Team India Vice Captain: రోహిత్‌కు డిప్యూటీగా కేఎల్ రాహుల్.. బీసీసీఐ వ్యూహమిదే!
రోహిత్ శర్మకు డిప్యూటీగా కేఎల్ రాహుల్ ఎంపిక లాంఛనమే కానుంది. టీమ్‌ఇండియా భవిష్యత్తు నాయకుడిని తయారు చేయాలన్న వ్యూహం ఇందులో ఉంది. మరికొన్ని రోజుల్లో నిర్ణయం రానుంది.
టీమ్‌ఇండియా వన్డే, టీ20 కెప్టెన్సీ సంగతి తేలిపోయింది. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మను పరిమిత ఓవర్ల క్రికెట్ నాయకుడిగా ప్రకటించారు. ఇక శాశ్వత వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను ప్రకటిస్తారని తెలిసింది. ఈ మేరకు సెలక్టర్లు, బీసీసీఐ పెద్దలు నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
విరాట్ కోహ్లీ టీ20 నాయకత్వం నుంచి తప్పుకోవడంతో రోహిత్ శర్మను కెప్టెన్‌గా చేశారు. న్యూజిలాండ్ సిరీస్ ముగియడంతో టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికాలో పర్యటించాల్సి ఉంది. అక్కడ టెస్టు సిరీసుతో పాటు వన్డే సిరీసు ఆడాల్సి ఉంది. చాన్నాళ్లుగా వన్డే సారథ్యం నుంచి కోహ్లీని తప్పిస్తారన్న అంచనాలు ఉన్నాయి. తెల్లబంతి క్రికెట్లోనే ఇద్దరు వేర్వేరు కెప్టెన్లను కొనసాగించడం మంచిది కాదని విశ్లేషకులు భావించారు. సెలక్షన్ కమిటీ సైతం దానికే ఆమోదం తెలిపింది.
ఇక రోహిత్ శర్మకు డిప్యూటీగా కేఎల్ రాహుల్ ఎంపిక లాంఛనమే కానుంది. టీమ్‌ఇండియా భవిష్యత్తు నాయకుడిని తయారు చేయాలన్న వ్యూహం ఇందులో ఉంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో కేఎల్ రాహుల్‌కు తిరుగులేదు. రెండేళ్లు వీరోచిత ఫామ్‌లో ఉన్నాడు. విజృంభించి మరీ పరుగులు చేస్తున్నాడు. ఐపీఎల్‌లో పంజాబ్‌కు కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది. కోహ్లీ, రోహిత్, ద్రవిడ్ వద్ద అతడు మరింత నేర్చుకుంటాడని సెలక్టర్లు భావిస్తున్నారు.
'కేఎల్ రాహులే తర్వాత వైస్ కెప్టెన్. పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడికే తొలి ప్రాధాన్యత. కొన్నేళ్లుగా అతడు అత్యుత్తమంగా రాణిస్తున్నాడు. మరో 6-7 ఏళ్లు ఆడగలడు. తర్వాతి కెప్టెన్‌గా ఎదగగలడు. రోహిత్, విరాట్, ద్రవిడ్‌తో సాన్నిహిత్యం వల్ల మరింత నేర్చుకోగలడు. ఇక రిషభ్ విషయానికి వస్తే అతడు యువకుడు. ఇప్పుడే అతడిపై అదనపు భారం మోపలేం. సీనియర్లతో కలిసి ఆడతాడు కాబట్టి నేర్చుకుంటాడు. ఇప్పుడే అతడికీ బాధ్యతలు అప్పగించడం సరికాదని నా అభిప్రాయం. రోహిత్‌కు విశ్రాంతినిచ్చిప్పుడు అతడిని తాత్కాలికంగా ఎంపికచేయొచ్చు' అని బీసీసీఐ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.
Also Read: ICC Test Rankings: మయాంక్ దూకుడు..! 10 వికెట్ల అజాజ్ ర్యాంకు ఎంత మెరుగైందంటే..!
Also Read: Watch: మళ్లీ కలిసిన యువీ, ధోనీ..! ఎక్కడ.. ఎందుకు?
Also Read: Australian Open 2022: ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు ఆ స్టార్ ఆటగాడు దూరం.. వీరిద్దరికీ లక్కీ చాన్స్!
Also Read: Rahul Dravid: ద్రవిడ్ శాసనం..! కుంబ్లే నాటి రూల్ కఠినతరం చేసిన వాల్.. ఇక ఎంత పెద్ద ఆటగాడైనా..!!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి