OnePlus Ace 3 Pro: అతిపెద్ద బ్యాటరీ, అరగంటలో ఫుల్ ఛార్జింగ్ - OnePlus Ace 3 Pro లాంచింగ్ ఎప్పుడంటే?
చైనీస్ స్మార్ట్ ఫోన్ సంస్థ వన్ ప్లస్ సరికొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకురాబోతోంది. తొలిసారి 6,100 mAh బ్యాటరీతో పాటు 100 వాట్స్ ఛార్జింగ్ సపోర్టుతో ఈ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయబోతోంది.
OnePlus Ace 3 Pro Launch Date Confirmed: ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్ ఫోన్లను వినయోగదారులకు పరిచయం చేయడంలో ముందుంటుంది చైనీస్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం వన్ ప్లస్. బడ్జెట్ ధరలో చక్కటి ఫీచర్లతో కస్టమర్లను బాగా ఆకట్టుకుంటుంది. ఈ కంపెనీ నుంచి మరో సూపర్ డూపర్ స్మార్ట్ ఫోన్ విడుదల కాబోతోంది. వచ్చే గురువారం నాడు OnePlus Ace 3 Pro చైనాలో లాంచ్ చేయబోతోంది. OnePlus నుంచి వస్తున్న ఈ హ్యాండ్ సెట్ సరికొత్త గ్లేసియర్ బ్యాటరీ సాంకేతికతను కలిగి ఉన్న తొలి స్మార్ట్ ఫోన్ కావడం విశేషం.
ఈ ఫోన్ ఏకంగా 6,100mAh బ్యాటరీతో వస్తుంది. అంతేకాదు, 5,000mAh బ్యాటరీ కంటే మరింత సన్నగా ఉండటం విశేషం. ఈ ఫోన్ సరికొత్త గ్లేసియర్ బ్యాటరీ స్నాప్ డ్రాగన్ 8 Gen 3పై ఆధారపడి రన్ అవుతుంది. ఈ బ్యాటరీని ప్రపంచ దిగ్గజ కంపెనీ కాంటెంపరరీ ఆంపెరెక్స్ టెక్నాలజీ కో లిమిటెడ్(CATL) తో కలిసి వన్ ప్లస్ తయారు చేసింది.
OnePlus Ace 3 Pro గ్లేసియర్ బ్యాటరీ ప్రత్యేకతలు
OnePlus Ace 3 Pro లోని కొత్త 6,100 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది కేవలం 5.51 మిల్లీ మీటర్ల మందాన్ని కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీ 100W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్టు చేస్తుందని OnePlus సంస్థ వెల్లడించింది. లేటెస్ట్ టెక్నాలజీతో రూపొందించిన ఈ బ్యాటరీ నాలుగు సంవత్సరాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పని చేస్తుందని తెలిపింది. OnePlus ఇచ్చిన సమాచారం మేరకు ఈ బ్యాటరీ 100W ఛార్జింగ్‌ని ఉపయోగించి 36 నిమిషాల్లో 100 శాతం ఛార్జ్ అవుతుంది. 6 శాతం సిలికాన్ కంటెంట్‌తో 763Wh/L ఎనర్జీ డెస్టినీని కలిగి ఉంటుంది.
OnePlus Ace 3 Pro looks gorgeous in this ceramic white finish 🤍
— OnePlus Club (@OnePlusClub) June 21, 2024
• It has new back camera design without metal hinge
• It also has pattern design and new logo of ‘Ace Performance’#OnePlus#OnePlusAce3Pro pic.twitter.com/ds2IMvo7bO
5 నిమిషాల ఛార్జ్ తో మూడున్నర గంటల వీడియో స్ట్రీమింగ్
ఇక ఈ బ్యాటరీ బ్యాటరీ బయోనిక్ హనీకోంబ్ స్ట్రక్చరల్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. తక్కువ వోల్టేజ్ డ్రాప్ తో పాటు స్టేబుల్ పవర్ డెలివరీ ద్వారా హ్యాండ్ సెట్ కు ప్రొటెక్షన్ ను అందిస్తుంది. అంతేకాదు, ఛార్జింగ్ వేగాన్ని కూడా పెంచినట్లు వన్ ప్లస్ వెల్లడించింది. 5 నిమిషాల ఛార్జ్ తో టిక్ టాక్ వంటి ప్లాట్ ఫారమ్ ను గరిష్టంగా రెండు గంటలపాటు చూసే అవకాశం ఉంది. నిరంతర గేమింగ్ లేదంటే మూడున్నర గంటల వీడియో స్ట్రీమింగ్‌ను అందిస్తుంది. OnePlus Ace 3 Pro 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్టుతో 6.78-అంగుళాల 1.5K 8T LTPO OLED డిస్ ప్లేను కలిగి ఉంటుంది. దీని ధర రూ. 34 వేల నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
Read Also: మాంచి కెమెరా ఫోన్ కావాలా? ఇవిగో ఈ ఫోన్లు ట్రై చెయ్యండి.. రూ.30 వేలకే అదిరిపోయే ఆప్షన్స్