతో అన్ని వివరాలను తెలుసుకోవచ్చు. భారత్ లో లామా 3 LLM ఆధారిత అత్యాధునిక AI అసిస్టెంట్ ను విడుదల చేసినట్లు మెటా సంస్థ ప్రకటించింది.
‘మెటా AI’తో లాభం ఏంటి?
‘మెటా AI’ సాయంతో కంటెంట్‌ను క్రియేట్ చేసుకోవడంతో పాటు సమీపంలోని రెస్టారెంట్లు, సినిమా హాల్స్, హోటల్స్ సహా పలు విషయాలను తెలుసుకునే అవకాశం ఉంది. ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్‌లో అవసరమైన కంటెంట్‌ను వెతికి పెట్టడంతో ‘మెటా AI’ ఉపయోగపడుతుంది. అంతేకాదు, ఓ పోస్టు పెట్టే ముందుకు దానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఉపయోగపడనుంది. ఆయా పర్యాటక ప్రాంతాల వివరాలతో పాటు అవసరమైన పూర్తి సమాచారాన్ని ‘మెటా AI’తో తెలుసుకునే అవకాశం ఉంది. 2 నెలల క్రితమే ‘మెటా AI’ అందుబాటులోకి వచ్చింది. అయితే, న్యూజిలాండ్, కెనడా, ఆస్ట్రేలియా దేశాల్లోనే దీనిపై టెస్ట్ రన్ చేశారు. ప్రస్తుతం భారత్ లోని వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. మెటా లామా 3పై రూపొందించబడిన ‘మెటా AI’ ఇప్పటి వరకు మెటా సంస్థ రూపొందించిన అత్యంత అధునాతన మోడల్ కావడం విశేషం.
వాట్సాప్ లో ‘మెటా AI’ ఎలా ఉపయోగించాలంటే?
⦿ ముందుగా వాట్సాప్ ఓపెన్ చెయ్యాలి.
⦿ ఏదైనా చాట్ లోకి వెళ్లాలి.
⦿ చాట్స్ ట్యాబ్ లోని ‘మెటా AI’ ఐకాన్‌పై క్లిక్ చెయ్యాలి.
⦿ కండీషన్స్ ను యాక్సెప్ట్ చెయ్యాలి.
⦿ ప్రాంప్ట్ ను సెలెక్ట్ చేసుకోండి. లేదంటే సొంతంగా టైప్ చేయండి.
⦿ ప్రాంప్ట్ చేసిన వర్డ్ ను పంపాలి.
⦿ అవసరమైన సమాచారం లభిస్తుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో ‘మెటా AI’ ఎలా ఉపయోగించాలంటే?
⦿ ఇప్పటికే ఉన్న ఏదైనా చాట్ ను ఓపెన్ చెయ్యాలి.
⦿ బాటమ్ లో ఉన్న మెసేజ్ ను ట్యాప్ చెయ్యాలి.
⦿ ‘@’ ఎంటర్ చేసి ‘మెటా AI’ క్లిక్ చెయ్యాలి.
⦿ ‘మెటా AI’లో మీ ప్రశ్నను అడగాలి.
⦿ వెంటనే మీకు అవసరం అయిన సమాచారం అందుతుంది.
Facebook మెసెంజర్ లో ‘మెటా AI’ని ఉపయోగించాలంటే?
⦿ ఇప్పటికే ఉన్న ఏదైనా చాట్‌ని ఓపెన్ చెయ్యాలి.
⦿ టెక్ట్స్ బార్ లో ‘@’ ఎంటర్ చేసి ‘మెటా AI’పై క్లిక్ చెయ్యాలి.
⦿ మీ ప్రశ్నను ‘మెటా AI’లో రాసి ఎంటర్ చెయ్యాలి.
వెంటనే మీకు కావాల్సిన సమాచారం లభిస్తుంది.
Also Read: అతిపెద్ద బ్యాటరీ, అరగంటలో ఫుల్ ఛార్జింగ్ - OnePlus Ace 3 Pro లాంచింగ్ ఎప్పుడంటే?