అన్వేషించండి
Narendra Modi Stadium: వరల్డ్‌కప్ ఫైనల్ పిచ్ యావరేజ్ అట, భారత్‌లో పిచ్‌లకు ఐసీసీ రేటింగ్
Narendra Modi Stadium: భారత్-ఆసీస్ ఫైనల్ మ్యాచ్ జరిగిన అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియంలోని పిచ్‌కు ఐసీసీ యావరేజ్ రేటింగ్ ఇచ్చింది.
![Narendra Modi Stadium: వరల్డ్‌కప్ ఫైనల్ పిచ్ యావరేజ్ అట, భారత్‌లో పిచ్‌లకు ఐసీసీ రేటింగ్ ICC rating of Narendra Modi Stadium Ahmedabad pitch India lost World Cup final Narendra Modi Stadium: వరల్డ్‌కప్ ఫైనల్ పిచ్ యావరేజ్ అట, భారత్‌లో పిచ్‌లకు ఐసీసీ రేటింగ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/08/ed92b9e4a93c8e80eff3aac843c4cd1c1702035805087872_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
వరల్డ్‌కప్ ఫైనల్ పిచ్ ఐసీసీ రేటింగ్ యావరేజే ( Image Source : Twitter )
భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ ముగిసి నెల రోజులు దాటినా ఇంకా అభిమానులు ఆ చేదు జ్ఞాపకాలను మర్చిపోవడం లేదు. కోట్ల మంది భారత అభిమానుల హృదయాలు ముక్కలు చేస్తూ.. కోటీ మంది ఆశలు గల్లంతు చేస్తూ ఆస్ట్రేలియా ఆరోసారి ప్రపంచకప్‌ను ఒడిసిపట్టింది. రోహిత్ సేనను ఫైనల్లో మట్టికరిపించి ఆరోసారి కంగారులు ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్నారు. కోటీ మంది అభిమానుల ఆశలను భగ్నం చేస్తూ స్వదేశంలో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా పరాజయం పాలైంది. వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి చవిచూశాక విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ డ్రెస్సింగ్ రూంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఓటమితో అభిమానుల గుండెలను రోహిత్ సేన కోత పెట్టింది. పుష్కర కాలం తర్వాత ఐసీసీ ట్రోఫీని ముద్దాడాలనే భారత జట్టు కల కలగానే మిగిలిపోయింది. ఆ టైంలో భారత క్రికెటర్ల మొహాలు చూస్తే వాళ్లు ఎంత బాధ పడ్డారో స్పష్టంగా కనిపించింది. అయితే భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో కీలక మ్యాచ్‌లకు సంబంధించిన పిచ్‌ల రేటింగ్‌ను ఐసీసీ విడుదల చేసింది.
అయితే భారత్-ఆసీస్ ఫైనల్ మ్యాచ్ జరిగిన అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియంలోని పిచ్‌కు ఐసీసీ యావరేజ్ రేటింగ్ ఇచ్చింది. పిచ్ చాలా మందకొడిగా ఉన్నట్లు ఆరోపించినా అవుట్ ఫీల్డ్ మాత్రం చాలా బాగుందని ఐసీసీ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ వెల్లడించారు. భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య వాంఖడే వేదికగా సెమీస్ జరిగిన పిచ్‌కు ఐసీసీ అధికారులు గుడ్ అనే రేటింగ్ ఇచ్చారు. రెండో సెమీస్ జరిగిన కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ పిచ్‌కు యావరేజ్ రేటింగ్ దక్కింది. ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య రెండో సెమీస్ జరిగిన పిచ్‌కు ఐసీసీ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ ‘వెరీ గుడ్’ రేటింగ్ ఇచ్చారు.
కోల్‌కతా, లఖ్‌నవూ, అహ్మదాబాద్, చెన్నై మైదానాల్లో ఆ జట్లతో టీమ్‌ఇండియా తలపడింది. అయితే, ఆ పిచ్‌లన్నింటికీ ఐసీసీ యావరేజ్’ రేటింగ్ ఇచ్చింది.
ప్రపంచకప్ 2023లో భారత్‌పై ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఓటమితో ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలోని ఆటగాళ్లతో పాటు అభిమానులు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఈ ఓటమి మైదానంలో ఉన్న లక్ష మందికిపైగా అభిమానులతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల హృదయాలను కలచివేసింది. టైటిల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 240 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. టీమిండియా బౌలర్లు మ్యాచ్‌ను బలంగానే ప్రారంభించారు. ఆరంభంలోనే వార్నర్ వికెట్ తీసి షమీ శుభారంభం ఇచ్చాడు. ఆ తర్వాత మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్ కూడా వెంటనే అవుటవ్వడంతో ఆసిస్ 47 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఫైనల్లో ఎలా ఆడాలో బాగా తెలిసిన ఆసిస్ బ్యాటర్లు నాలుగు వికెట్‌లు కోల్పోయి మరో 42 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాచ్ ముగిశాక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. రోహిత్ శర్మ పెవిలియన్‌కు తిరిగి వస్తుండగా అతని కళ్ల నుంచి నీళ్లు కనిపించాయి. అదే సమయంలో విరాట్ కోహ్లీ, మహ్మద్ సిరాజ్ కూడా చాలా ఎమోషనల్ అయినట్టు కనిపించారు. ఈ ఓటమితో ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలోని ఆటగాళ్లతో పాటు అభిమానులు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఈ ఓటమి మైదానంలో ఉన్న లక్ష మందికిపైగా అభిమానులతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల హృదయాలను కలచివేసింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion