IND vs SA: సఫారీ గడ్డపై పేసర్లు దున్నేస్తారు.. రోహిత్ లోటు తెలుస్తుందన్న జహీర్
టీమ్‌ఇండియా టెస్టు సిరీసు గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మాజీ పేసర్ జహీర్ ఖాన్ అంటున్నాడు. గెలవాలంటే బ్యాటర్లు పరుగులు చేయడం ఎంత ముఖ్యమో బౌలర్లు 20 వికెట్లు తీయడం అంత ముఖ్యమని పేర్కొన్నాడు.
దక్షిణాఫ్రికాలో టీమ్‌ఇండియా టెస్టు సిరీసు గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మాజీ పేసర్ జహీర్ ఖాన్ అంటున్నాడు. గెలవాలంటే బ్యాటర్లు పరుగులు చేయడం ఎంత ముఖ్యమో బౌలర్లు 20 వికెట్లు తీయడం అంత ముఖ్యమని పేర్కొన్నాడు. ఈ సిరీసులో రోహిత్ శర్మ లేని లోటు కచ్చితంగా తెలుస్తుందని అంచనా వేశాడు. ముంబయిలో జాక్ మీడియాతో మాట్లాడాడు.
'ప్రణాళికలు రచించడం, కచ్చితత్వంతో అమలు చేయడంపైనే విజయం ఆధారపడి ఉంటుంది. టీమ్‌ఇండియా అన్నిటినీ సింపుల్‌గా ఉంచుకోవాలి. ఎప్పుడూ చేస్తున్నదే ఇప్పుడూ చేస్తే చాలు. వేర్వేరు పరిస్థితుల్లో కోహ్లీసేన ప్రతిసారీ విజయవంతం అవుతోంది. పైగా అన్ని పిచ్‌లు, దేశాల్లో రాణించే బౌలింగ్ విభాగం ఉంది' అని జహీర్ అన్నాడు.
టీమ్‌ఇండియా బ్యాటర్లు భారీ స్కోర్లు చేయాల్సిన అవసరం ఉందని జహీర్ పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికా పరిస్థితుల్లో భారత బౌలర్లు దుమ్మురేపుతారని అంచనా వేశాడు. 'సఫారీ దేశ పరిస్థితులను భారత బౌలర్లు ఆస్వాదిస్తారు. బ్యాటింగ్ విభాగంగా భారీ పరుగులు చేయడం అత్యంత అవసరం. కానీ విజయం కావాలంటే 20 వికెట్లు తీయాలి. మనోళ్లు ఆ పని సులువుగా చేయగలరు. ఏదేమైనా ఈ భారత జట్టు దక్షిణాఫ్రికాలో సిరీసు గెలవడం ఖాయం' అని జహీర్ ధీమా వ్యక్తం చేశాడు.
ఈ సిరీసులో రోహిత్ శర్మ లేని లోటు తెలుస్తుందని జహీర్ తెలిపాడు. 'హిట్‌మ్యాన్ నాణ్యమైన ఆటగాడు. అతడి లోటు కచ్చితంగా తెలుస్తుంది. అయితే టీమ్‌ఇండియాలో గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. చక్కగా ఓపెనింగ్ చేస్తున్నారు. జట్టు ఏ దిశగా ప్రయాణం చేస్తుందో వేచిచూడాలి. జట్టులో నిలకడగా ఆడేవాళ్లు ఉన్నారు. రిజర్వు బెంచీ పటిష్ఠంగానే ఉంది. అందుకే ప్రతి జట్టు యాజమాన్యం కోరుకొనే తియ్యని తలనొప్పి ఇది' అని పేర్కొన్నాడు.
Also Read: 83 Film Update: ప్రపంచకప్ గెలిచిన రోజు పస్తులతో పడుకున్న కపిల్ డెవిల్స్..! ఎందుకో తెలుసా?
Also Read: Virat Kohli Captaincy Row: కోహ్లీ, గంగూలీలో ఎవరిది అబద్ధమంటే.. రవిశాస్త్రి కామెంట్స్!
Also Read: Thaggedhe Le: ‘నీ అంత బాగా చేయలేదు బన్నీ’ అన్న జడ్డూ.. ఎందుకంటే?
Also Read: IND vs SA: ద్రవిడ్ అనుభవం 'బూస్టు' అంటున్న టీమ్‌ఇండియా ఇద్దరు మిత్రులు!
Also Read: Harbhajan Singh Retirement: బంతి పక్కన పెట్టేసిన భజ్జీ.. క్రికెట్ నుంచి పూర్తిగా వీడ్కోలు!
Also Read: Harbhajan Singh retirement: 711 వికెట్లు తీయడమంటే 'దబిడి దిబిడే'.. భజ్జీపై ద్రవిడ్, కోహ్లీ ప్రశంసలు